1 00:00:10,135 --> 00:00:11,178 బూసాన్ 2 00:00:12,888 --> 00:00:14,640 (కొరియన్ లో) మీరు కచ్చితంగా చెప్పగలరా? 3 00:00:14,723 --> 00:00:17,351 అవును, కొత్తది కొనడానికి ఎంతో ఇది కూడా అంతే. 4 00:00:19,937 --> 00:00:21,355 (జపనీస్ లో) కోహ్ గారు! 5 00:00:21,438 --> 00:00:22,689 సరైన సమయానికి వచ్చారు. 6 00:00:22,773 --> 00:00:24,483 మీ కొత్త సూట్ సిద్ధంగా ఉంది. 7 00:00:26,068 --> 00:00:27,611 ఒక్క నిమిషం అండి. 8 00:00:28,904 --> 00:00:31,323 ముందు పాస్టర్ గారి పని ముగించి నా దగ్గరకు రండి. 9 00:00:34,117 --> 00:00:35,494 నాకేం కంగారు లేదు. 10 00:00:37,538 --> 00:00:38,539 అలాగే. 11 00:00:42,417 --> 00:00:44,294 మరీ అంత స్పష్టంగా తెలుస్తుంది అనుకోలేదు. 12 00:00:45,087 --> 00:00:47,881 నేను పాస్టర్ ని అని చూడగానే తెలుస్తుందా? 13 00:00:53,929 --> 00:00:56,640 ఈ చుట్టు పక్కల జరిగే వాటిని తెలుసుకోవడం నా బాధ్యత. 14 00:00:58,100 --> 00:01:00,352 అనారోగ్యంతో కొత్తగా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అని తెలుసుకున్నాకా… 15 00:01:01,603 --> 00:01:03,814 కాస్త దృష్టి పెట్టకుండా ఉండను కదా. 16 00:01:08,527 --> 00:01:10,070 ఇప్పుడు నాకు బాగానే ఉంది. 17 00:01:10,153 --> 00:01:12,030 చింతించాల్సిన పని లేదు. 18 00:01:12,114 --> 00:01:13,365 ఆ మాట వినడం సంతోషం. 19 00:01:20,122 --> 00:01:21,915 కానీ మీ బట్టలు మీకు పెద్దగా సూట్ కావడం లేదు. 20 00:01:23,834 --> 00:01:24,918 అలా అనిపిస్తుందా? 21 00:01:27,296 --> 00:01:29,173 ఈ సూట్ నిజానికి చనిపోయిన నా అన్నది. 22 00:01:34,344 --> 00:01:36,763 ఆయన కూడా జబ్బు చేసి చనిపోయాడా? 23 00:01:39,183 --> 00:01:40,184 లేదు. 24 00:01:41,101 --> 00:01:42,394 నా అన్న, సమొయేల్, 25 00:01:43,145 --> 00:01:44,897 జీవితంలో ఏ రోజూ అనారోగ్యం పాలు కాలేదు. 26 00:01:50,903 --> 00:01:52,154 స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయాడు. 27 00:01:54,031 --> 00:01:55,782 అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లాడిని. 28 00:01:58,702 --> 00:02:00,495 జపాను వాళ్ళు తీసుకెళ్లిన కుర్రోళ్లలో తను ఒకడు. 29 00:02:04,583 --> 00:02:06,710 ఆ తర్వాత తనని నేను మళ్ళీ చూడలేదు. 30 00:02:08,002 --> 00:02:09,295 అమవీరుడు అన్నమాట? 31 00:02:13,050 --> 00:02:15,010 నా మట్టుకైతే, నా అన్న మాత్రమే. 32 00:02:19,848 --> 00:02:22,601 ఏమైతేనేం, ఒక మగాడు బయట ఎలా కనిపిస్తాడనే విషయం చాలా ముఖ్యం. 33 00:02:23,352 --> 00:02:25,604 మొదటిగా పుట్టే అభిప్రాయమే జనంలో నిలిచిపోతుంది. 34 00:02:27,439 --> 00:02:29,066 అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. 35 00:02:30,359 --> 00:02:32,653 మరైతే ఇప్పుడు ఆ అభిప్రాయం ఎలా ఉంది? 36 00:02:33,487 --> 00:02:35,030 ఒక విలువ లేని మనిషివి అన్నట్టు ఉంది. 37 00:02:37,199 --> 00:02:39,201 నీకు సరిపోని బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు? 38 00:02:40,327 --> 00:02:44,623 గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం, దారుణమైన విషయం. 39 00:02:48,418 --> 00:02:51,338 నువ్వు ఇంకా నా సూట్ గురించే మాట్లాడుతున్నావా? 40 00:02:58,262 --> 00:02:59,680 కొత్తది తెచ్చుకో, పాస్టర్. 41 00:03:00,180 --> 00:03:01,348 కావాలంటే నేను డబ్బులు ఇస్తాను. 42 00:03:24,705 --> 00:03:26,456 అదంతా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. 43 00:03:27,958 --> 00:03:29,918 నా సూట్ కోసం నేను డబ్బులు చెల్లించగలను. 44 00:03:30,502 --> 00:03:32,129 ఎదురుచూసేలా చేశాను, క్షమించండి. 45 00:03:32,796 --> 00:03:34,965 కుట్లు సరిగ్గా ఉన్నాయో లేదో మళ్ళీ చూశా. 46 00:03:35,048 --> 00:03:37,426 సరిగ్గా సరిపోతుందో లేదో చూడండి. 47 00:03:42,139 --> 00:03:43,473 కినోషితా గారు, 48 00:03:44,183 --> 00:03:45,726 నేను కొత్త సూట్ తీసుకుందాం అనుకుంటున్నాను. 49 00:03:46,226 --> 00:03:48,061 నాకది వెంటనే కావాలి. 50 00:03:48,145 --> 00:03:50,272 త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, అప్పటికి అది సిద్ధం కావాలి. 51 00:03:50,355 --> 00:03:52,482 ఎంత మంచి విషయమో. 52 00:03:52,566 --> 00:03:56,195 అభినందనలు! మీ కొత్త సూట్ కలకాలం ఉండిపోయేలా అద్భుతంగా కుట్టి ఇస్తా. 53 00:03:56,695 --> 00:03:59,281 ఇంకొక మాట, దీనిని కూడా నా సైజుకు కుట్టండి. 54 00:03:59,990 --> 00:04:01,450 ఒకవేళ ఇది నాకు సరిపోకపోయినా, 55 00:04:01,533 --> 00:04:02,576 చెప్పలేం కదా. 56 00:04:02,659 --> 00:04:04,703 ఏదొక రోజు నా కొడుకు వేసుకుంటాడేమో. 57 00:04:04,786 --> 00:04:05,829 మంచి ఆలోచన. 58 00:04:06,413 --> 00:04:09,458 ముందు మీ పెళ్లి సూట్ ని సిద్ధం చేస్తాను. 59 00:04:09,541 --> 00:04:10,751 మూడు రోజులలో పూర్తవుతుంది. 60 00:04:12,044 --> 00:04:13,587 అయితే అప్పుడు వస్తా. 61 00:05:30,038 --> 00:05:31,790 మిన్ జిన్ లీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడినది 62 00:05:54,855 --> 00:05:58,025 దీని కారణంగా ఉండే పర్యవసానాల గురించి ఆలోచించావా? 63 00:05:59,526 --> 00:06:02,946 ఒక పెళ్లికాని పిల్ల గర్భవతి కావడం అంటే, 64 00:06:03,030 --> 00:06:05,699 ఎంత పరువు తక్కువ పని! 65 00:06:06,909 --> 00:06:10,287 ఆపైగా నీది కానీ బిడ్డను పెంచడమా? 66 00:06:12,039 --> 00:06:15,584 ఈ విషయమై నేను చాలా బాగా ఆలోచించి, ప్రార్దించే నిర్ణయం తీసుకున్నాను. 67 00:06:16,668 --> 00:06:19,129 పాస్టర్ షిన్, నా ప్రాణాలు కాపాడడానికి ఈ అమ్మాయిలు తమ ప్రాణాలకు తెగించారు. 68 00:06:20,547 --> 00:06:22,508 వీరి కోసం నేను ఈ మాత్రమైనా చేయాలి. 69 00:06:34,728 --> 00:06:35,979 లెగు, తల్లి. 70 00:06:44,112 --> 00:06:45,489 నా వంక చూడు. 71 00:06:50,953 --> 00:06:54,831 నువ్వు నీ మీద, నీ బిడ్డ మీద మాత్రమే కాదు 72 00:06:55,415 --> 00:06:56,750 నీ కుటుంబం మొత్తం మీద, అలాగే ఈ మంచి 73 00:06:57,584 --> 00:07:01,088 వ్యక్తి మీద కూడా ఎంతో బరువు వేశావు. 74 00:07:01,171 --> 00:07:02,256 నీకది అర్థం అవుతుందా? 75 00:07:03,841 --> 00:07:07,135 పాస్టర్ గారు, అలా అనడం అవసరమా? 76 00:07:08,178 --> 00:07:11,682 ఇలాంటి మాటలు అనడం నాకు సరదా కాదు, 77 00:07:12,266 --> 00:07:15,561 కానీ మనం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. 78 00:07:16,937 --> 00:07:20,190 మంచి వ్యక్తులు కూడా జనం బలహీనతలను 79 00:07:21,400 --> 00:07:24,778 తమ లాభానికి వాడుకుంటున్నారు. 80 00:07:30,492 --> 00:07:33,287 నువ్వు చేసిన పాపం ఎలాంటిదో నీకు తెలుస్తుందా? 81 00:07:39,459 --> 00:07:40,794 నా తప్పుకు క్షమించండి. 82 00:07:41,962 --> 00:07:43,297 క్షమించాలా? 83 00:07:43,797 --> 00:07:46,341 బిడ్డా, క్షమించాల్సింది నేను కాదు. 84 00:07:47,050 --> 00:07:51,430 క్షమాపణ కోసం నువ్వు దేవుడిని మాత్రమే వేడుకోవాలి. 85 00:07:54,349 --> 00:07:59,271 మీ కుటుంబం మత విశ్వాసాలు ఉన్న కుటుంబం కాదని నాకు తెలుసు, కాబట్టి నేను నిన్ను ఈ విషయం అడగాలి, 86 00:08:00,522 --> 00:08:01,732 నువ్వు కచ్చితంగా 87 00:08:02,774 --> 00:08:04,985 దేవునికి లోబడి ఉండగలవా? 88 00:08:12,910 --> 00:08:13,911 ఉండగలను. 89 00:08:19,458 --> 00:08:22,794 మీరిద్దరూ, ఇప్పుడు దగ్గరకు రండి. 90 00:08:36,015 --> 00:08:37,476 ప్రియమైన ప్రభువా, 91 00:08:39,977 --> 00:08:44,316 ఈ రోజు, ఈ ఇద్దరి కలయికను ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 92 00:08:47,069 --> 00:08:51,156 మీ కృప ద్వారా మాత్రమే, 93 00:08:51,823 --> 00:08:55,327 వీరు తమ దోషముల నుండి విముక్తి పొందగలరని ప్రార్థిస్తున్నాను. 94 00:08:57,955 --> 00:09:00,165 భార్యా భర్తలుగా 95 00:09:00,249 --> 00:09:05,212 వీరి మధ్య ఏర్పడబోయే ఆత్మీయ బంధం ఎప్పటికీ తెగిపోలేనిది 96 00:09:06,338 --> 00:09:08,131 అని వీరికి తెలియజేయి. 97 00:09:09,925 --> 00:09:15,514 ఒకరినొకరు గౌరవించుకుంటూ, సంసారం జరిపే విధానాన్ని తెలియజేయండి. 98 00:09:17,391 --> 00:09:23,230 నిజమైన, బలమైన ప్రేమ వీరి మధ్య ఏర్పడు గాక. 99 00:09:24,982 --> 00:09:31,405 యేసయ్య నామములో ప్రార్ధించి అడుగుచున్నాము. 100 00:09:33,532 --> 00:09:34,992 ఆమెన్. 101 00:09:51,925 --> 00:09:52,926 సర్. 102 00:09:54,136 --> 00:09:55,345 నమస్కారం. 103 00:09:56,096 --> 00:09:59,516 మీ పూటకూళ్ళ ఇల్లు బాగా బిజీగా నడుస్తున్నట్టు ఉంది కదా. 104 00:10:00,142 --> 00:10:01,602 మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయింది! 105 00:10:01,685 --> 00:10:02,853 అవును. 106 00:10:02,936 --> 00:10:05,439 నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది, 107 00:10:05,981 --> 00:10:08,066 చివరికి ఇక్కడికి మార్గం కూడా సరిగా గుర్తులేదు. 108 00:10:08,150 --> 00:10:12,529 ఏదైతేనేం, మీ ఇంట్లో ఉండేవారు చాలా సంతోషంగా ఉంటున్నారు అనుకుంట. 109 00:10:13,071 --> 00:10:15,866 నేను మొన్న వారమే కదా మీ అమ్మాయితో రెండు సంచుల బార్లీ పంపించాను? 110 00:10:15,949 --> 00:10:17,701 అప్పుడే పూర్తయిపోయాయా? 111 00:10:17,784 --> 00:10:19,203 ఇప్పుడు నీకెంత కావలి? 112 00:10:20,829 --> 00:10:22,414 నేను తెల్ల అన్నం కోసం వచ్చాను. 113 00:10:24,333 --> 00:10:25,792 నాకు ఎక్కువ అవసరం లేదు. 114 00:10:27,753 --> 00:10:28,795 రెండు గిన్నెలతో చాలు. 115 00:10:30,380 --> 00:10:32,049 అవసరమైతే ఇంకొంత డబ్బు ఇస్తాను. 116 00:10:32,132 --> 00:10:36,011 నేను అన్నాన్ని ఎవరికీ పడితే వారికి అమ్మను అని నీకు తెలుసు కదా. 117 00:10:36,094 --> 00:10:39,181 ఎవరైనా ఒక అధికారి వచ్చి 118 00:10:39,264 --> 00:10:42,142 జపాను వినియోగదారులకు సరిపడేంత అన్నం నా దగ్గర లేదని తెలుసుకుంటే, 119 00:10:42,226 --> 00:10:44,269 అప్పుడు నేను సమస్యలో పడతాను. 120 00:10:44,853 --> 00:10:46,522 నా దగ్గర ఉండే మిగతా గింజలు కూడా మంచి నాణ్యత ఉన్నవే. 121 00:10:50,108 --> 00:10:52,194 ఇవాళ నా కూతురికి పెళ్లి అయింది. 122 00:10:52,277 --> 00:10:53,278 సూన్జా? 123 00:10:53,362 --> 00:10:54,988 నిజంగానా? 124 00:10:55,614 --> 00:10:57,449 ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? 125 00:10:58,992 --> 00:11:01,912 ఆ పిల్ల చివరికి స్థిరపడింది అంటే నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు. 126 00:11:01,995 --> 00:11:03,747 కుర్రాడు చాలా మంచి వాడు. 127 00:11:04,831 --> 00:11:06,250 అంతా మా అదృష్టం. 128 00:11:06,917 --> 00:11:08,043 అలా అయితే, 129 00:11:08,126 --> 00:11:10,587 ఉదయమే కొన్ని చిరుధాన్యాలు వచ్చాయి. 130 00:11:10,671 --> 00:11:14,258 వాటికి నీకు బార్లీ రేటుకే ఇస్తాను. 131 00:11:18,971 --> 00:11:19,972 త్వరలోనే, 132 00:11:21,056 --> 00:11:23,350 తాను కూడా తన భర్తతో జపాను వెళ్ళిపోతుంది. 133 00:11:24,726 --> 00:11:28,105 కట్నంగా ఇవ్వడానికి కూడా నా దగ్గర పెద్దగా ఏం లేదు. 134 00:11:29,523 --> 00:11:32,442 కానీ తన దేశాన్ని వదిలి వెళ్లే ముందు, తన ఇంట పండిన అన్నం రుచి… 135 00:11:35,195 --> 00:11:37,155 తనకు తెలియాలి అనేదే నా కోరిక. 136 00:12:08,645 --> 00:12:10,063 మూడు గిన్నెలు. 137 00:12:11,106 --> 00:12:12,482 ధన్యవాదాలు. 138 00:12:12,566 --> 00:12:14,401 ఈ గింజల రుచితో అయినా 139 00:12:15,485 --> 00:12:18,989 మీ దుఃఖం కొంత తగ్గాలని ఆశిస్తున్నాను. 140 00:14:59,107 --> 00:15:00,400 ప్రార్థిద్దామా? 141 00:15:09,409 --> 00:15:10,744 సర్వశక్తిమంతుడగు తండ్రి, 142 00:15:12,037 --> 00:15:14,039 మాకిచ్చిన ఈ ఆహారాన్ని దీవించండి, 143 00:15:16,333 --> 00:15:17,835 అలాగే ఈ ఇంటికి, ఇంట్లో ఉండే వారిని 144 00:15:18,710 --> 00:15:20,879 ఆశీర్వదించి, కాపాడండి. 145 00:15:25,759 --> 00:15:27,678 వీరి కష్టకాలమున, 146 00:15:28,971 --> 00:15:30,264 వారికి నీడగా ఉండి చల్లగా చూడండి. 147 00:15:32,599 --> 00:15:36,228 ఏసు క్రీస్తు నామమున అడుగుతున్నాం. ఆమెన్. 148 00:15:54,788 --> 00:15:57,457 ఇక నుండి మీ అమ్మగారి వంట లేకుండా ఎలా ఉండగలం? 149 00:16:01,545 --> 00:16:04,923 ఈ చేతి వంట వల్లే నువ్వు ఇంత బలంగా ఉన్నావేమో, సూన్జా. 150 00:16:08,260 --> 00:16:10,387 మీ వదిన బాగా వండి పెడుతుందా? 151 00:16:14,141 --> 00:16:17,978 సన్ఈ వంట వండడం అంటే అదొక పెద్ద వింత అనాలి. 152 00:16:18,562 --> 00:16:20,355 వాళ్ళది ఒకప్పుడు ధనిక కుటుంబం. 153 00:17:14,701 --> 00:17:16,578 శ్రీమతి జాంగ్, అమెరికాలో, 154 00:17:16,662 --> 00:17:20,165 పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ పెద్దలను కనీసం అనుమతి కూడా అడగరు అని చెప్పింది. 155 00:17:20,958 --> 00:17:22,459 అసలు ఊహించగలవా? 156 00:17:23,794 --> 00:17:24,920 మనకైతే, 157 00:17:25,002 --> 00:17:28,549 మనల్ని చేసుకోబోయే వారు సూన్జా వాళ్ళ అమ్మనే అడగాలి అనుకుంట 158 00:17:29,132 --> 00:17:30,342 ఎంతైనా మనం అనాథలం కదా. 159 00:17:32,010 --> 00:17:35,138 నా పెళ్లి రోజున అన్నం ముద్దలు తినాలని నా కోరిక. 160 00:17:36,640 --> 00:17:37,850 వాటిని ఎవరితో కూర్చొని తింటావు? 161 00:17:37,933 --> 00:17:39,643 ఇంకెవరు, నీతోనే. 162 00:17:39,726 --> 00:17:41,353 భొకి కూడా ఉంటుంది అనుకో. 163 00:17:41,436 --> 00:17:43,897 అలాగే మీ అమ్మగారు, ఛంగ్ సోదరులు, 164 00:17:45,023 --> 00:17:46,275 అలాగే నేనంటే గిట్టని వారు కూడా. 165 00:17:47,818 --> 00:17:49,570 అతను ఎవరితోనూ మాట్లాడడు. 166 00:17:49,653 --> 00:17:51,613 ఆ ముసలోడు ఎంత కఠినుడో. 167 00:17:52,322 --> 00:17:56,410 నిన్న అతని పైప్ కింద పడేశానని ఎంత దారుణంగా చూసాడో. 168 00:17:56,493 --> 00:17:57,911 దానికి అసలు ఏమీ కాలేదు, 169 00:17:58,412 --> 00:18:00,289 అయినా నాకు ఏడ్పు వచ్చేసింది. 170 00:18:02,416 --> 00:18:05,460 కానీ ఆ ఇద్దరు సోదరులను ఆహ్వానించి, ఆయన్ని మాత్రమే పిలవకపోవడం బాగోదు. 171 00:18:07,004 --> 00:18:08,630 ఓహ్, అలాగే మందుల వ్యాపారి చు కూడా. 172 00:18:09,381 --> 00:18:10,924 ఆయన కూడా చూడడానికి మంచి వ్యక్తిలా ఉన్నాడు. 173 00:18:11,008 --> 00:18:12,509 మీరు ఈ చెత్త వాడుగు ఆపుతారా? 174 00:18:13,635 --> 00:18:15,679 మీ బుర్రలోకి కాస్త ఇంగిత జ్ఞానం తెచ్చుకుంటారా? 175 00:18:17,347 --> 00:18:19,933 నీకు, నాకు కుటుంబం అంటూ ఎవరూ లేరు. 176 00:18:21,894 --> 00:18:23,353 పేరు లేదు, కట్నం ఇవ్వలేం. 177 00:18:25,147 --> 00:18:28,984 మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం, ఏ బికారోడినో చేసుకోవడం. 178 00:18:31,862 --> 00:18:33,071 ఆ తర్వాత ఏంటి? 179 00:18:34,615 --> 00:18:36,283 కలిసి ఉండేంత డబ్బు ఎలాగు ఉండదు. 180 00:18:43,790 --> 00:18:44,958 ఇక పిల్లల్ని కంటే… 181 00:18:47,544 --> 00:18:50,714 వాళ్ళను కూడా మన దరిద్రపు బతుకుల్లోకి లాగినవాళ్ళం అవుతాం. 182 00:18:52,758 --> 00:18:54,593 అలాంటప్పుడు అవన్నీ చేసి ఏం లాభం? 183 00:18:55,594 --> 00:18:57,679 సుఖపడలేనప్పుడు ఇక మనలాంటి వాళ్ళు 184 00:18:58,722 --> 00:19:01,058 పెళ్లి చేసుకొని ఏం లాభం? 185 00:19:05,479 --> 00:19:06,939 మన బతుకులు ఇంతే. 186 00:19:11,276 --> 00:19:15,280 మనలాంటి వాళ్ళ బతుకులు మొదటి నుండి ఇంతే. 187 00:19:52,484 --> 00:19:54,319 ఏమాత్రం తగ్గకుండా, 188 00:19:54,403 --> 00:19:56,321 నిక్కి పైకి వెళ్తూనే ఉంది. 189 00:19:56,405 --> 00:19:58,740 నిన్నటి మార్కెట్ ముగిసే సమయానికి, 190 00:19:58,824 --> 00:20:02,035 సూచిక 33,000 మార్క్ దగ్గరకు చేరుకుంది. 191 00:20:03,370 --> 00:20:06,373 దీని కారణంగా, పేరుగాంచిన విశ్లేషకులు 192 00:20:06,456 --> 00:20:10,377 ఏడాది చివరికి మార్కెట్ 45,000 పాయింట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు, 193 00:20:10,878 --> 00:20:12,296 తద్వారా జపాను దేశం త్వరలో 194 00:20:12,379 --> 00:20:16,383 అమెరికాను అధిగమించి, ప్రపంచంలోనే అతిసంపన్న 195 00:20:16,466 --> 00:20:18,594 దేశం అవుతుందని అంచనా వేస్తున్నారు. 196 00:22:26,972 --> 00:22:28,307 నువ్వు త్వరగా వచ్చేసావే. 197 00:22:29,057 --> 00:22:30,184 అవును. 198 00:22:30,267 --> 00:22:32,978 ఈ డీల్ ముగించాలని ఆతృతగా ఉన్నది 199 00:22:33,562 --> 00:22:35,063 నేను మాత్రమే కాదు అనుకుంట. 200 00:22:35,814 --> 00:22:36,815 మనిద్దరికీ అదే కావాలి. 201 00:22:40,068 --> 00:22:41,403 నీకు నేను నచ్చను. 202 00:22:42,613 --> 00:22:43,739 అదేమైనా సమస్యా? 203 00:22:44,656 --> 00:22:46,533 నువ్వు త్వరలోనే వెళ్ళిపోతావు, అవునా? 204 00:22:50,037 --> 00:22:53,123 టామ్ మొదటిగా వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగె అనుకున్నావా? 205 00:22:53,207 --> 00:22:54,875 ఆయన ఇక్కడి వాడు కాదన్నట్టుగా? 206 00:22:55,751 --> 00:22:58,504 లేదా అతనితో సంబంధం వెంటనే మొదలైందా? 207 00:23:01,089 --> 00:23:02,257 అంటే, 208 00:23:02,341 --> 00:23:04,760 మీరిద్దరూ ఏం చేస్తారనేది నేను అస్సులు పట్టించుకోను. 209 00:23:05,302 --> 00:23:09,765 నువ్వు, నీతో పాటు అందరూ నాపై ఈర్ష్య పడ్డా నేను పట్టించుకోను. 210 00:23:10,557 --> 00:23:14,686 ఈ డీల్ పూర్తి చేయడమే నాకు ముఖ్యం. 211 00:23:18,023 --> 00:23:20,067 బెయిక్ గారు, మనకు ఎన్ని కాపీలు కావాలి? 212 00:23:20,150 --> 00:23:21,652 నేను అదంతా మెమోలో రాసి ఉంచాను. 213 00:23:23,737 --> 00:23:25,280 దయచేసి చదవండి. 214 00:23:39,253 --> 00:23:41,672 ఈయన షిప్లీస్ లో పని చేయడం ఎలా ప్రారంభించాడో తెలుసా? 215 00:23:42,673 --> 00:23:45,551 లేదు. ఇప్పుడు అదంతా ఎందుకు? 216 00:23:47,261 --> 00:23:48,762 ఆయన షిప్లీస్ కి రాకముందు, 217 00:23:49,638 --> 00:23:52,224 అరిమోటో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ కి పని చేసేవాడు. 218 00:23:53,350 --> 00:23:56,311 కానీ కొన్నాళ్ళకు, అరిమోటో తన సహోద్యోగులు ఎదగడం గమనించాడు, 219 00:23:56,395 --> 00:23:59,606 కానీ ఆయన స్థాయి మాత్రం అలాగే ఉండిపోయింది. 220 00:24:00,858 --> 00:24:03,777 ఆయన తన బృందానికి పెద్దగా సహాయపడలేకపోతున్నాడు అని పై అధికారులు వారించారు. 221 00:24:03,861 --> 00:24:06,321 కఠినమైన ట్రైనింగ్ చేయించి ఆయన్ని సిగ్గు పరచడానికి చూసారు. 222 00:24:06,822 --> 00:24:08,907 అయినప్పటికీ ఆయన తన పై అధికారుల అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. 223 00:24:09,491 --> 00:24:11,994 ఆ తర్వాత కొంత కాలానికి ఆయన్ని పనిలో నుండి తీసేసారు. 224 00:24:16,123 --> 00:24:17,291 మీ నాన్న, బెయిక్, 225 00:24:18,417 --> 00:24:19,918 ఆయన ఇప్పుడు పచింకో వ్యాపారం చేస్తున్నాడు, కదా? 226 00:24:22,921 --> 00:24:23,922 అయితే? 227 00:24:25,966 --> 00:24:29,386 నీ కుటుంబంలో జపాను కంపెనీలలో పని చేయలేదు. 228 00:24:30,596 --> 00:24:32,472 కాబట్టి నీకు అర్థం కాదు. 229 00:24:32,556 --> 00:24:35,684 ఇక్కడ ఒక ఉద్యోగికి, తాను పని చేసే కంపెనీ కుటుంబంతో సమానం, 230 00:24:35,767 --> 00:24:38,187 కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే అనొచ్చు. 231 00:24:40,522 --> 00:24:41,982 నా చిన్నప్పుడు, 232 00:24:42,065 --> 00:24:44,902 నేను రోజులో మా నాన్నను ఎన్ని నిమిషాలు చూశానో లెక్కపెట్టేదాన్ని. 233 00:24:46,570 --> 00:24:49,364 ఒక వారంలో, ఆ నిమిషాలు అన్నీ కలిపి గంటకు మించితే, 234 00:24:49,448 --> 00:24:51,450 ఆ వారం ఆయన నాతో ఎక్కువ సేపు గడిపారని సంబరపడే దాన్ని. 235 00:24:53,160 --> 00:24:54,494 ఇప్పుడు నీకు అర్థం అయి ఉంటుంది. 236 00:24:56,121 --> 00:24:58,790 అరిమోటోని ఉద్యోగంలో నుండి తీసేయలేదు… 237 00:25:00,792 --> 00:25:02,377 తన కుటుంబం ఆయన్ని వెలివేసింది. 238 00:25:04,755 --> 00:25:06,548 ఆ తర్వాత, 239 00:25:06,632 --> 00:25:09,843 వేరే ఏ పెద్ద సంస్థ ఆయనకి ఉద్యోగం ఇవ్వలేదు. 240 00:25:10,511 --> 00:25:12,763 అలా ఆయన ఇక్కడికి వచ్చాడు. 241 00:25:15,474 --> 00:25:16,767 ఆ కథలో ఏం అర్థం లేదు. 242 00:25:17,684 --> 00:25:20,229 షిప్లీస్ చాలా పెద్ద సంస్థ. 243 00:25:20,312 --> 00:25:21,813 అది అమెరికాలో అయ్యుంటుంది. 244 00:25:22,314 --> 00:25:26,276 కానీ ఇక్కడ, అరిమోటోలా దిక్కు లేని వారు చేరే ఒక చవకబారు ప్రదేశం ఈ కంపెనీ. 245 00:25:29,279 --> 00:25:31,114 మరి అలా అయితే నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? 246 00:25:32,366 --> 00:25:34,993 నువ్వు మంచి కాలేజీలో చదివావు, మంచి కుటుంబం నుండి వచ్చావు. 247 00:25:37,037 --> 00:25:39,331 అవును, ఆ కారణంగా దేశంలో ఉన్న చాలా 248 00:25:39,414 --> 00:25:42,751 పెద్ద బ్యాంకులు నాకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. 249 00:25:45,128 --> 00:25:48,924 కానీ నా తల్లితండ్రులను కాదని, నేను షిప్లీస్ లో చేరాను. 250 00:25:51,677 --> 00:25:53,136 తెలుసా, ఒక ఆడదానిగా, 251 00:25:53,220 --> 00:25:57,558 నా కంటే తక్కువ సాధించిన వారితో పనిచేయడం నాకు ఒకింతకు మంచిది. 252 00:26:00,519 --> 00:26:01,979 ఇక్కడ నేను ఎదగడానికి అడ్డంకులు ఉండవు. 253 00:26:08,110 --> 00:26:10,654 నువ్వు లేకపోతే మీ అమ్మ ఏమైపోతుందో? 254 00:26:13,031 --> 00:26:14,700 ఓహ్, అయ్యో. 255 00:26:16,743 --> 00:26:18,745 ఇవాళ ఏం అవసరం లేదు. అది నీకు నా బహుమతి. 256 00:26:19,329 --> 00:26:20,539 కానీ… 257 00:26:20,622 --> 00:26:21,707 త్వరగా ఇంటికి వెళ్ళు. 258 00:26:21,790 --> 00:26:22,791 త్వరగా! 259 00:27:18,972 --> 00:27:20,224 ఏమైనా సమస్యా? 260 00:27:33,320 --> 00:27:34,696 నువ్వు అతనితో వెళ్ళాలి. 261 00:27:38,158 --> 00:27:39,243 వెళ్ళు. 262 00:27:47,042 --> 00:27:48,293 మాకు కొంత సమయం ఇవ్వు. 263 00:28:02,474 --> 00:28:03,809 ఏం చేస్తున్నావు? 264 00:28:05,477 --> 00:28:07,896 నీతో ఇలా ఒంటరిగా నేను ఉండకూడదు. 265 00:28:22,703 --> 00:28:24,079 ఇప్పుడు సురక్షితంగా ఉందా? 266 00:28:29,001 --> 00:28:30,919 నువ్వు మొత్తానికి అనుకున్నది చేసావే? 267 00:28:32,421 --> 00:28:34,256 ఆ వెధవని పెళ్లి చేసుకున్నావు. 268 00:28:36,758 --> 00:28:40,012 ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసుకోకుండా, గుడ్డిగా అడుగులు వేస్తున్నావు. 269 00:28:43,223 --> 00:28:46,143 అవును, మేము కలిసాం. 270 00:28:50,439 --> 00:28:52,107 నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించినట్టు? 271 00:28:52,191 --> 00:28:53,942 నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దని చెప్పడానికి. 272 00:28:54,443 --> 00:28:56,945 వాడు తన మంచి తనం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావా? 273 00:29:01,491 --> 00:29:02,659 వాడిలో నేను చూసింది అది కాదు. 274 00:29:04,703 --> 00:29:09,499 తన రోగం వల్ల వేరే ఎవ్వరూ దొరక్క నిన్ను బుట్టలో వేసుకున్న ఒక రోగిష్టివాడు వాడు. 275 00:29:09,583 --> 00:29:11,168 ఆయన గురించి అలాంటి మాటలు ఎలా అనగలవు? 276 00:29:11,668 --> 00:29:13,128 ఆయన ఇప్పుడు నా భర్త. 277 00:29:14,713 --> 00:29:16,507 నువ్వు చేయలేనిది చేసి చూపించాడు ఆయన. 278 00:29:17,132 --> 00:29:19,593 నేను అంతకంటే ఎంతో నీకు ఇస్తాను అన్నాను. 279 00:29:20,928 --> 00:29:23,430 నాకు తలవంపును ఇస్తాను అన్నావు. అంతకు మించి ఇంకేం లేదు. 280 00:29:26,141 --> 00:29:27,684 నేను చాలా విన్నాను… 281 00:29:29,186 --> 00:29:31,897 నువ్వు జపాన్ లో ఏం చేసేవాడివి, ఎలాంటి వాడివి అని. 282 00:29:34,149 --> 00:29:35,984 వింటేనే కడుపు తిప్పింది. 283 00:29:40,113 --> 00:29:41,198 ఎన్నో మాటలు… 284 00:29:43,283 --> 00:29:45,536 ఆ మాటల్లో, 285 00:29:46,537 --> 00:29:48,539 అక్కడ నీకు ఎలాంటి బ్రతుకు ఉండేదని కూడా ఏమైనా విన్నావా? 286 00:29:49,790 --> 00:29:51,875 అక్కడ అన్నీ ఉన్నాయని అన్నావు. 287 00:29:51,959 --> 00:29:53,794 అవును, డబ్బు ఉంటేనే అదంతా. 288 00:29:53,877 --> 00:29:54,878 కానీ డబ్బు లేకపోతే… 289 00:29:57,005 --> 00:30:01,552 అక్కడ మాలాంటి వారి పరిస్థితిని చూసి, ఆ పరిస్థితుల్లో నుండి బ్రతికి బయటకు వచ్చాను నేను. 290 00:30:02,302 --> 00:30:06,515 నువ్వు వెళ్తే అలాగే బాధపడాలి అంటున్నాను. మన కొడుకు కూడా బాధపడాలి. 291 00:30:16,066 --> 00:30:17,109 సూన్జా… 292 00:30:24,783 --> 00:30:26,535 నువ్వు నిజంగా నన్ను మర్చిపోగలను అనుకుంటున్నావా? 293 00:30:28,203 --> 00:30:29,288 నన్ను మర్చిపోగలవా? 294 00:30:33,584 --> 00:30:35,419 నువ్వు నీ సంసారం సాగిస్తుండగా కూడా… 295 00:30:37,713 --> 00:30:40,132 నేను నీ జ్ఞాపకాలలో కచ్చితంగా ఉంటాను. 296 00:30:49,850 --> 00:30:50,851 వెళ్ళిపోకు. 297 00:30:57,566 --> 00:30:59,026 నీ కడుపులో నా బిడ్డ పెరుగుతోంది. 298 00:31:04,031 --> 00:31:05,365 కాదు. 299 00:31:06,241 --> 00:31:07,826 ఇది నా బిడ్డ. 300 00:31:10,579 --> 00:31:12,748 -నా బిడ్డ మాత్రమే. -తెలివితక్కువ పిల్లా! 301 00:31:13,540 --> 00:31:16,043 నువ్వు కూడా నీ భర్తలాగే చాలా తెలివితక్కువ దానివి. 302 00:31:20,005 --> 00:31:21,006 సరే. 303 00:31:23,008 --> 00:31:24,176 ఒసాకాకి వెళ్ళు. 304 00:31:27,721 --> 00:31:30,224 అక్కడికి వెళ్ళాక నిన్ను కాపాడమని నువ్వే నన్ను బ్రతిమిలాడుకుంటావు. 305 00:31:35,521 --> 00:31:37,356 కానీ అప్పటికి నాకు నీ పేరు కూడా గుర్తు ఉండదు. 306 00:31:58,544 --> 00:32:00,712 నువ్వు లేకపోతే మాకు రోజు ఎలా గడుస్తుంది? 307 00:32:00,796 --> 00:32:03,340 కాస్త భోజనం ఎక్కువ అడిగినప్పుడు మా వంక కోపంగా ఇక ఎవరు చూస్తారు? 308 00:32:03,423 --> 00:32:07,010 చింతించకు. దుంగ్యా ఇంకా భొకి ఇక్కడే ఉన్నారు కదా. 309 00:32:07,761 --> 00:32:10,389 వాళ్లిద్దరికీ నన్ను చూసి నవ్వడమే సరిపోతుంది. 310 00:32:11,098 --> 00:32:12,599 వాళ్లకు నేనొక జోకర్ లాంటి వాడిని. 311 00:32:16,353 --> 00:32:19,022 నా నుండి, నా సోదరుల నుండి చివరిగా మీకొక బహుమతి. 312 00:32:21,149 --> 00:32:22,150 దయచేసి తీసుకోండి. 313 00:32:24,361 --> 00:32:25,654 ధన్యవాదాలు. 314 00:32:40,419 --> 00:32:42,379 నేను ఉండలేను తల్లి. 315 00:32:45,299 --> 00:32:47,134 ఉండగలనేమో అనుకున్నాను, 316 00:32:48,010 --> 00:32:49,344 కానీ నా వల్ల కాదు. 317 00:32:50,929 --> 00:32:53,682 నువ్వు వెళ్తున్నావు అంటే తట్టుకోలేకపోతున్నాను. 318 00:32:55,767 --> 00:32:57,186 తట్టుకొని తీరాలి. 319 00:33:04,318 --> 00:33:05,444 అయినా కూడా… 320 00:33:07,070 --> 00:33:08,488 నువ్వు నాకోసం ఒకటి చేయాలి. 321 00:33:10,532 --> 00:33:11,742 మాట ఇస్తావా? 322 00:33:20,083 --> 00:33:21,502 నా అమ్మ… 323 00:33:26,507 --> 00:33:28,008 ఆమెను బాగా చూసుకుంటావా? 324 00:33:45,400 --> 00:33:46,401 ఏడవకు. 325 00:33:54,493 --> 00:33:56,620 వీటిని చేసిన వ్యక్తి, 326 00:33:57,913 --> 00:34:02,084 బాతులు శాశ్వతంగా జతకడతాయి అన్నాడు. 327 00:34:03,669 --> 00:34:05,212 భొకి, ఇది మరీ ఎక్కువ. 328 00:34:05,796 --> 00:34:07,464 నువ్వు దీన్ని మళ్ళీ ఇవ్వాలి గుర్తుంచుకో. 329 00:34:11,927 --> 00:34:14,221 అక్కడ సంతోషంగా జీవించండి, 330 00:34:14,304 --> 00:34:15,472 అర్థమైందా? 331 00:34:19,893 --> 00:34:21,937 జీవితం సాఫీగా సాగదు. 332 00:34:25,815 --> 00:34:27,693 కానీ ఇది నీకొక నూతన ఆరంభం అవుతుంది. 333 00:34:29,277 --> 00:34:31,280 దీన్ని పాడు చేసుకోకు. 334 00:34:37,286 --> 00:34:40,205 ఇక చాలు. ఇలాగే ఆపితే వాళ్ళిక వెళ్లరు. 335 00:34:43,458 --> 00:34:45,793 అమ్మా, వాటిని నేను తీసుకుంటాలే. 336 00:34:45,878 --> 00:34:47,880 అదేం పట్టించుకోకు. నేను తీసుకొస్తాలే. 337 00:34:48,422 --> 00:34:50,424 -దయచేసి… -ఇక చాలు! 338 00:35:34,551 --> 00:35:35,552 అమ్మా. 339 00:35:39,014 --> 00:35:40,599 నువ్వు కచ్చితంగా వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నావా? 340 00:35:43,644 --> 00:35:46,355 ఏం మాట్లాడుతున్నావు? మనం విమానం టికెట్లు కూడా కొనేశాం. 341 00:35:46,438 --> 00:35:47,439 నడువు. 342 00:35:59,409 --> 00:36:02,120 మీకోసం ఎదురుచూస్తున్నాం. దయచేసి ఇలా రండి. 343 00:36:18,095 --> 00:36:19,429 మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. 344 00:36:21,014 --> 00:36:22,850 టామ్ ఆండ్రూస్, షిప్లీస్ బ్యాంక్ నుండి. 345 00:36:26,645 --> 00:36:28,605 నేను వాయే సంస్థ నుండి వచ్చిన అబే. 346 00:36:31,775 --> 00:36:34,570 బామ్మ, నిన్ను మళ్ళీ చూడడం సంతోషం. 347 00:36:37,406 --> 00:36:39,658 ఇక చాలు! త్వరగా పని పూర్తి చేద్దాం. 348 00:36:49,293 --> 00:36:51,378 ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తే కాస్త సౌకర్యంగా ఉంటుంది. 349 00:36:56,800 --> 00:36:58,886 నేను వెళ్లి మన ప్రయాణ పేపర్లపై అనుమతి తీసుకొని వస్తా. 350 00:37:15,652 --> 00:37:17,154 ఆమె పెద్ద గాయని అంట. 351 00:37:18,071 --> 00:37:19,531 చాలా అందంగా ఉంది. 352 00:37:23,702 --> 00:37:24,828 ఆగండి! 353 00:37:31,543 --> 00:37:32,961 ధన్యవాదాలు. 354 00:37:33,045 --> 00:37:34,713 నేను ప్రేమించే వ్యక్తి నాకు దీనిని ఇచ్చారు. 355 00:37:38,258 --> 00:37:39,510 బిడ్డ పుట్టడానికి గడువు ఇంకెంత కాలం ఉంది? 356 00:37:42,346 --> 00:37:43,680 మరొక రెండు నెలల్లో. 357 00:37:44,848 --> 00:37:46,975 కానీ దేశం వదిలి వెళ్తన్నావా? 358 00:37:49,561 --> 00:37:52,022 నాకు ఈ మధ్యనే పెళ్లి అయింది. 359 00:37:56,193 --> 00:37:57,361 అలాగా. 360 00:37:59,029 --> 00:38:04,243 అయితే, ఈ రాత్రికి మనందరి కోసం పాట పాడతాను. 361 00:38:06,787 --> 00:38:07,871 నీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. 362 00:38:17,714 --> 00:38:20,217 మీకు మా విశిష్టమైన అతిథులతో కలిసి స్వాగతం పలుకుతున్నాం. 363 00:38:21,051 --> 00:38:27,266 అమెరికన్లు జపాను వారిని ఎలాగైతే చాచిన చేతులతో తమ దేశంలోకి స్వాగతించారో, 364 00:38:27,933 --> 00:38:29,518 అదే సానుకూల భావనను నేడు మీ నుండి మేము అందుకుంటున్నాం. 365 00:38:30,102 --> 00:38:31,812 అలాగే నేను కచ్చితంగా ఒక మాట చెప్పగలను, 366 00:38:32,938 --> 00:38:35,315 ఈ హోటల్ తెరిచిన తర్వాత, 367 00:38:36,191 --> 00:38:38,944 మీకోసం ఒక సూట్ గదిని ఒక వారాంతానికి ఇమ్మని… 368 00:38:40,028 --> 00:38:42,531 కోల్టన్ హోటల్స్ వారిని ఒప్పిస్తాం. 369 00:38:45,450 --> 00:38:47,828 సరే అయితే, ఇక ప్రారంభిద్దాం. 370 00:38:48,328 --> 00:38:52,291 ఒప్పందానికి మీ సమ్మతి మేము ఇంతకు ముందే అందుకున్నాం కాబట్టి… ఇదుగోండి. 371 00:38:54,459 --> 00:38:57,337 …మీరు సంతకం చేయాల్సిన పది కాపీలు ఇక్కడ ఉన్నాయి. 372 00:38:58,964 --> 00:38:59,965 ఇదుగోండి. 373 00:39:00,674 --> 00:39:06,221 దయచేసి ఎక్కడైతే మార్క్ చేయబడిందో అక్కడ సంతకం చేయండి. 374 00:39:06,305 --> 00:39:07,306 ఇదుగోండి. 375 00:39:21,862 --> 00:39:23,488 ఇది మేము మీకు ముందు వినిపించిన అదే ఒప్పందం. 376 00:39:26,366 --> 00:39:27,826 నువ్వు దాన్ని కనీసం చూడలేదు కూడా. 377 00:39:28,493 --> 00:39:30,204 అలాంటప్పుడు కచ్చితంగా ఎలా చెప్తున్నావు? 378 00:39:37,169 --> 00:39:40,547 నువ్వు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. 379 00:39:41,048 --> 00:39:42,549 చాలా జాగ్రత్తగా ఉండు. 380 00:39:44,968 --> 00:39:46,345 ఒక భార్యగా, 381 00:39:46,428 --> 00:39:47,846 ఒక తల్లిగా, 382 00:39:47,930 --> 00:39:49,765 నీవైపు వేలెత్తడానికి అవకాశం ఇవ్వకూడదు. 383 00:39:49,848 --> 00:39:50,849 చెప్పేది అర్థమవుతుందా? 384 00:39:51,808 --> 00:39:52,809 అర్థమైంది. 385 00:39:54,436 --> 00:39:57,564 నీ అత్తమామలను చాలా బాగా చూసుకోవాలి. అర్థమైందా? 386 00:40:02,152 --> 00:40:04,988 నిన్ను తక్కువగా చూడొచ్చు, హింసించినా చెప్పలేం. 387 00:40:06,031 --> 00:40:07,199 కానీ ఓపికగా ఉండు, 388 00:40:08,283 --> 00:40:09,868 కృతజ్ఞతతో ఉండు, సరేనా? 389 00:40:14,039 --> 00:40:16,416 ఇంకొక వ్యక్తిని చూసుకోవడం సులభమైన పని కాదు. 390 00:40:18,168 --> 00:40:19,169 అలాగే సూన్జా… 391 00:40:24,132 --> 00:40:26,093 నువ్వు ఇప్పుడు బిడ్డతో ఉన్నా కూడా… 392 00:40:28,804 --> 00:40:30,138 నీకు కష్టం అనిపించినా… 393 00:40:33,600 --> 00:40:35,978 నీ భర్తను సుఖపెట్టాల్సిన బాధ్యత నీపై ఉంది. 394 00:40:37,145 --> 00:40:38,856 ఆయన పాస్టర్ అయినా, మగాడే కదా. 395 00:40:41,608 --> 00:40:43,277 మంచి వ్యక్తులు కూడా పరాయి స్త్రీ 396 00:40:44,736 --> 00:40:46,446 దగ్గరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 397 00:40:48,949 --> 00:40:51,326 అసలు నువ్వు ఎలా గర్భవతివయ్యావో నాకు తెలీడం లేదు. 398 00:40:51,910 --> 00:40:53,787 నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. 399 00:41:05,549 --> 00:41:06,884 చాలా రోజుల క్రితం, 400 00:41:06,967 --> 00:41:08,302 మీ నాన్నమ్మ వీటిని నాకు ఇచ్చింది… 401 00:41:12,639 --> 00:41:16,560 నేను ఇల్లు వదిలి పారిపోను అని నిశ్చయించుకున్నాకా. 402 00:41:18,979 --> 00:41:20,272 వీటిని సురక్షితమైన ప్రదేశంలో దాచుకో. 403 00:41:20,856 --> 00:41:23,066 నీ భర్తకు కూడా చెప్పకు, సరేనా? 404 00:41:23,692 --> 00:41:26,820 ఒక ఆడదానికి కొంత డబ్బు తన నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. 405 00:41:28,030 --> 00:41:32,659 ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. మగాళ్ల లాగ మనం అన్నీ చేయలేము. 406 00:41:35,037 --> 00:41:37,497 లేదు, వీటిని నీ దగ్గరే ఉంచుకో. 407 00:41:38,790 --> 00:41:39,791 నా దగ్గర… 408 00:41:42,294 --> 00:41:43,295 ఇది ఉంది. 409 00:41:44,505 --> 00:41:46,089 ఇదేంటీ? 410 00:41:50,761 --> 00:41:51,929 ఇది నీ బిడ్డ తండ్రి ఇచ్చాడా? 411 00:41:52,012 --> 00:41:53,555 ఇది అతనే ఇచ్చాడా? 412 00:41:55,307 --> 00:41:56,475 ఇలాంటిది ఇవ్వడం… 413 00:42:02,022 --> 00:42:04,024 ఇప్పుడు అదంతా ఎందుకు? 414 00:42:06,318 --> 00:42:07,486 సూన్జా. 415 00:42:08,362 --> 00:42:11,365 నువ్వు ఇక అతన్ని మర్చిపోవాలి. 416 00:42:11,448 --> 00:42:12,908 అర్థమైందా? 417 00:42:12,991 --> 00:42:14,576 నాకు తెలుసు. 418 00:42:24,711 --> 00:42:25,921 ఇదుగో. 419 00:42:26,588 --> 00:42:28,465 నీ నాన్న ఉంటే ఇవి నీ దగ్గర ఉండాలని కోరుకునేవారు. 420 00:42:32,469 --> 00:42:35,639 నీకు ఎంతో చేయాలని ఆశపడ్డారు. 421 00:42:38,642 --> 00:42:42,187 నేనేమో, నువ్వు ఇక్కడే ఉండిపోవాలని ఏవేవో అనుకున్నా… 422 00:42:45,232 --> 00:42:47,734 కానీ మీ నాన్న నువ్వు ప్రపంచాన్ని చుట్టాలని ఆశపడ్డారు. 423 00:42:59,955 --> 00:43:02,165 రానున్న రోజుల్లో నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. 424 00:43:05,294 --> 00:43:07,337 మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో నాకు తెలీదు. 425 00:43:09,798 --> 00:43:11,633 చాలా కాలం పట్టవచ్చు. 426 00:43:17,139 --> 00:43:18,140 బాధపడకు. 427 00:43:18,849 --> 00:43:21,059 నీ కన్నీళ్ళన్నిటిని ఇక్కడే విడిచెయ్. 428 00:43:23,187 --> 00:43:25,272 ఆ దేశంలో నీ కన్నీరు కారడం నాకు ఇష్టం లేదు. 429 00:43:28,650 --> 00:43:31,153 -నా బిడ్డా. -ఓడ ఎక్కే సమయం అయింది. 430 00:43:32,779 --> 00:43:35,532 అమ్మా! అమ్మా! 431 00:43:38,035 --> 00:43:40,204 టోకుజు మారు 432 00:44:11,610 --> 00:44:12,611 నాకు కడుపు తిప్పుతుంది. 433 00:44:28,752 --> 00:44:30,337 అమ్మా, 434 00:44:31,129 --> 00:44:33,340 నువ్వు ముఖ్యమైన వారిని ఎదురు చూసేలా చేస్తున్నావు. 435 00:44:34,925 --> 00:44:36,635 ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడు. 436 00:44:38,220 --> 00:44:40,931 వాళ్లకు వేరే ఇతర కార్యక్రమాలు కూడా ఉండి ఉంటాయి. 437 00:45:02,619 --> 00:45:04,329 బామ్మ, నువ్వే గెలిచావు. 438 00:45:06,373 --> 00:45:09,334 ఇవాళ నువ్వు నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఎంతో ఆస్తిని ఇవ్వబోతున్నావు. 439 00:45:11,044 --> 00:45:14,256 వాళ్ళిక ఎన్నటికీ డబ్బు కోసం చింతించాల్సిన పని లేదు. 440 00:45:14,923 --> 00:45:16,758 ఆ మాట వినడానికి నాకు ఒక శాపంలాగ ఉంది. 441 00:45:17,259 --> 00:45:20,512 ఇవాళ మా నాన్నమ్మ ఏం చేస్తుందో తెలుసా? 442 00:45:20,596 --> 00:45:23,182 ఇల్లు వదిలి వచ్చిన తర్వాత, మళ్ళీ మొదటి సారి కొరియాకు వెళ్తుంది. 443 00:45:25,267 --> 00:45:27,978 యాభై ఏండ్ల క్రితం వట్టి చేతులతో ఇక్కడికి వచ్చింది. 444 00:45:28,812 --> 00:45:30,939 కానీ ఇవాళ ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రయాణం చేసి వెనక్కి వెళ్తుంది. 445 00:45:33,317 --> 00:45:34,902 అది జీవితం అంటే. 446 00:45:43,327 --> 00:45:48,790 ఈ బికారోళ్లను చూడు! వీళ్ళ వల్ల ఓడ అంతా కంపు కొడుతోంది. 447 00:45:50,167 --> 00:45:51,835 నేను మరొక చోటికి వెళ్తాను. 448 00:45:51,919 --> 00:45:54,213 ఇక్కడే ఉండు. నేను నీకోసం నీళ్లు తెస్తాను. 449 00:45:54,838 --> 00:45:57,674 నన్ను వదిలి వెళ్లొద్దు. వెళ్లొద్దు. 450 00:45:58,926 --> 00:46:00,260 నన్ను వదిలి వెళ్లొద్దు. 451 00:46:00,344 --> 00:46:01,845 నేను వెంటనే వస్తాను. 452 00:47:03,907 --> 00:47:08,161 ఇవాళ నా ప్రదర్శనను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. 453 00:47:28,432 --> 00:47:30,267 ఇక్కడ నీరు ఎక్కడ దొరుకుతుంది? 454 00:47:50,370 --> 00:47:53,707 మీరంతా ఎవరు? 455 00:47:53,790 --> 00:47:57,377 మేము అక్కడి గనుల్లో పని చేయడానికి వెళ్తున్నాం. మా ప్రయాణానికి కంపెనీ పెట్టుబడి పెడుతుంది. 456 00:47:57,461 --> 00:47:59,421 మరి మహిళలు, పిల్లల సంగతి? 457 00:47:59,505 --> 00:48:00,797 మీ కుటుంబాలు ఎక్కడ? 458 00:48:01,507 --> 00:48:05,177 మేము బాగా పని చేస్తే, తర్వాత మా వారిని తీసుకురావడానికి కూడా పెట్టుబడి పెడతాం అన్నారు. 459 00:48:09,890 --> 00:48:15,103 ఇక్కడికి ముందు మా నాన్న వచ్చారు. 460 00:48:18,357 --> 00:48:23,111 నేను, మా అమ్మ ఆ తర్వాత కొన్నాళ్ళకు వచ్చాము. 461 00:48:24,196 --> 00:48:25,656 మేడం, ఇది… 462 00:48:31,578 --> 00:48:36,625 ఆయన ఇక్కడి చికొనో గనుల్లో పని చేయడానికి వచ్చారు. 463 00:48:38,377 --> 00:48:41,505 పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. 464 00:48:41,588 --> 00:48:46,593 ఎంత దారుణంగా అంటే, వచ్చిన 400 మంది కార్మికులు సమ్మె చేయాల్సి వచ్చింది. 465 00:48:47,928 --> 00:48:48,929 ఏం జరుగుతుంది? 466 00:48:49,012 --> 00:48:50,597 కానీ, 467 00:48:50,681 --> 00:48:56,103 వాళ్లు 20 రోజులు పని చేశాక వారిని పనిలో నుండి తీసేశారు. 468 00:49:03,944 --> 00:49:08,407 అప్పట్లో, మన కొరియన్లకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు కాదు. 469 00:49:09,241 --> 00:49:13,203 అశుభ్రంగా ఉంటూ, గట్టిగా మాట్లాడతాం అనేవారు. 470 00:49:17,499 --> 00:49:19,042 సరిగ్గానే అన్నారు. 471 00:49:19,710 --> 00:49:22,963 మేము అశుభ్రంగానే ఉండేవారం. గట్టిగా మాట్లాడేవారం. 472 00:49:24,006 --> 00:49:27,634 ఎందుకంటే, కావాలని ఇళ్ల అద్దెలు పెంచడం వల్ల 473 00:49:27,718 --> 00:49:32,973 ఒకే గదిలో రెండు మూడు కుటుంబాలు ఉండాల్సి వచ్చేది. 474 00:49:33,640 --> 00:49:35,642 ఇప్పుడు అదంతా గతం. 475 00:49:40,522 --> 00:49:41,857 నువ్వు అది నిజం అనుకుంటే… 476 00:49:43,817 --> 00:49:47,988 నేను అనుకున్న దానికంటే పెద్ద వెధవవి. 477 00:50:00,167 --> 00:50:03,253 మన వారిని బొద్దింకలు అనేవారు. 478 00:50:03,337 --> 00:50:05,839 మన వారిని నెలలో వేసి దంచి చంపాలనేవారు. 479 00:50:07,925 --> 00:50:09,510 ఒకసారి ఆలోచించు. 480 00:50:11,220 --> 00:50:13,055 వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. 481 00:50:18,936 --> 00:50:20,187 బామ్మా… 482 00:51:03,230 --> 00:51:05,315 ఇదేం పాడడం? 483 00:51:24,835 --> 00:51:29,131 -అది విన్నావా? -అది మన సంగీతం. రండి! 484 00:51:38,932 --> 00:51:41,101 ఆమెను స్టేజి నుండి లాగి పడేయండి! 485 00:51:41,185 --> 00:51:43,145 -ఏంటిది? -గార్డులు ఎక్కడ? 486 00:51:43,228 --> 00:51:44,688 ఆమెను వెంటనే దించండి! 487 00:51:44,771 --> 00:51:46,231 ఆమె పాట ఆపించండి! 488 00:51:46,315 --> 00:51:47,608 గార్డులు ఎక్కడ? 489 00:51:54,448 --> 00:51:55,866 నీ నోటితో అంటే వినాలని ఉంది. 490 00:52:00,245 --> 00:52:01,580 ఇదే నీ నాన్నమ్మ అయి ఉంటే… 491 00:52:04,208 --> 00:52:08,170 ఇక్కడ కూర్చొని, ఈ పొగరుబోతుల మొహాలను చూసేది ఆమె అయ్యుంటే… 492 00:52:10,797 --> 00:52:13,467 ఈ పేపర్లపై సంతకం చేయడానికి… 493 00:52:15,177 --> 00:52:17,888 ఆమెలో ఉన్న ప్రతీ రక్తపు బొట్టు… 494 00:52:19,723 --> 00:52:21,975 వ్యతిరేకిస్తుందని నీతో మీ నాన్నమ్మ చెప్తే… 495 00:52:24,770 --> 00:52:26,355 నువ్వు ఏమని చెప్తావు? 496 00:52:27,481 --> 00:52:30,234 ఏం జరుగుతుంది? జపనీస్ భాషలో మాట్లాడండి! 497 00:52:33,946 --> 00:52:35,739 ఆమెతో సంతకం చేయమని చెప్తావా? 498 00:53:17,281 --> 00:53:18,323 సంతకం చేయొద్దు. 499 00:53:21,910 --> 00:53:23,370 ఆమెతో నేనైతే చేయొద్దనే చెప్తాను. 500 00:53:25,038 --> 00:53:26,331 సంతకం చేయకు. 501 00:53:37,176 --> 00:53:38,343 ఏం జరుగుతుంది? 502 00:53:38,427 --> 00:53:39,428 నాకు సంగీతం వినిపించడం లేదు. 503 00:54:09,541 --> 00:54:11,084 ఇక్కడ ఏం జరుగుతుంది? 504 00:54:12,336 --> 00:54:13,420 ఏం జరుగుతుంది? 505 00:54:14,713 --> 00:54:15,964 ఆమె ఎక్కడికి వెళ్తుంది, సోలొమన్? 506 00:54:16,048 --> 00:54:19,134 సంతకం చేయడం కేవలం ఒక నియమం. 507 00:54:19,218 --> 00:54:21,220 -ఏం జరిగింది? -అరే ఛ! 508 00:54:21,303 --> 00:54:23,722 ఆమె ఒప్పందానికి ముందే ఒప్పుకుంది! 509 00:55:11,645 --> 00:55:13,480 అసలు ఏం జరుగుతుంది, సోలొమన్? 510 00:55:14,398 --> 00:55:15,440 నువ్వు ఆమెతో ఏమని చెప్పావు? 511 00:55:19,611 --> 00:55:20,988 ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడవా? 512 00:55:21,071 --> 00:55:23,615 మరి పది నిమిషాల వరకు ఆగకుండా మాట్లాడావు ఎందుకు, సోలొమన్? 513 00:55:24,825 --> 00:55:25,868 ఇది చాలా దారుణమైన పని. 514 00:55:25,951 --> 00:55:27,619 సంక నాకు, "పరిస్థితిని తారుమారు చేస్తాడంట". 515 00:55:27,703 --> 00:55:29,746 మూడు… మూడు సంవత్సరాలు వృధా. 516 00:55:31,957 --> 00:55:35,210 -దేవుడా… అవును, అవును. -నేను అందరినీ ముందే వారించాను. 517 00:55:35,294 --> 00:55:37,880 ఇలాంటి వాడిని ఇందులోకి తీసుకురావడం… 518 00:55:38,547 --> 00:55:40,632 ఇది పొరపాటు అవుతుంది. మనకే ప్రమాదకరం అవుతుంది అన్నాను. 519 00:55:40,716 --> 00:55:43,760 వీడిని అస్సలు నమ్మి ఉండకూడదు! మనల్ని వెర్రివాళ్లను చేసాడు! 520 00:55:54,730 --> 00:55:56,398 నువ్వు నాకు చాలా నష్టం కలుగజేసావు, సోలొమన్ బెయిక్. 521 00:56:01,695 --> 00:56:03,197 ఎంత అవమానం. 522 00:57:35,330 --> 00:57:36,582 ఇక్కడ ఆపు. 523 00:57:37,749 --> 00:57:39,835 కానీ మనం ఇంకా హోటల్ కి వెళ్ళలేదు. 524 00:57:40,419 --> 00:57:41,628 అమ్మా! 525 01:00:29,546 --> 01:00:31,548 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్