1 00:00:06,840 --> 00:00:12,638 జపనీస్ డైలాగులు నీలం రంగులో ఉంటాయి కొరియన్ డైలాగులు పసుపు రంగులో ఉంటాయి 2 00:00:53,595 --> 00:00:56,056 (కొరియన్ భాషలో) ఏం చేస్తున్నావు? కిమ్ఛీని కొయ్యి. 3 00:00:56,139 --> 00:00:57,349 వాళ్ళు చాలా ఆకలి మీద ఉన్నారు. 4 00:01:22,875 --> 00:01:25,002 భోజనం సిద్ధం అన్నమాట! 5 00:01:26,670 --> 00:01:28,630 తిందాం రండి! తిందాం రండి! 6 00:01:29,381 --> 00:01:30,924 తినే సమయం అయింది! 7 00:01:34,011 --> 00:01:36,889 నాకైతే, పండని కూరగాయలతో చేసే కిమ్ఛీ అంటే చాలా ఇష్టం. 8 00:01:36,972 --> 00:01:39,516 అప్పుడైతే తాజా వెల్లుల్లి రుచి స్పష్టంగా తెలుస్తుంది. 9 00:01:39,600 --> 00:01:42,519 నీకు నచ్చని తిండి ఏమైనా ఉందా? 10 00:01:51,778 --> 00:01:53,780 సూన్జా, నువ్వు బాగానే ఉన్నావా? 11 00:02:02,289 --> 00:02:03,332 ఇక్కడ ఉన్నావా. 12 00:02:03,415 --> 00:02:04,416 ధన్యవాదాలు. 13 00:02:05,959 --> 00:02:09,003 సన్ఈ అత్తకి నేను వీడియో స్టోర్ దగ్గరకి వెళ్తానని చెప్పు. 14 00:02:11,840 --> 00:02:12,841 బాగా గడపండి. 15 00:02:13,383 --> 00:02:14,801 కష్టపడి పనిచెయ్ నాయనా. 16 00:02:39,910 --> 00:02:43,413 గత రాత్రి నాకు అన్నం ముద్దలు కలలోకి వచ్చాయి. 17 00:02:43,497 --> 00:02:44,498 అవునా? 18 00:02:44,581 --> 00:02:46,416 ప్లేట్ నిండా. 19 00:02:46,500 --> 00:02:49,545 -వాటిలో కొన్ని నీకు ఇచ్చాను కూడా, చెల్లి. -రుచిగా ఉన్నాయా? 20 00:03:12,818 --> 00:03:15,404 సన్ఈ, నిద్ర లెగు. 21 00:03:21,743 --> 00:03:22,828 సన్ఈ. 22 00:03:26,874 --> 00:03:27,875 సన్… 23 00:03:34,506 --> 00:03:35,507 సన్… 24 00:03:42,055 --> 00:03:43,974 సూన్జా, ఏమైంది? 25 00:03:47,561 --> 00:03:48,854 నా కడుపు. 26 00:03:50,147 --> 00:03:52,900 రాత్రి చెడిన ఆహరం ఏమైనా తిని ఉంటానా? 27 00:03:54,151 --> 00:03:55,235 ఎంత పని జరిగింది? 28 00:03:56,278 --> 00:03:58,780 నీకు నెలసరి రానుంది అని ఇది సంకేతం అయి ఉంటుందా? 29 00:03:59,781 --> 00:04:01,366 గత నెల కూడా నీకు రాలేదు. 30 00:04:03,869 --> 00:04:05,913 కాస్త కషాయం కాచి ఇస్తాను. 31 00:05:26,118 --> 00:05:27,870 మిన్ జిన్ లీ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 32 00:07:18,438 --> 00:07:22,025 రేటు పెంచినందుకు క్షమించమని మీ అమ్మగారికి చెప్పు. 33 00:07:23,026 --> 00:07:27,406 కోహ్ హన్సు లేకపోయే సరికి అంతా గందరగోళంగా ఉంది. 34 00:07:27,489 --> 00:07:29,241 అతను ఈ పాటికి వెనక్కి వచ్చేసి ఉండాలి కదా? 35 00:07:29,324 --> 00:07:31,493 అతను వారం రోజులు మాత్రమే వెళ్తానని అనడం గుర్తుంది. 36 00:07:31,577 --> 00:07:32,578 అవును. 37 00:07:33,078 --> 00:07:36,081 కానీ ఏమో! అసలు మొత్తానికే తిరిగి రాకపోవచ్చేమో. 38 00:07:37,291 --> 00:07:38,500 అలా ఎందుకు అంటున్నావు? 39 00:07:39,042 --> 00:07:42,337 కోహ్ హన్సు లాంటి వ్యక్తి ఏం కావాలనుకుంటే అది చేయగలడు. 40 00:07:42,838 --> 00:07:45,966 బుసాన్ ఊర్లో చేపల బ్రోకర్ గా పని చేయడం అతనికేమి మంత్రి పదవి లాంటిది కాదు కదా. 41 00:07:47,176 --> 00:07:51,263 పరిస్థితులు మునుపటిలా మారనున్నాయి అంటే భయంగా ఉంది. 42 00:07:51,346 --> 00:07:55,184 అతను కాస్త కఠినంగానే ఉన్నా, సరిగ్గా డబ్బు ఇచ్చేవాడు. 43 00:07:55,267 --> 00:07:58,353 పోనిలే, ఉన్నన్ని రోజులైనా బాగా గడిచాయి, అవునా? 44 00:08:00,647 --> 00:08:02,316 ఇక్కడ చూడండి! 45 00:08:04,776 --> 00:08:07,279 రండి! చాలా తక్కువ! 46 00:08:38,977 --> 00:08:39,977 అది ఎవరు అయి ఉంటారు? 47 00:08:40,729 --> 00:08:42,022 నేను వెళ్లి చూస్తాను. 48 00:08:48,028 --> 00:08:49,571 ఇక్కడ అయితే ఎలా ఉంటుంది? 49 00:08:49,655 --> 00:08:50,948 ఆమె తన జ్ఞాపకాలతో ఉన్నట్టు ఉంటుంది. 50 00:08:52,658 --> 00:08:54,910 మరీ ఎబ్బెట్టుగా ఉంది, కదా? 51 00:08:54,993 --> 00:08:56,203 నాన్నమ్మా, 52 00:08:56,286 --> 00:08:58,705 ఇప్పుడు ఈ విషయంలో బాధపడకూడదు. 53 00:08:59,331 --> 00:09:01,416 అతి త్వరలోనే సమాధి రాయి కూడా సిద్దమవుతుంది. 54 00:09:03,418 --> 00:09:04,503 అయ్యయ్యో! 55 00:09:04,586 --> 00:09:06,505 మీరు ఇంత దూరం వచ్చి ఉండాల్సింది కాదు. 56 00:09:06,588 --> 00:09:08,382 అలా ఎలా అంటున్నారు? 57 00:09:08,465 --> 00:09:09,591 మీరు ఎలా ఉన్నారో చూసి 58 00:09:09,675 --> 00:09:10,926 తెలుసుకోవడం నా బాధ్యత. 59 00:09:12,094 --> 00:09:14,179 ఈయన పాస్టర్ రీ, కొరియా నుండి వచ్చారు. 60 00:09:14,763 --> 00:09:17,349 కొన్ని నెలలు మన చర్చి సంఘాన్ని నడిపించడానికి వచ్చారు. 61 00:09:17,432 --> 00:09:21,186 ఆయన మనతో ఉండడం మన అదృష్టం అనాలి. 62 00:09:22,396 --> 00:09:23,605 దయచేసి, కూర్చోండి. 63 00:09:26,400 --> 00:09:27,860 మన సన్ఈ, 64 00:09:28,402 --> 00:09:30,445 నాకు ఆమెతో పెద్దగా పరిచయం లేదు, 65 00:09:30,529 --> 00:09:32,531 కానీ ఆమె ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పగలను. 66 00:09:32,614 --> 00:09:34,992 ఆమె ఇతరులను సంతోషపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది, అవునా? 67 00:09:36,410 --> 00:09:40,873 క్యాన్సర్ వల్ల జబ్బు పడక ముందు మీరు ఆమెను చూసి ఉండాల్సింది. 68 00:09:41,915 --> 00:09:44,710 ఆ వయసులో కూడా, 69 00:09:44,793 --> 00:09:47,629 మీరు ఆమెకు ఫిదా అయిపోయేవారు. 70 00:09:50,465 --> 00:09:53,677 నేను ఆమె మనసును చూసా, చాలా మంచిది. 71 00:09:55,429 --> 00:09:59,183 ఒక వ్యక్తికి కావాల్సిందే నిజానికి అదొక్కటే. 72 00:10:01,226 --> 00:10:03,687 మీరు చాలా మంచి మాటలు చెప్తున్నారు. 73 00:10:04,313 --> 00:10:06,231 మీరొక పుస్తకం వ్రాస్తే మంచిది. 74 00:10:09,193 --> 00:10:10,986 నేను దాన్ని ఇంకొక చోట పెడితే ఏం అనుకోరు కదా? 75 00:10:11,069 --> 00:10:12,404 లేదు, దయచేసి మార్చండి. 76 00:10:26,335 --> 00:10:28,462 ఆమె తాను ప్రేమించిన వారితో ఉంటే మంచిది. 77 00:10:28,545 --> 00:10:30,339 చాలా బాగుంది. 78 00:10:31,423 --> 00:10:33,342 ఇప్పుడు కలిసి ప్రార్థన చేద్దామా? 79 00:10:34,134 --> 00:10:35,260 త్వరగా చేయండి. 80 00:10:46,855 --> 00:10:48,315 పరలోకమందున్న మా తండ్రి, 81 00:10:49,316 --> 00:10:51,151 నేడు మేము అందరం 82 00:10:51,235 --> 00:10:54,488 మీ చెంతకు తిరిగి వచ్చిన నీ బిడ్డను స్మరించుకుంటూ కూడినాము. 83 00:10:55,739 --> 00:11:00,494 మీ బిడ్డను తిరిగి మీ మహిమలోకి చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. 84 00:11:00,577 --> 00:11:01,578 ఆమెన్. 85 00:11:24,685 --> 00:11:27,646 సూన్జా, త్వరగా ఇంటికి వెళ్ళిపో. తుఫాను వచ్చేస్తుంది. 86 00:11:27,729 --> 00:11:29,106 ఇదే నా చివరి పని. 87 00:11:30,399 --> 00:11:32,734 ఈ సారి ఎంత నష్టపోవాల్సి వస్తుందో. 88 00:11:37,489 --> 00:11:38,740 కోహ్ హన్సు! 89 00:11:40,450 --> 00:11:43,495 మీరు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారేమో అని అనుకున్నాం. 90 00:11:43,579 --> 00:11:45,247 మేము చాలా కంగారు పడ్డాం! 91 00:12:27,706 --> 00:12:29,499 నా ఎడబాటుకు గాను నీకొక కానుక. 92 00:12:30,000 --> 00:12:31,919 చాలా ముద్దుగా ఉంది, తెరవాలంటే బాధ వేస్తుంది. 93 00:12:33,587 --> 00:12:35,797 నువ్వు ఇలా అన్నిటికి సెంటిమెంటల్ కాకుండడం నేర్చుకోవాలి. 94 00:12:48,727 --> 00:12:51,146 నాకు సమయం చెప్పడం తెలీనే తెలీదు. 95 00:12:51,730 --> 00:12:53,065 నేను నేర్పిస్తానులే. 96 00:12:54,733 --> 00:12:57,569 నువ్వు చాలా తెలివైన దానివి. త్వరగానే నేర్చుకుంటావు. 97 00:13:13,669 --> 00:13:14,795 నేను… 98 00:13:17,881 --> 00:13:19,174 నేను ఇప్పుడు గర్భవతిని. 99 00:13:29,184 --> 00:13:30,811 ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలి. 100 00:13:33,814 --> 00:13:34,898 కచ్చితంగా అంటున్నావా? 101 00:13:42,072 --> 00:13:43,240 సూన్జా. 102 00:13:47,619 --> 00:13:48,954 నువ్వు నాకు కొడుకుని ఇవ్వనున్నావు. 103 00:13:50,122 --> 00:13:52,249 అది అబ్బాయే అవుతాడని కచ్చితంగా చెప్పలేం. 104 00:13:52,833 --> 00:13:54,251 కానీ నాకు తెలుసు. 105 00:13:54,334 --> 00:13:55,544 కచ్చితంగా చెప్పగలను. 106 00:13:58,213 --> 00:14:01,049 అమ్మాయి అయితే మీరు తప్పక నిరాశ చెందుతారు. 107 00:14:01,133 --> 00:14:02,926 అయినా కూడా దాన్ని మీరు ప్రేమించాలి. 108 00:14:04,344 --> 00:14:06,763 అది అమ్మాయి అయితే, నేను బోలెడన్ని మంచి బట్టలు కొంటాను. 109 00:14:07,472 --> 00:14:09,516 పాప కూడా తన తల్లిలాగే తెలివైనది అయితే మంచిది. 110 00:14:18,192 --> 00:14:20,360 అయితే మీరు మా అమ్మని ఎప్పుడు కలుస్తారు? 111 00:14:21,403 --> 00:14:23,530 ఆమె చాలా ఆశ్చర్యపోతుంది అనుకోండి. 112 00:14:23,614 --> 00:14:25,949 కానీ మనం త్వరగా పెళ్లి చేసుకుంటే, ఆమె మనసు కుదుటపడుతుంది. 113 00:14:27,367 --> 00:14:29,620 ఇంత హఠాత్తుగా నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఎందుకు? 114 00:14:29,703 --> 00:14:31,580 మన బంధం ఎలాంటిదో నీకు తెలుసు అనుకున్నాను. 115 00:14:33,790 --> 00:14:34,917 తెలుసా? 116 00:14:36,585 --> 00:14:38,837 అంటే ఏంటి మీ ఉద్దేశం? 117 00:14:40,589 --> 00:14:41,840 నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. 118 00:14:41,924 --> 00:14:43,008 నాకు ఇంతకు ముందే ఒక కుటుంబం ఉంది. 119 00:14:47,346 --> 00:14:48,931 ఒసాకాలో, నాకు ఒక భార్య ఉంది 120 00:14:49,014 --> 00:14:50,224 అలాగే ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. 121 00:14:51,808 --> 00:14:53,852 అదేం నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు, 122 00:14:54,770 --> 00:14:56,522 తప్పక చేసుకోవాల్సి వచ్చిన ఒక ఒప్పందం. 123 00:14:57,022 --> 00:14:58,482 ఒక తప్పనిసరి ఒప్పందమా? 124 00:14:59,024 --> 00:15:02,653 వ్యాపార కారణాల వల్ల తప్పలేదు. ఆ పెళ్ళిలో ప్రేమే లేదు. 125 00:15:05,364 --> 00:15:07,449 నీకు, మీ అమ్మకు 126 00:15:07,533 --> 00:15:10,410 ఇంకా మన బిడ్డకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా. 127 00:15:11,578 --> 00:15:13,747 యంగ్డోలోనే అతిపెద్ద ఇల్లు కొంటాను. 128 00:15:13,830 --> 00:15:15,374 జియున్ వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఉంటుంది? 129 00:15:15,958 --> 00:15:18,502 అప్పటికి వాళ్లకు ఆ స్తొమత ఎలాగూ ఉండదు అనుకో. 130 00:15:20,587 --> 00:15:22,464 నీకు చదువు నేర్పిస్తాను 131 00:15:22,548 --> 00:15:23,966 అలాగే సమయం చూడడం కూడా. 132 00:15:24,633 --> 00:15:27,386 మనం ఇంకొంత మంది పిల్లల్ని కని, హాయిగా జీవించవచ్చు. 133 00:15:27,469 --> 00:15:28,595 మరికొంత మంది కూతుళ్లను కందాం. 134 00:15:37,938 --> 00:15:39,314 నీకు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు, 135 00:15:40,566 --> 00:15:42,276 ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉందో చూస్తున్నావు. 136 00:15:44,027 --> 00:15:45,779 నిద్రపోయిన పిల్లలు 137 00:15:47,072 --> 00:15:48,699 మళ్ళీ నిద్ర లేస్తారో లేదో తెలీని ప్రపంచం. 138 00:15:49,950 --> 00:15:52,703 పట్టెడు అన్నం కోసం తమ శరీరాలను అమ్ముకుంటున్న అమ్మాయిలు ఎందరో. 139 00:15:55,330 --> 00:15:58,083 తమ పిల్లలకు ఆహరం మిగులుతుందనే ఆశతో 140 00:15:58,166 --> 00:16:01,003 నెమ్మదిగా ఇల్లు వదిలి చావుకు బయలుదేరుతున్న పెద్దలు ఎందరో ఉన్నారు. 141 00:16:05,007 --> 00:16:06,008 సూన్జా. 142 00:16:09,094 --> 00:16:12,389 పెళ్లి అనేది, కేవలం ఒక ఒప్పందం మాత్రమే. 143 00:16:14,433 --> 00:16:16,435 నేను చేప్పేది తర్వాత నీకే అర్థం అవుతుంది. 144 00:16:18,103 --> 00:16:19,688 మీరు ఏం అంటున్నారు? 145 00:16:21,398 --> 00:16:22,691 మనలాంటి వారికి, 146 00:16:24,234 --> 00:16:25,986 ఉనికిని కాపాడుకోవడానికి ఇదొక్కటే దారి. 147 00:16:41,793 --> 00:16:43,045 సూన్జా. 148 00:16:52,471 --> 00:16:53,597 అయితే… 149 00:16:55,307 --> 00:16:57,518 మొదటి నుండి ఇదేనా మీ ప్లాన్? 150 00:16:59,895 --> 00:17:01,980 ఇంకెవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోరు కాబట్టి 151 00:17:03,023 --> 00:17:04,608 బలవంతంగా పెళ్ళికి ఒప్పించాలనా? 152 00:17:06,484 --> 00:17:07,778 ఎంతైనా, 153 00:17:08,403 --> 00:17:10,614 ఒక అవిటివాడి కూతురిని పెళ్లి చేసుకోవాలని ఎవరు మాత్రం… 154 00:17:10,696 --> 00:17:12,699 మా నాన్న గురించి ఏత్తకండి. 155 00:17:12,782 --> 00:17:14,910 మీ నాన్న అవలక్షణాలు నా కొడుక్కి కూడా రావచ్చు. 156 00:17:16,161 --> 00:17:17,246 అలాంటప్పుడు మాట్లాడే హక్కు నాకు లేదా? 157 00:17:17,329 --> 00:17:19,957 చెప్పు మరి, ఎవరు ఎవరిని శపిస్తున్నట్టు? 158 00:17:28,715 --> 00:17:30,133 సూన్జా. 159 00:17:33,637 --> 00:17:35,097 వెనక్కి రా. 160 00:17:37,766 --> 00:17:38,767 వెంటనే వెనక్కి రా! 161 00:17:55,117 --> 00:17:56,285 మీరు బాగానే ఉన్నారా? 162 00:17:57,077 --> 00:17:58,328 నేను బాగానే ఉన్నాను. 163 00:18:01,999 --> 00:18:03,458 నాకు కాస్త ఆ అవిటి 164 00:18:03,542 --> 00:18:09,298 వ్యక్తి భార్య నడిపించే పూటకూళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో చెప్పగలరా? 165 00:18:09,381 --> 00:18:12,342 ఇక్కడి నుండి కనీసం నలభై నిమిషాలు నడవాల్సి ఉంటుంది. 166 00:18:14,219 --> 00:18:15,345 నేను వెళ్ళగలను. 167 00:19:11,527 --> 00:19:12,736 అమ్మా. 168 00:19:36,844 --> 00:19:37,845 నాన్నమ్మ. 169 00:19:38,512 --> 00:19:41,682 ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకో. 170 00:19:42,182 --> 00:19:46,103 ఏంటి, ఈ మాత్రం దానికే దిగాలు పడిపోతా అనుకున్నావా? 171 00:19:46,770 --> 00:19:49,064 ఇవి కేవలం వస్తువులు మాత్రమే. 172 00:19:50,274 --> 00:19:54,069 ఈ ఇల్లు కూడా అంతే. కేవలం నాలుగు గోడలు, ఒక రూఫ్, 173 00:19:54,152 --> 00:19:55,404 అంతకు మించి ఇది ఏమీ కాదు. 174 00:20:02,536 --> 00:20:06,498 (జపనీస్ భాషలో) ఒక మాఫియా గ్యాంగుతో సంబంధాలు ఉన్న వ్యక్తి 175 00:20:06,582 --> 00:20:09,042 తన మరణాంతరం, మనవడికి చాలా డబ్బు వదిలిపెట్టి పోయాడు. 176 00:20:09,126 --> 00:20:11,795 మామోరు యోషి అనే వ్యక్తి, ఎన్నో అవినీతి కార్యకలాపాలు, 177 00:20:11,879 --> 00:20:15,007 దుర్మార్గాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 178 00:20:30,022 --> 00:20:33,192 ఆ రోజుల్లో తల్లి బాధ్యతలు మోయగల వయసు కాదు నాది. 179 00:20:34,985 --> 00:20:40,324 రోజుకు 14 గంటలు, వారం పొడవునా పని చెసే దాన్ని. 180 00:20:42,743 --> 00:20:45,621 మీ అత్త లేకపోయి ఉంటే, మన పరిస్థితి ఎలా ఉండేదో ఏమో. 181 00:20:49,249 --> 00:20:50,834 నువ్వు మరీ ఇంతగా క్రుంగిపోకూడదు. 182 00:20:51,335 --> 00:20:52,961 ఇక నీపై నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. 183 00:20:54,004 --> 00:20:58,425 నా ఈ బ్రతుకు బ్రతకటం కష్టం అన్నట్టు మాట్లాడుతున్నావే. 184 00:20:59,384 --> 00:21:02,012 ఇక చాలు. తిరిగి పనికెళ్ళు. 185 00:21:02,095 --> 00:21:04,640 ఈ ముసలిదానితో సోది పెట్టుకుంటే లాభం ఏముంటుంది? 186 00:21:05,432 --> 00:21:07,434 అవన్నీ నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. 187 00:21:07,518 --> 00:21:09,019 వాళ్ళు పరిస్థితిని అర్ధం చేసుకోగలరు. 188 00:21:11,897 --> 00:21:14,525 అయినా కూడా, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. 189 00:21:15,567 --> 00:21:18,445 ఆ ఇంటి యజమాని మా ఆఫర్ ని మళ్ళీ కాదు అంది. 190 00:21:18,529 --> 00:21:19,947 ఏంటి? 191 00:21:20,030 --> 00:21:21,281 అంత డబ్బుకి కూడా ఒప్పుకోలేదా? 192 00:21:22,241 --> 00:21:26,078 అంత డబ్బు ఉంటే తన పిల్లల్ని ఎంత బాగా చూసుకోగలదో ఆలోచించు. 193 00:21:26,578 --> 00:21:29,164 ఆ డబ్బు ఏమీ అక్రమంగా సంపాదించింది కూడా కాదు కదా. 194 00:21:29,998 --> 00:21:33,126 ఆమె సమస్య ఏంటో? 195 00:21:36,964 --> 00:21:39,341 మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? 196 00:21:41,510 --> 00:21:44,096 కొన్నాళ్ళు పేరు చెడిపోతుంది అనుకుంటున్నాను. 197 00:21:47,349 --> 00:21:49,434 మళ్ళీ మొదటి నుండి కష్టపడి పేరు సంపాదించుకోవాలి. 198 00:21:50,018 --> 00:21:51,436 అంతకు మించి వేరే ఏం చేయగలను? 199 00:21:52,813 --> 00:21:55,148 ఏమైనా కానీ, ఇక ఆ ఒప్పందం జరగదు. 200 00:21:59,403 --> 00:22:02,823 జనం ఇలా గతంలోనే జీవిస్తూ 201 00:22:02,906 --> 00:22:07,327 ఎందుకు మారకుండా ఉండిపోతారో నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. 202 00:22:07,411 --> 00:22:09,413 అలా ఉండడం వల్ల లాభం ఏంటి? 203 00:22:11,582 --> 00:22:14,668 చనిపోయిన వారు తిరిగి ఎలాగూ రారు కదా? 204 00:22:17,880 --> 00:22:19,047 నాన్నమ్మా. 205 00:22:21,717 --> 00:22:22,926 నాతో కలిసి టోక్యోకి రా. 206 00:22:23,635 --> 00:22:24,720 ఏంటి? 207 00:22:24,803 --> 00:22:26,180 వచ్చి ఆమెతో మాట్లాడు. 208 00:22:27,639 --> 00:22:28,849 నేనా? 209 00:22:28,932 --> 00:22:30,475 నేనేం చెప్పగలను? 210 00:22:32,102 --> 00:22:33,812 నాతో ఇప్పుడు అన్నదే. 211 00:22:34,813 --> 00:22:37,983 ఒక ఇల్లంటే కేవలం కొన్ని గోడలు, ఇంకా ఒక పైకప్పు మాత్రమే. 212 00:22:38,066 --> 00:22:40,277 అలాగే చనిపోయిన వారు తిరిగి రారు అని. 213 00:22:42,821 --> 00:22:45,365 నాన్నమ్మా, ప్లీజ్ నాతో రా. 214 00:22:59,379 --> 00:23:02,674 వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నీకు ఏమైనా వినిపిస్తుందా? 215 00:23:11,350 --> 00:23:13,477 చెప్పు. అతను బ్రతుకుతాడా? 216 00:23:17,064 --> 00:23:19,900 అతనికి ఈ జబ్బు ముందే వచ్చింది. 217 00:23:20,734 --> 00:23:23,904 చూస్తుంటే, ఇప్పటికే ఒకసారి చచ్చి బ్రతికినట్టు కనిపిస్తున్నాడు. 218 00:23:25,614 --> 00:23:27,866 తన కుటుంబం నుండి ఇంత దూరం ఉండడం దురదృష్టం. 219 00:23:28,450 --> 00:23:30,327 ఇతని తల్లి తండ్రులు ఇంకా బ్రతికి ఉన్నారో లేదో. 220 00:23:32,329 --> 00:23:33,622 -ఇదేంటి? -అవును. 221 00:23:35,958 --> 00:23:37,626 ఇతని పేరు ఉంటుందేమో చూద్దాం. 222 00:23:44,508 --> 00:23:48,262 -ఈ బట్టలు ఖరీదైనవి. -ఈ పుస్తకాలని చూడండి! 223 00:23:48,929 --> 00:23:51,765 ఇంత బరువు మోసుకొని రావడం ఎంత కష్టం అయి ఉంటుందో. 224 00:24:00,315 --> 00:24:01,817 ఇందులో ఏమని ఉంది? 225 00:24:09,700 --> 00:24:11,451 "ప్రియమైన అమ్మా, నాన్న, 226 00:24:11,994 --> 00:24:14,580 నేను సురక్షితంగా బుసాన్ కి చేరుకున్నా." 227 00:24:14,663 --> 00:24:19,168 "వీలైనంత త్వరగా ఒసాకాకి వెళ్లి పరిచర్య ప్రారంభించి 228 00:24:19,251 --> 00:24:24,173 యోసెబ్ మరియు సన్ఈతో జీవితం మొదలుపెట్టాలని ఉంది. 229 00:24:24,256 --> 00:24:26,758 మీరేమీ చింతించకండి. 230 00:24:26,842 --> 00:24:28,844 నేను బాగానే ఉన్నాను. 231 00:24:29,553 --> 00:24:31,805 మీ ప్రియమైన కొడుకు, ఇసాక్. 232 00:24:33,265 --> 00:24:35,517 ఇసాక్? అదేం పేరు? 233 00:24:36,435 --> 00:24:38,187 నాకు తెలిసి ఇది బైబుల్ లోని పేరు అనుకుంట. 234 00:24:39,688 --> 00:24:41,190 ఇదుగో, ఇతను ప్యొంగ్యాంగ్ నుండి వచ్చాడు. 235 00:24:43,442 --> 00:24:45,944 ఉత్తరం నుండి వచ్చిన క్రైస్తవుడు అన్నమాట. 236 00:24:49,031 --> 00:24:51,200 మీరు ఇతని జబ్బును సీరియస్ గా పరిగణించాలి. 237 00:24:51,283 --> 00:24:52,284 ఇతనికి క్షయవ్యాధి ఉంది. 238 00:24:52,367 --> 00:24:53,493 మనం వెంటనే పై అధికారులకు చెప్పాలి. 239 00:24:55,495 --> 00:24:57,706 ఇలాంటి పరిస్థితుల్లో ఈయన్ని ఎలా వదిలేసి వెళ్లిపోగలను? 240 00:24:57,789 --> 00:24:58,832 అమ్మా… 241 00:25:01,418 --> 00:25:03,086 మీ కూతురు గురించి ఆలోచించండి, 242 00:25:04,046 --> 00:25:05,422 మీ ఇంట్లో బస ఉన్న వారి గురించి కూడా. 243 00:25:07,966 --> 00:25:12,804 ముందు ఈ రాత్రి బ్రతికి బట్టగడతాడో లేదు చూద్దాం. 244 00:25:27,653 --> 00:25:29,905 -హలో. -నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? 245 00:25:30,989 --> 00:25:31,990 ఈమె ఎవరు? 246 00:25:32,658 --> 00:25:34,451 మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. 247 00:25:34,535 --> 00:25:36,161 నేను వీడి నాన్నమ్మని. 248 00:25:36,245 --> 00:25:39,248 మాతో కొద్ది సేపు మాట్లాడగలరా? 249 00:25:47,422 --> 00:25:51,468 -అయ్యయ్యో, ఇప్పుడు ఇలాంటివి వద్దు… -అదేం పర్లేదు. 250 00:25:52,344 --> 00:25:53,929 నేను ఇప్పుడే భోజనం మొదలుపడుతున్నాను. 251 00:25:59,059 --> 00:26:00,269 -ఆమెన్. -ఆమెన్. 252 00:26:05,232 --> 00:26:08,110 మీ మనవలు ఉన్నారా ఇక్కడ? 253 00:26:08,193 --> 00:26:10,320 అవా? 254 00:26:10,404 --> 00:26:12,322 అది చదివేది నేనే. 255 00:26:23,625 --> 00:26:25,878 స్కూల్ వాళ్ళు ఇవాళే దీన్ని ఇచ్చారు. 256 00:26:26,503 --> 00:26:28,505 ఆరవ తరగతి పాస్ అయినందుకు డిప్లొమా. 257 00:26:31,133 --> 00:26:34,928 అంటే మీరు పిల్లలతో స్కూల్ కి పోతున్నారా? 258 00:26:35,012 --> 00:26:38,182 అవును. చాలా వరకు పిల్లలు మంచివి వారే, 259 00:26:38,265 --> 00:26:40,225 కాని కొంతమందితో వేగలేం. 260 00:26:40,893 --> 00:26:44,646 మళ్ళీ స్కూల్ కి వెళ్లాలని ఎందుకు అనిపించింది? 261 00:26:45,272 --> 00:26:47,232 మీ పరిస్థితి ఎలా ఉండిందో నాకు తెలీదు, 262 00:26:48,066 --> 00:26:49,693 కానీ మా కుటుంబం చాలా బీదది. 263 00:26:49,776 --> 00:26:52,779 చివరికి అబ్బాయిలను కూడా బడికి పంపే స్తొమత మావాళ్లకి లేదు. 264 00:26:53,322 --> 00:26:54,406 వీడి బామ్మ, 265 00:26:54,990 --> 00:26:58,827 మా అమ్మకి అమ్మాయిలను స్కూల్ కి పంపడం వృధా ప్రయాస అనే భావన ఉండేది. 266 00:26:58,911 --> 00:27:01,330 అయితే మీరు అర్థం చేసుకోగలరు. 267 00:27:01,413 --> 00:27:05,417 ప్రపంచం నుండి వేరుగా నిలబడినట్టు అనిపించే ఆ భావనను. 268 00:27:06,502 --> 00:27:09,630 నాకు ఎప్పుడు చూసినా, భయంగానో, సిగ్గుగానో అనిపించేది. 269 00:27:10,214 --> 00:27:14,134 చివరకు చదువు వచ్చని నా పిల్లలపై కూడా కోపపడిన సందర్భాలు ఉన్నాయి. 270 00:27:14,218 --> 00:27:17,471 నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని భయపడేదాన్ని. 271 00:27:18,805 --> 00:27:21,934 కానీ ఇప్పుడు చూడు, మా తరగతిలో మూడవ స్థానం తెచ్చుకున్నాను! 272 00:27:22,017 --> 00:27:23,769 దాదాపుగా రెండవ స్థానాన్ని కొట్టాను అనుకున్నా. 273 00:27:23,852 --> 00:27:25,103 అబ్బా! 274 00:27:38,242 --> 00:27:39,826 ఆ రుచి మీకు తెలుస్తుంది, అవునా? 275 00:27:42,496 --> 00:27:43,580 కానీ ఎలా? 276 00:27:44,081 --> 00:27:46,959 నాకు తెలిసిన ఒకావిడ ప్రతీ కొన్ని నెలలకు ఒకసారి తన కూతురిని కలవడానికి వస్తుంది. 277 00:27:47,042 --> 00:27:50,838 ఆమె ఎప్పుడు వచ్చినా రెండు సూట్ కేసుల నిండా తెస్తుంది. 278 00:27:51,421 --> 00:27:52,798 నాన్నమ్మా, ఏంటది? 279 00:27:52,881 --> 00:27:54,883 అన్నాన్ని మళ్ళీ తిని చూడు. 280 00:28:02,224 --> 00:28:03,976 చూసారా! 281 00:28:04,059 --> 00:28:06,895 ఇప్పటి పిల్లలకు ఆ తేడా ఏమాత్రం తెలీదు. 282 00:28:07,980 --> 00:28:10,190 ఇది మన దేశంలో పండించే అన్నం. 283 00:28:11,191 --> 00:28:12,317 అదెలా చెప్పగలవు? 284 00:28:12,401 --> 00:28:13,694 రుచి కాస్త వేరుగా ఉంటుంది. 285 00:28:13,777 --> 00:28:16,071 కాస్త తియ్యగా, నమలడానికి గట్టిగా ఉంటుంది. 286 00:28:17,990 --> 00:28:20,617 అప్పట్లో, తెల్ల అన్నం అంటేనే గొప్ప. 287 00:28:20,701 --> 00:28:24,246 మేము ఎంత పండించినా, వాళ్ళు తీసుకెళ్లిపోయేవారు. 288 00:28:26,331 --> 00:28:28,959 కానీ ఇప్పుడు తిన్న ప్రతీ సారి తెల్ల అన్నమే తింటున్నా, 289 00:28:29,042 --> 00:28:30,752 ఏమాత్రం తేడా తెలియడం లేదు. 290 00:28:32,129 --> 00:28:34,381 అది మంచి విషయం అనుకుంటున్నారా? 291 00:28:42,139 --> 00:28:44,099 నేను మొదటి సారి ఈ దేశానికి వచ్చినప్పుడు, 292 00:28:44,975 --> 00:28:46,560 మా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది. 293 00:28:47,811 --> 00:28:49,688 ఒసాకాలో ఉండేవారం. 294 00:28:51,315 --> 00:28:54,234 రైల్వే స్టేషన్ దగ్గర, ఆహార స్టాల్స్ దాటుకుంటూ వెళ్తుంటే, 295 00:28:54,860 --> 00:28:58,405 ఆ వంటకాలు ఎలా ఉంటాయో అని ఊహించుకుంటూ పోయేదాన్ని. 296 00:28:59,781 --> 00:29:02,367 అలా ఊహించుకోవడం బాగా అలవాటైనట్టు ఉంది. 297 00:29:03,076 --> 00:29:05,746 నిజంగానే నా నోరు ఊరేది. 298 00:29:05,829 --> 00:29:09,374 నేను మొదటి సారి కాఫీ వాసన చూసినప్పుడు లాగ. 299 00:29:10,292 --> 00:29:14,630 ఆ వాసన చూడగానే చాల నచ్చేసింది. 300 00:29:14,713 --> 00:29:18,091 కానీ మొదటి సారి త్రాగడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది… 301 00:29:18,175 --> 00:29:21,220 -చాలా చేదు! -అవును! 302 00:29:21,303 --> 00:29:23,847 ఊహించుకున్నట్టే లేదు. 303 00:29:31,939 --> 00:29:33,440 కానీ ఈ రోజుల్లో, 304 00:29:33,982 --> 00:29:35,526 నాకు ఆకలి కూడా వేయడం లేదు. 305 00:29:36,193 --> 00:29:37,528 ఏదో సమయానికి తినాలని తింటున్నాను. 306 00:29:39,613 --> 00:29:41,740 సొంతంగా కిమ్ఛీ చేయడమే మానేసాను. 307 00:29:42,241 --> 00:29:44,993 ఒక 180 రూపాయల పెట్టి జార్ కొంటున్నాను. 308 00:29:46,787 --> 00:29:47,996 అప్పట్లో… 309 00:29:50,290 --> 00:29:56,046 అంత డబ్బు సంపాదించడానికి నా బండిలో ఉన్న సరుకు అంతా అమ్మాల్సి వచ్చేది. 310 00:30:01,260 --> 00:30:02,886 ఈ అన్నం తింటుంటే… 311 00:30:03,929 --> 00:30:05,722 నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది, 312 00:30:06,890 --> 00:30:08,976 నేను పెళ్లి చేసుకున్న రోజు. 313 00:30:16,859 --> 00:30:17,901 నాన్నమ్మా, 314 00:30:17,985 --> 00:30:19,486 ఏమైంది? 315 00:30:22,823 --> 00:30:25,659 నేను వెర్రిదానిలా చేస్తున్నాను. 316 00:30:26,743 --> 00:30:30,455 -క్షమించండి. మేము వచ్చి ఉండాల్సింది కాదు… -ఆమె కన్నీళ్లను తక్కువ చేయకు. 317 00:30:31,665 --> 00:30:33,375 వాటిని కార్చే హక్కు ఆమెకు ఉంది. 318 00:31:17,211 --> 00:31:20,047 నేను ఎవరో మీకు తెలీదు అని నాకు తెలుసు… 319 00:31:23,509 --> 00:31:24,718 కానీ చింతించకండి. 320 00:31:25,677 --> 00:31:27,763 నాకు వీలైనంతగా మిమ్మల్ని చూసుకుంటాను. 321 00:31:38,190 --> 00:31:40,192 ఇంటికి వెళ్ళారా? 322 00:31:41,193 --> 00:31:43,028 రెండు సార్లు. 323 00:31:43,111 --> 00:31:46,031 ఒకసారి 70లలో, మళ్ళీ కొన్ని సంవత్సరాల క్రితం. 324 00:31:46,532 --> 00:31:47,866 మరి మీరు? 325 00:31:50,536 --> 00:31:53,038 ముందు, కావాల్సినంత డబ్బు ఉండేది కాదు, 326 00:31:53,121 --> 00:31:55,916 తర్వాత సమయం దొరకలేదు. 327 00:31:57,334 --> 00:31:59,211 ఇప్పుడు వెళ్లినా ప్రయోజనం ఏముంటుందో తెలీదు. 328 00:31:59,294 --> 00:32:02,589 నేను విన్న దాన్ని బట్టి, ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. 329 00:32:03,632 --> 00:32:06,552 అవును, చాలా మారిపోయాయి. 330 00:32:08,554 --> 00:32:12,015 కానీ వీధిలో నడుచుకుంటూ, మన సొంత భాష మాటలు వినడం, 331 00:32:12,099 --> 00:32:14,518 మన ఆహరం వాసన పీల్చడం బాగుంటుంది. 332 00:32:15,561 --> 00:32:17,938 మనం నిలబడే నేల కూడా వేరుగా అనిపిస్తుంది. 333 00:32:19,481 --> 00:32:21,942 అప్పుడు మీ అంతరంగానికి తెలుస్తుంది… 334 00:32:24,361 --> 00:32:30,284 ఆ నేల మన పుట్టిల్లు అని. 335 00:32:32,452 --> 00:32:34,454 అందుకోసమే మనం వెనక్కి వెళ్ళాలి. 336 00:32:40,627 --> 00:32:41,879 మా వదిన… 337 00:32:42,588 --> 00:32:45,924 మా వదిన కొన్ని రోజుల క్రితం కన్నుమూసింది. 338 00:32:47,509 --> 00:32:49,845 ఆమె చాలా మంచిది. 339 00:32:51,972 --> 00:32:54,141 ఇంకా బ్రతకాలని ఆమె ఆశపడినా, 340 00:32:54,224 --> 00:32:56,977 ముందు మా గురించి ఆలోచించేది. 341 00:33:00,439 --> 00:33:01,690 మా వదిన… 342 00:33:02,941 --> 00:33:04,151 మా వదిన, 343 00:33:05,068 --> 00:33:07,613 ఆమె కూడా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసి ఉంటే బాగుండేది. 344 00:33:08,197 --> 00:33:10,407 అప్పుడు ఎంత సంతోషపడేదో ఏమో. 345 00:33:14,786 --> 00:33:15,996 ఇక ఇప్పుడు… 346 00:33:16,747 --> 00:33:19,291 ఇప్పుడు ఇక ఆలస్యం అయిపొయింది. 347 00:33:23,879 --> 00:33:27,382 మీకు ఇంకా సమయం ఉంది కదా. 348 00:33:29,301 --> 00:33:30,928 అవును కదా? 349 00:33:40,395 --> 00:33:41,939 నువ్వు. 350 00:33:42,022 --> 00:33:44,149 మీ సొంత దేశం గురించి నీకు ఏమాత్రం ఆసక్తి లేదు. 351 00:33:44,650 --> 00:33:49,071 కానీ మీ నాన్నమ్మని తీసుకొస్తే, ఇల్లు అమ్మడానికి నన్ను ఒప్పిస్తుంది అనుకున్నావా? 352 00:33:52,491 --> 00:33:53,492 అవును. 353 00:33:57,037 --> 00:33:58,872 నీకు మనసే లేదు. 354 00:34:00,249 --> 00:34:02,376 నీకు సిగ్గుగా లేదా? 355 00:34:04,002 --> 00:34:06,046 నేనేం మీ నుండి దొంగిలించడం లేదు. 356 00:34:06,129 --> 00:34:07,631 మిమ్మల్ని మోసం చేయాలని ఎవరూ చూడడం లేదు. 357 00:34:07,714 --> 00:34:09,299 మీకు లెక్కించలేనంత డబ్బు ఇస్తాం అంటున్నాము. 358 00:34:11,552 --> 00:34:13,554 కానీ కృతజ్ఞత లేకుండా, 359 00:34:13,637 --> 00:34:15,472 మీకు అన్యాయం చేస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. 360 00:34:18,391 --> 00:34:19,768 ఇప్పడు పరిస్థితులు మారాయి. 361 00:34:21,103 --> 00:34:24,273 ఇప్పుడు వాళ్ళు మనకు లెక్క అప్పజెప్పాల్సిన సమయం వచ్చింది. 362 00:34:28,068 --> 00:34:31,822 నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా? 363 00:34:34,449 --> 00:34:35,659 అవును. 364 00:35:20,162 --> 00:35:21,496 అమ్మా. 365 00:35:22,372 --> 00:35:23,540 అతని జ్వరం చివరికి తగ్గింది. 366 00:35:25,000 --> 00:35:26,627 మనం అతనికి తినడానికి జావ కాస్తే మంచిది. 367 00:35:27,127 --> 00:35:28,462 అమ్మా… 368 00:35:32,090 --> 00:35:33,967 నేను నీతో మాట్లాడాలి. 369 00:35:36,428 --> 00:35:37,721 ఏంటి? 370 00:35:45,729 --> 00:35:47,022 నీకిలా చేసింది ఎవరు? 371 00:35:50,400 --> 00:35:51,610 అతని పేరు చెప్పు! 372 00:35:56,823 --> 00:35:57,950 చెప్పు. 373 00:35:58,784 --> 00:36:00,911 అతను బలవంతం చేశాడా? 374 00:36:03,372 --> 00:36:04,540 లేదు. 375 00:36:06,458 --> 00:36:07,459 అలా ఏం జరగలేదు… 376 00:36:07,543 --> 00:36:09,169 మరి అలాంటప్పుడు అతని పేరు ఎందుకు చెప్పవు? 377 00:36:11,296 --> 00:36:15,509 ఒక పిల్లకి కడుపు చేసి, కాదనే చేతకాని వాడు ఎవడు? 378 00:36:26,228 --> 00:36:30,691 నువ్వు బుద్ధిగలదానివి అనుకోవడం నేను చేసిన తప్పు. 379 00:36:33,110 --> 00:36:35,529 ఇంత అమాయకురాలివి ఏంటే? 380 00:36:39,449 --> 00:36:40,701 అమ్మా… 381 00:36:44,037 --> 00:36:45,664 నన్ను క్షమించు. 382 00:37:04,683 --> 00:37:06,685 ఇప్పుడు నీ పరిస్థితి ఏంటని నీకు అర్థం అవుతుందా? 383 00:37:10,105 --> 00:37:11,190 ఈ బిడ్డ పరిస్థితి? 384 00:37:15,194 --> 00:37:16,236 అర్థమవుతుందా? 385 00:37:29,750 --> 00:37:30,751 సూన్జా… 386 00:37:33,962 --> 00:37:36,757 అతన్ని పెళ్ళికి ఒప్పించడానికి అసలు మార్గమే లేదా? 387 00:37:41,136 --> 00:37:44,556 చేయగలిగింది ఏమీ లేదు, అమ్మా. 388 00:37:47,059 --> 00:37:48,310 అతను వెళ్ళిపోయాడు. 389 00:37:52,689 --> 00:37:54,066 నేనొక వెర్రిదాన్ని. 390 00:38:03,867 --> 00:38:05,244 నాకు ఇప్పుడు అర్థం అయింది. 391 00:38:07,079 --> 00:38:10,999 ఆవిడకి ఆ ఇంట్లోనే చావాలని ఉంది. 392 00:38:11,083 --> 00:38:12,376 నీకు అది అర్థం కావడం లేదా? 393 00:38:12,459 --> 00:38:13,710 నువ్వే అన్నావు కదా, 394 00:38:13,794 --> 00:38:17,798 ఆ డబ్బు ఉంటే తన పిల్లలు సుఖపడగలరు అని. 395 00:38:18,924 --> 00:38:19,967 కావచ్చు, 396 00:38:20,801 --> 00:38:23,512 అది ఆవిడకు ఏమైనా బాధ్యతా? 397 00:38:23,595 --> 00:38:25,681 పిల్లల కోసం త్యాగం చేయడానికే ఉండాలా? 398 00:38:26,390 --> 00:38:28,350 ఈ ధోరణి ఎప్పటికి ముగుస్తుంది? 399 00:38:29,101 --> 00:38:30,561 మా చావుతోనేనా? 400 00:38:32,646 --> 00:38:34,189 నన్ను ఏం చేయమని అంటున్నావు? 401 00:38:35,023 --> 00:38:36,692 ఒక విషయం స్పష్టంగా చెప్పు. 402 00:38:40,737 --> 00:38:43,699 ఆమె మానాన ఆమెను వదిలేసి 403 00:38:43,782 --> 00:38:46,827 వృత్తి పరంగా విజయం సాధించలేవా? 404 00:38:47,995 --> 00:38:49,204 లేను. 405 00:38:49,288 --> 00:38:51,039 నా వృత్తే అది. 406 00:38:51,123 --> 00:38:52,875 నేను సంపాదించాలంటే ఇలాగే చేయాలి. 407 00:38:58,213 --> 00:39:01,425 పాస్టర్ రీ గారిలా అందరిచే ప్రేమించబడే వాడిని కానందుకు క్షమించు. 408 00:39:02,009 --> 00:39:04,344 దీనికి, అతనితో సంబంధం ఏంటి? 409 00:39:07,389 --> 00:39:10,017 ఆయన్ని చూస్తుంటే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు. 410 00:39:11,143 --> 00:39:12,519 అంతే. 411 00:39:14,938 --> 00:39:16,940 నేను వెళ్ళాలి. ట్రైన్ వస్తుంది. 412 00:39:17,024 --> 00:39:18,483 నేను నిన్ను ట్రైన్ దగ్గర దించి వెళ్తాను. 413 00:39:23,530 --> 00:39:25,991 నువ్వు మంచి పిల్లాడివని నాకు తెలుసు. 414 00:39:27,075 --> 00:39:29,244 నేను నిన్ను సక్రమంగానే పెంచాను. 415 00:40:10,994 --> 00:40:12,704 నీ అన్నాన్ని వేరడం మానెయ్. 416 00:40:12,788 --> 00:40:14,623 అలా చేయడం దురదృష్టకరం అని తెలుసు కదా. 417 00:40:22,214 --> 00:40:23,841 ఏమైంది? 418 00:40:23,924 --> 00:40:25,592 ఎవరైనా చనిపోయారా ఏంటి? 419 00:40:26,218 --> 00:40:27,469 ఏం జరుగుతుంది? 420 00:40:28,971 --> 00:40:30,472 ఏంటి? 421 00:40:46,405 --> 00:40:47,406 తిను. 422 00:40:54,329 --> 00:40:55,914 సోలొమన్ బెయిక్. 423 00:40:57,749 --> 00:40:59,918 ఆమె లాయర్ల నుండి ఇందాకే ఫోన్ వచ్చింది. 424 00:41:02,462 --> 00:41:03,672 నువ్వు సాధించావు. 425 00:41:05,340 --> 00:41:07,176 మీ నాన్నమ్మని వాడి సాధించావు. 426 00:41:07,259 --> 00:41:08,635 అది అద్భుతమైన ఐడియా. 427 00:41:08,719 --> 00:41:09,761 అవును. 428 00:41:13,182 --> 00:41:14,975 సరే, అందరూ రండి. 429 00:41:15,058 --> 00:41:18,478 నయోమి, అరిమోటో, మీరు కూడా రండి. మనం పండుగ చేసుకోబోతున్నాం. 430 00:41:18,562 --> 00:41:21,440 అందరికీ ఛాటో బుడ్వైజర్లు కొంటున్నాను! 431 00:41:24,276 --> 00:41:25,777 అభినందనలు. 432 00:41:25,861 --> 00:41:26,987 ధన్యవాదాలు. 433 00:41:27,654 --> 00:41:30,490 నీకో విషయం చెప్పాలి, ఆ పని నువ్వు చేయలవు అనే నేను అనుకున్నాను. 434 00:41:31,283 --> 00:41:32,618 నేను నిన్ను తక్కువగా అంచనా వేసాను. 435 00:41:35,037 --> 00:41:37,414 టామ్ మనల్ని పిలుస్తున్నాడు. వెళ్దామా? 436 00:41:38,040 --> 00:41:39,416 నేను ఒక్క క్షణంలో వస్తాను. 437 00:41:51,720 --> 00:41:52,930 హలో? 438 00:41:55,557 --> 00:41:56,683 హలో? 439 00:41:57,559 --> 00:42:01,188 మంచి పిల్లాడిలా నన్ను మిస్ అయ్యానని చెప్పు. 440 00:42:03,315 --> 00:42:06,527 -లేదా కనీసం అబద్ధమైనా చెప్పు. -నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. 441 00:42:07,110 --> 00:42:08,612 లేదు, అది అబద్ధం. 442 00:42:08,695 --> 00:42:10,489 నేను ఇవాళ నాలుగు సార్లు ఫోన్ చేశాను. 443 00:42:11,406 --> 00:42:12,950 నేను కొన్ని రోజులు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. 444 00:42:14,993 --> 00:42:16,620 ఏంటది? 445 00:42:16,703 --> 00:42:17,955 అక్కడ పార్టీ జరుగుతుందా? 446 00:42:19,748 --> 00:42:20,916 సోలొమన్! 447 00:42:21,458 --> 00:42:23,377 నేను ఒక ముఖ్యమైన డీల్ కుదిర్చాను. 448 00:42:23,460 --> 00:42:24,670 అందుకని వేడుక చేసుకుంటున్నాం. 449 00:42:24,753 --> 00:42:27,714 అవునా. 450 00:42:28,882 --> 00:42:30,676 అంటే నిన్ను అమెరికాకి పంపడం 451 00:42:30,759 --> 00:42:33,011 మంచి నిర్ణయమే అన్నమాట. 452 00:42:33,095 --> 00:42:34,930 నీ కోరిక కూడా నెరవేరినట్టు ఉంది కదా. 453 00:42:35,931 --> 00:42:39,184 కానీ నువ్వు కోల్పోయిన వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? 454 00:42:40,227 --> 00:42:42,187 నువ్వు నా విషయమై సంతోషించాలి. 455 00:42:42,271 --> 00:42:43,438 నేను సంతోషించను. 456 00:42:44,398 --> 00:42:46,441 కనీసం ఆ విషయమైనా నిజాయితీగా సమాధానం చెప్పగలను. 457 00:42:47,734 --> 00:42:51,864 నీ విజయాన్ని చూసి నిన్ను ద్వేషించే వారు ఉంటారన్నది అక్షరాలా నిజం. 458 00:42:53,198 --> 00:42:54,825 నేను నిన్ను ఎప్పుడు చూడగలను? 459 00:42:55,951 --> 00:42:59,788 నన్ను నువ్వు ఎప్పటికీ చూడలేకపోవచ్చు. 460 00:42:59,872 --> 00:43:01,456 నువ్వు ఏమాత్రం మారలేదు. 461 00:43:02,124 --> 00:43:04,501 చాలా ఛండాలంగా ఉంది, నువ్వు, నీ చెత్త ఆటలు. 462 00:43:04,585 --> 00:43:06,128 నువ్వు పొరబడ్డావు. 463 00:43:06,920 --> 00:43:11,216 నేను చాలా మారాను. 464 00:43:23,270 --> 00:43:24,688 నీకు అనారోగ్యంగా ఉందా? 465 00:43:27,608 --> 00:43:28,901 హానా! 466 00:43:34,364 --> 00:43:35,490 అమ్మా? 467 00:43:36,366 --> 00:43:37,409 అమ్మా? 468 00:43:39,369 --> 00:43:40,579 ఇప్పుడు ఎలా ఉంది? 469 00:43:42,623 --> 00:43:43,832 బ్రతికి బయటపడ్డా, అంతా మీ వల్లే. 470 00:43:45,083 --> 00:43:47,294 మందుల వ్యాపారి చు గారు మీకు మందులు పని చేస్తున్నాయని అన్నారు. 471 00:43:48,462 --> 00:43:50,255 ఆ మాట వినడం సంతోషం. 472 00:43:50,339 --> 00:43:53,175 నా తల్లితండ్రులు కూడా సంతోషిస్తారు. 473 00:43:53,258 --> 00:43:54,635 నేను… 474 00:43:54,718 --> 00:43:56,845 నేను ఊర్లోకి వెళ్లి ఒక టెలిగ్రామ్ వేయాలని అనుకుంటున్నాను. 475 00:43:56,929 --> 00:43:59,181 అయితే మీ సందేశాన్ని పంపడానికి ఒక కుర్రాడిని పిలుస్తాను. 476 00:43:59,848 --> 00:44:01,600 నేనే స్వయంగా వెళ్లాలని అనుకుంటున్నాను. 477 00:44:02,851 --> 00:44:03,852 కాస్త నడిచినట్టు ఉంటుంది కదా. 478 00:44:04,686 --> 00:44:07,064 కానీ ఇంతలోనే మీరు నడవడం అంత మంచిది కాదు. 479 00:44:07,940 --> 00:44:09,900 ఒసాకాకి వెళ్ళాలి అంటే, నేను బలపడడం ముఖ్యం. 480 00:44:09,983 --> 00:44:11,443 వెళ్లాలా? 481 00:44:11,527 --> 00:44:13,987 మీకోసం చర్చి సభ్యులు ఎదురు చూస్తున్నారని తెలుసు, 482 00:44:15,197 --> 00:44:17,115 కానీ మీరు ఇక్కడే చనిపోతే, 483 00:44:18,408 --> 00:44:20,160 ఇంటికి ఇంత దూరంలో… 484 00:44:20,953 --> 00:44:22,788 నేను చాలా సార్లు చావుకు దగ్గరగా వెళ్లి వచ్చాను. 485 00:44:22,871 --> 00:44:24,039 నాకు అలాంటి పరిస్థితులు కొత్తేమి కాదు. 486 00:44:25,457 --> 00:44:26,792 నాకు చావు భయం ఏం లేదు. 487 00:44:27,668 --> 00:44:29,253 కానీ బ్రతకడం మాత్రం, 488 00:44:29,878 --> 00:44:31,505 నేను భయపడేది దానికే. 489 00:44:36,051 --> 00:44:37,928 కనీసం మీతో నా కూతురిని అయినా తీసుకెళ్లండి. 490 00:44:38,512 --> 00:44:39,721 దయచేసి… 491 00:44:39,805 --> 00:44:41,306 ఇంకొకరికి ఇబ్బంది కలిగించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. 492 00:44:41,974 --> 00:44:43,517 నేను మిమల్ని ఒంటరిగా పంపలేను. 493 00:44:43,600 --> 00:44:46,603 ఒక్క క్షణం. ఆమెను తీసుకొస్తాను. 494 00:44:48,272 --> 00:44:49,439 సూన్జా! 495 00:44:51,441 --> 00:44:54,778 మీకు, మీ అమ్మకి ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి. 496 00:44:55,404 --> 00:44:57,406 నేను మీకు భోజనం కొని ఇస్తాను. 497 00:44:59,533 --> 00:45:01,702 అదేం పర్లేదు. 498 00:45:02,536 --> 00:45:04,621 మీకు మార్కెట్ లో నచ్చేది ఏమైనా ఉండి ఉంటుంది కదా. 499 00:45:07,916 --> 00:45:09,918 ఒక నూడిల్ షాపు ఉంది. 500 00:45:11,336 --> 00:45:12,880 దాని గురించి జనం మాట్లాడుకోవడం విన్నాను. 501 00:45:13,630 --> 00:45:15,132 ఇక్కడి నుండి అది పెద్ద దూరం కాదు. 502 00:45:17,134 --> 00:45:18,218 మంచిది. 503 00:45:18,302 --> 00:45:19,511 అలాగైతే, 504 00:45:20,637 --> 00:45:22,472 భోజనం చేసిన తర్వాత టెలిగ్రామ్ పంపుదాం. 505 00:45:25,726 --> 00:45:27,144 దీని గురించి ముందే చెప్పాను. 506 00:45:29,855 --> 00:45:30,856 వాటిని ఇక్కడి నుండి తీసేయండి. 507 00:45:33,317 --> 00:45:34,610 ఇదేంటి? 508 00:45:38,363 --> 00:45:39,406 దాన్ని వ్రాసి ఉంచుకో. 509 00:45:39,907 --> 00:45:43,035 నేను ఈ మార్కెట్ గురించి చాలా విన్నాను. ఇది చాలా బాగుంది. 510 00:45:48,040 --> 00:45:49,208 ఇది చాలా పెద్దగా ఉంది. 511 00:46:02,262 --> 00:46:03,472 దయచేసి రండి, మనం వెళ్ళాలి. 512 00:46:12,439 --> 00:46:14,983 ఇక ఇది చాలు… 513 00:46:15,067 --> 00:46:16,109 సోలొమన్. 514 00:46:16,193 --> 00:46:19,196 -లేదు, హే… టామ్. -క్షమించండి, అతను మళ్ళీ ఫోన్ చేస్తాడు. 515 00:46:19,279 --> 00:46:20,572 టామ్, ఫోన్ పెట్టేయకు… 516 00:46:20,656 --> 00:46:22,407 నేను నీ బాస్ ని. 517 00:46:22,491 --> 00:46:24,284 బయటకు వచ్చి పండుగ చేసుకో. 518 00:46:24,368 --> 00:46:25,577 మేధావి. 519 00:46:28,413 --> 00:46:29,665 హే. 520 00:46:30,791 --> 00:46:31,917 చీర్స్. 521 00:46:32,000 --> 00:46:33,752 చీర్స్! 522 00:46:40,384 --> 00:46:41,718 ఇది… 523 00:47:01,738 --> 00:47:02,906 అమ్మా, 524 00:47:02,990 --> 00:47:04,575 ఇంత పొద్దుపోయిన తర్వాత ఇక్కడేం చేస్తున్నావు? 525 00:47:04,658 --> 00:47:06,785 ఆమె వెనక్కి వెళ్లాలని అనుకుంది, 526 00:47:06,869 --> 00:47:08,787 ఇంకొక్క సారి మన స్వదేశాన్ని చూడడానికి. 527 00:47:08,871 --> 00:47:10,622 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 528 00:47:11,331 --> 00:47:14,543 నీ అత్త అస్థికలను ఈ నేలలో కలపడం నాకు ఇష్టం లేదు. 529 00:47:14,626 --> 00:47:16,461 నేను ఆమెను వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. 530 00:47:17,379 --> 00:47:19,673 నాకు కూడా, వెనక్కి వెళ్లాలని ఉంది. 531 00:47:31,643 --> 00:47:33,604 నేను ఒక హోటల్ కి రావడం ఇదే మొదటి సారి. 532 00:47:36,899 --> 00:47:38,650 త్వరగా తెచ్చేసారే! 533 00:47:40,277 --> 00:47:42,946 మా కస్టమర్లు ఎదురుచూడడం మాకు నచ్చదు. 534 00:47:49,661 --> 00:47:52,039 ఇంత బాగా జపనీస్ మాట్లాడడం ఎవరు నేర్పించారు? 535 00:47:52,873 --> 00:47:56,335 చిన్నపుడూ ఒక మాస్టారు ఉండేవాడు. 536 00:47:56,418 --> 00:47:57,628 అతని పేరు షిమిజు. 537 00:47:58,879 --> 00:48:00,547 అతను, నేను చాలా సఖ్యంగా ఉండేవారం. 538 00:48:00,631 --> 00:48:02,299 నేను మీ పుస్తకాలన్నిటినీ చూసా. 539 00:48:02,382 --> 00:48:04,510 మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి కదా. 540 00:48:04,593 --> 00:48:06,178 నేనైతే అలా అనుకోను. 541 00:48:06,261 --> 00:48:07,888 నా వయసు పెరిగే కొద్దీ, 542 00:48:08,680 --> 00:48:10,516 నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుస్తుంది. 543 00:48:11,767 --> 00:48:12,976 నిజం చెప్పాలంటే, 544 00:48:13,769 --> 00:48:15,979 చాలా సార్లు నేనొక వెధవని అన్నట్టు అనిపిస్తుంది. 545 00:48:18,440 --> 00:48:19,983 మీరు నాతొ కలిసి ప్రార్థన చేస్తారా? 546 00:48:27,449 --> 00:48:30,869 తండ్రి, మేము తినబోతున్న ఆహారానికై మీకు ధన్యవాదాలు. 547 00:48:31,912 --> 00:48:34,790 అలాగే, మా క్షేమాన్ని చూస్తూ, 548 00:48:34,873 --> 00:48:38,043 సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. 549 00:48:39,920 --> 00:48:42,256 ఏసుక్రీస్తు నాముములో అడుగుతున్నాం. 550 00:48:42,339 --> 00:48:43,340 ఆమెన్. 551 00:48:47,970 --> 00:48:50,889 సూన్జా, ఇప్పుడు మీ కళ్ళు తెరవవచ్చు. 552 00:49:04,778 --> 00:49:05,946 ఇది బాగుంది. 553 00:49:17,958 --> 00:49:20,169 మీ నుండి ఇంకా విషయాన్ని దాచడం 554 00:49:20,252 --> 00:49:21,670 నాకు తప్పు అనిపిస్తుంది. 555 00:49:23,672 --> 00:49:25,299 మీరు గర్భవతి అని నాకు తెలుసు. 556 00:49:30,387 --> 00:49:33,015 మిమ్మల్ని తప్పుబట్టాలని నా ఉద్దేశం కాదు. 557 00:49:33,098 --> 00:49:35,267 ఈ విషయాన్ని ఎత్తడడానికి ఒకే కారణం… 558 00:49:35,350 --> 00:49:37,311 బహుశా ఈ సమయంలో మీ బాధను 559 00:49:38,812 --> 00:49:41,648 పంచుకోగల మిత్రులు ఉంటే బాగుండని. 560 00:49:43,775 --> 00:49:45,194 మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట. 561 00:49:46,737 --> 00:49:48,071 ఆ బిడ్డను, 562 00:49:48,155 --> 00:49:50,699 ఇంకొక కుటుంబానికి ఇస్తే మంచిదేమో అని ఏమైనా ఆలోచించారా? 563 00:49:54,119 --> 00:49:55,829 బహుశా పిల్లలు లేని వారికి. 564 00:49:58,207 --> 00:50:00,042 ఇది కష్టమైన పని అని నాకు తెలుసు, కానీ… 565 00:50:00,125 --> 00:50:01,502 మీరు ఏం అంటున్నారు? 566 00:50:05,631 --> 00:50:08,759 మీ అంతట మీరే ఒంటరిగా బిడ్డని పెంచడం, అందువల్ల ఎదురయ్యే ఆటుపోట్లు… 567 00:50:08,842 --> 00:50:11,386 నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని నాకు స్పష్టత ఉంది. 568 00:50:13,805 --> 00:50:16,808 నన్ను, నా బిడ్డను అంటరానివారిగా చూస్తారని నాకు తెలుసు… 569 00:50:18,936 --> 00:50:21,939 అలాగే మా అమ్మ వ్యాపారానికి నష్టం రాకుండడానికి నేను మా ఇల్లు వదిలిపోవాల్సి వస్తుందని తెలుసు. 570 00:50:23,732 --> 00:50:25,025 నాకు అవన్నీ తెలుసు. 571 00:50:27,903 --> 00:50:29,154 అయినా కూడా… 572 00:50:30,197 --> 00:50:31,323 నన్ను… 573 00:50:33,784 --> 00:50:36,995 నన్ను అలా వెలివేయబడిన ఒక వ్యక్తి ప్రేమించాడు. 574 00:50:39,623 --> 00:50:40,749 నా తండ్రి. 575 00:50:42,960 --> 00:50:45,712 ఆయన గురించి నేను ఎంతగా ఆలోచిస్తున్నానో చెప్పడం వింతగా ఉండొచ్చు. 576 00:50:47,798 --> 00:50:50,884 ఆయన్ని జీవితాంతం, తనకు పెళ్లి కాదని కించపరిచారు 577 00:50:50,968 --> 00:50:52,636 ఒక బిడ్డకు తండ్రి కాలేడని అన్నారు. 578 00:50:52,719 --> 00:50:54,012 కానీ నేను పుట్టాను. 579 00:50:57,015 --> 00:50:59,101 అసాధ్యమే అయినా, ఇప్పుడు నేను మీ ముందు కూర్చున్నా. 580 00:51:03,438 --> 00:51:04,690 అలాగే ఈ సారి… 581 00:51:06,483 --> 00:51:11,738 నా బిడ్డ కూడా ఊహించని విధంగా భూమిపైకి రానున్నాడు. 582 00:51:14,449 --> 00:51:16,285 వాడు కూడా నాలాగే ప్రేమించబడతాడు. 583 00:51:19,079 --> 00:51:22,499 నా చేతి గోళ్లు కష్టంతో పగిలిపోయినా, 584 00:51:23,584 --> 00:51:26,545 నా నడుము వాచినా, కడుపు కాలినా సరే, 585 00:51:27,838 --> 00:51:29,173 నా బిడ్డ… 586 00:51:32,092 --> 00:51:33,927 సంతృప్తిగా ఏ లోటూ లేకుండా బ్రతుకుతాడు. 587 00:51:37,264 --> 00:51:38,640 ఇది నేను వాడికి చేసే ప్రమాణం. 588 00:51:42,978 --> 00:51:44,104 నా తండ్రి… 589 00:51:51,236 --> 00:51:53,238 నేను పుట్టినప్పుడు నాకు కూడా అదే ప్రమాణం చేసారు. 590 00:52:01,371 --> 00:52:02,581 లేదు. 591 00:52:06,043 --> 00:52:07,211 నేను… 592 00:52:10,297 --> 00:52:11,423 ఈ బిడ్డను ఇచ్చేది లేదు. 593 00:52:18,722 --> 00:52:20,182 నన్ను క్షమించండి, సూన్జా. 594 00:52:24,228 --> 00:52:25,687 నేను పొరబడ్డాను. 595 00:52:29,149 --> 00:52:33,070 జీవితమంతా అనారోగ్యంతో పెరిగిన వాడిని. 596 00:52:37,491 --> 00:52:39,284 నాకు పుస్తకాల గురించి తెలుసు అన్నది నిజమే. 597 00:52:40,702 --> 00:52:42,621 కానీ మనుషుల గురించి చాలా తక్కువ తెలుసు. 598 00:52:47,501 --> 00:52:49,795 మీరు ఆ మాటలు అనడం విన్నాక… 599 00:52:52,047 --> 00:52:53,423 నాకు సిగ్గు వేస్తుంది. 600 00:52:54,299 --> 00:52:55,592 నా ఉద్దేశం అది కాదు. 601 00:52:56,552 --> 00:52:57,636 లేదు. 602 00:52:58,554 --> 00:53:00,264 మీరు అలా అన్నందుకు సంతోషిస్తున్నాను. 603 00:53:04,226 --> 00:53:05,310 సంతోషిస్తున్నారా? 604 00:53:14,903 --> 00:53:16,071 ఈ వ్యక్తి… 605 00:53:18,949 --> 00:53:20,284 అతన్ని మీరు మర్చిపోగలరా? 606 00:53:33,881 --> 00:53:35,299 మర్చిపోవాలనే ఉంది. 607 00:53:38,010 --> 00:53:39,261 అయితే, 608 00:53:41,054 --> 00:53:44,683 మీరు ఇంకొకరిని ప్రేమించగలరా? 609 00:53:46,810 --> 00:53:48,687 అదంతా అలోచించి ఇప్పుడు ఏం లాభం? 610 00:53:50,230 --> 00:53:51,732 నన్ను ఎవరూ ఏలుకోరు. 611 00:53:52,357 --> 00:53:53,859 కానీ ఒకవేళ ఆ అవకాశం ఉంటే… 612 00:53:58,071 --> 00:53:59,531 మిమ్మల్ని గనుక ఎవరైనా… 613 00:54:02,326 --> 00:54:04,286 మీ ఇంటిని వదిలి… 614 00:54:08,081 --> 00:54:09,708 నూతన జీవితం ప్రారంభించడానికి రమ్మని పిలిస్తే… 615 00:54:12,127 --> 00:54:13,378 ఒప్పుకుంటారా? 616 00:54:21,595 --> 00:54:22,763 కానీ… 617 00:54:25,307 --> 00:54:26,850 నేను ఒక గర్భవతిని అని… 618 00:54:26,934 --> 00:54:28,894 మీ కడుపులో ఇంకొకరి బిడ్డ పెరుగుతోంది. 619 00:54:29,478 --> 00:54:30,479 నేను అర్థం చేసుకోగలను. 620 00:54:30,979 --> 00:54:32,523 కానీ, ఒకవేళ అవకాశం ఉంటే, 621 00:54:33,857 --> 00:54:35,234 బహుశా… 622 00:54:37,861 --> 00:54:39,279 తగిన సమయం తర్వాత అయినా… 623 00:54:42,950 --> 00:54:45,452 మీరు ఇంకొకరిని ప్రేమించగలరా? 624 00:55:57,608 --> 00:55:59,610 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్