1 00:00:06,006 --> 00:00:09,009 జపనీస్ డైలాగు సబ్ టైటిల్స్ నీలం రంగులో ఉంటాయి కొరియన్ డైలాగు సబ్ టైటిల్స్ పసుపు రంగులో ఉంటాయి 2 00:00:09,343 --> 00:00:12,304 (కొరియన్ భాషలో) అతని పేరు కోహ్ హన్సు. 3 00:00:14,306 --> 00:00:18,560 అతను ఎంతమందినో పొట్టన పెట్టుకున్నాడని అందరూ అంటుంటారు. 4 00:00:20,395 --> 00:00:26,944 జపాన్ లోని పేరు, పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి కోసం అన్ని రకాల పనులు చేసి పెడతాడు. 5 00:00:27,903 --> 00:00:30,989 ఇలాంటివి వింటుంటే, ఒక్కోసారి అనిపిస్తుంది, 6 00:00:31,740 --> 00:00:33,992 ఇప్పుడు వాడు కూడా జపాన్ వారితో కలిసిపోయాడా? 7 00:00:34,743 --> 00:00:37,246 లేక ఇంకా మనోడేనా అని. 8 00:00:37,329 --> 00:00:42,042 అదంతా ఎవడికి తెలుసు. వాడి రేట్లు మాత్రం సరసంగా ఉంటాయని తెలుసు నాకు. 9 00:00:42,125 --> 00:00:46,296 అనవసర బేరాలు పెట్టడు, సోది గాళ్ళతో సమయం వృధా చేయడు. 10 00:00:47,214 --> 00:00:49,091 అతని కోసం ఇక్కడ వంట చేసే మనిషి 11 00:00:49,174 --> 00:00:52,010 వాడు ఒకసారి వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోడు అని చెప్పింది. 12 00:00:52,094 --> 00:00:54,638 ఒకసారి వాడి, పడేస్తాడు అంట. 13 00:00:54,721 --> 00:00:58,350 అసలు ఊహించగలవా? వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? 14 00:00:58,433 --> 00:01:01,395 పరిస్థితులు ఎలా పని చేస్తాయో తెలిసిన మనిషి అతను. 15 00:01:01,478 --> 00:01:05,482 మా నాన్న గారిని కలవడానికి అతను రెండు సార్లు వచ్చాడు. 16 00:01:05,566 --> 00:01:08,193 వారిద్దరూ ఒకరితో ఒకరు చాలా సఖ్యంగా మెలిగేవారు. 17 00:01:08,277 --> 00:01:11,780 కానీ, జియున్, మీ నాన్న గారి ఉద్దేశంలో వాడు ఇక్కడే ఉంటాడా? 18 00:01:11,864 --> 00:01:14,199 లేక తిరిగి ఒసాకాకి వెళ్ళిపోతాడా? 19 00:01:14,992 --> 00:01:17,953 వాడి ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి బహుశా... 20 00:01:19,079 --> 00:01:21,331 ఇక్కడే ఉండిపోవచ్చు. 21 00:01:22,124 --> 00:01:23,458 ఉంటాడనే నేను కూడా అనుకుంటున్నాను. 22 00:01:44,229 --> 00:01:47,733 -నిశ్శబ్దంగా ఉండు! -కానీ నాన్నా. చేపలు మోచేయి అంత ఉండాలి కదా. 23 00:01:49,860 --> 00:01:51,570 నా మోచేయి అంత ఉంటే చాలు! 24 00:01:56,116 --> 00:01:58,911 ఒక చేతకాని కుర్రాడి మోచేయి పొడవు 25 00:01:58,994 --> 00:02:00,787 ప్రకారం నా ధర ఉంటుంది అనుకుంటున్నావా? 26 00:02:01,413 --> 00:02:02,956 సార్, దయచేసి వదిలేయండి. 27 00:02:03,040 --> 00:02:04,917 నువ్వు మధ్యలోకి రాకు. 28 00:02:07,711 --> 00:02:10,005 తన ధిక్కారానికి నీ కొడుకు అనుభవించాలి. 29 00:02:12,633 --> 00:02:14,968 నీకు కావాలంటే చెప్పు, నీ చేతిని కూడా సాగదీసి చూపిస్తాను. 30 00:02:25,521 --> 00:02:26,730 నేను వీటిని కొంటాను. 31 00:02:26,813 --> 00:02:28,190 ఇరవై చేపలకు అయిదు కాసులు ఇస్తా. 32 00:02:28,273 --> 00:02:30,192 చాలా ధన్యవాదాలు. 33 00:02:31,318 --> 00:02:32,319 వాటిని పక్కన ఉంచు. 34 00:02:38,408 --> 00:02:40,035 మిస్టర్ కోహ్ హన్సు! 35 00:04:04,912 --> 00:04:06,663 మిన్ జిన్ లీ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 36 00:04:27,476 --> 00:04:30,062 టోక్యో 37 00:04:43,700 --> 00:04:46,995 (జపనీస్ భాషలో) అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? 38 00:04:47,663 --> 00:04:51,542 నేను ఇప్పుడే పెళ్లికూతురు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులను చూసాను. 39 00:04:51,625 --> 00:04:56,797 పిల్లలు ఇద్దరూ ఇంత అందంగా ఎందుకు ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది! 40 00:04:56,880 --> 00:04:58,841 అందరూ నేను ఫెయిల్ అవ్వాలని చూస్తున్నారు. 41 00:04:58,924 --> 00:05:03,470 అది నిజం కాదు. మమ్మల్ని అస్తమాను అంత దారుణంగా చూడకు. 42 00:05:03,554 --> 00:05:04,555 ప్రయత్నిస్తా. 43 00:05:04,638 --> 00:05:07,641 నువ్వు అమెరికా వెళ్లిన నాటి నుండి ఈ దేశంలో చాలా మారాయి. 44 00:05:07,724 --> 00:05:11,311 చాలా మంది, చాలా వేగంగా డబ్బును సంపాదించడం మొదలుపెట్టారు. 45 00:05:11,395 --> 00:05:13,647 కొన్నేళ్ల క్రితం ఎలాంటి గుర్తింపు లేని వారు కూడా. 46 00:05:13,730 --> 00:05:18,068 బహుశా అలాంటి వారే ఈ దేశానికీ అవసరమేమో. 47 00:05:18,151 --> 00:05:19,778 ఒక పచింకో పార్లర్ యజమాని కొడుకులాగా? 48 00:05:21,446 --> 00:05:24,199 జోక్ చేశా! నువ్వు, నేను చాన్నాళ్లుగా మిత్రులం కదా. 49 00:05:26,159 --> 00:05:29,496 మనం చిన్నప్పుడు నువ్వు అన్న ఒక విషయం ఇప్పుడే గుర్తుకొచ్చింది. 50 00:05:29,580 --> 00:05:31,164 ఏంటది? 51 00:05:32,207 --> 00:05:34,626 మీ నాన్న గారు నీతో 52 00:05:34,710 --> 00:05:36,753 కొరియా వాళ్ళను కుక్కలు పెంచి ఉంటాయేమో. 53 00:05:36,837 --> 00:05:39,173 అందుకే జపాను వారిలా అన్నాన్ని పైకి తీసుకొని తినడానికి బదులు 54 00:05:39,256 --> 00:05:41,717 గిన్నెలోకి తల దించి తింటారని చెప్పారు అన్నావు. 55 00:05:41,800 --> 00:05:44,928 -నేను అంత దారుణమైన మాట అన్నానా? -అన్నావు. 56 00:05:45,929 --> 00:05:47,431 అప్పుడు మనం పిల్లలం. 57 00:05:47,514 --> 00:05:49,391 మా నాన్న అన్న మాట నాకే తప్పుగా వినిపించి ఉంటుందిలే. 58 00:05:51,226 --> 00:05:54,563 ఏదైతేనేం, అబే గారితో కలిసి కోల్టన్ కంపెనీ బాగస్వాములు కావడం తెలివైన పని. 59 00:05:54,646 --> 00:05:57,399 ఆయన ఇక్కడ చాలా పెద్ద బిల్డర్. తన పలుకుబడితో ఏమైనా చేయించగలడు. 60 00:05:57,482 --> 00:06:00,319 ఫైనాన్స్ శాఖలో సగం మంది అతని కూతురు 61 00:06:00,402 --> 00:06:02,571 పెళ్ళికి వచ్చారు చూడు. చూస్తుంటేనే తెలుస్తుంది. 62 00:06:02,654 --> 00:06:04,865 నిజమే, మన రంగంలో ఉన్నవారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. 63 00:06:04,948 --> 00:06:09,453 కానీ చింతించాల్సిన పని లేదు. మంచి టై కట్టుకున్నావు, వారితో ఇట్టే కలసిపోగలవు. 64 00:06:10,037 --> 00:06:11,038 నేను గెస్ చేస్తా ఉండు. 65 00:06:12,414 --> 00:06:13,415 అర్మానీ బ్రాండ్ టై కదా? 66 00:06:15,667 --> 00:06:17,669 హెర్మిస్. చూడు, బాగానే స్థిరపడ్డావు. 67 00:06:17,753 --> 00:06:21,173 అబే నీ గురించి ఏమనుకుంటాడో తెలుసుకోవడం బాగుంటుంది. 68 00:06:23,759 --> 00:06:30,057 నాట్యమాడుతూ, మరింతగా నాట్యమాడుతూ 69 00:06:49,368 --> 00:06:52,788 ఒకటి, రెండు, మూడు, పళ్ళు చూపండి! 70 00:06:53,914 --> 00:06:54,998 దయచేసి దగ్గరగా రండి. 71 00:07:12,266 --> 00:07:14,935 నువ్వు చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయావు, ఎందుకు? 72 00:07:16,937 --> 00:07:17,938 అప్పుడు నాకు 14 ఏళ్ళు. 73 00:07:19,189 --> 00:07:21,984 నువ్వు అమెరికాలో కూడా పని చేసావు అని విన్నాను. 74 00:07:22,651 --> 00:07:23,944 అవును, క్యాంబ్రిడ్జ్ లో. 75 00:07:24,027 --> 00:07:26,029 ఆహ్, హార్వర్డ్ లో అన్నమాట. 76 00:07:26,113 --> 00:07:27,114 బిజినెస్ స్కూల్ లో. 77 00:07:27,197 --> 00:07:29,867 మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఎలా ఉంది? 78 00:07:30,909 --> 00:07:33,871 అమెరికన్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి బాగా పనికొచ్చింది. 79 00:07:33,954 --> 00:07:35,581 ఎలా? 80 00:07:35,664 --> 00:07:37,124 అమెరికన్లకు ఆటలు అంటే చాలా ఇష్టం. 81 00:07:37,207 --> 00:07:39,293 వాళ్ళకి ప్రతీది ఆటే. 82 00:07:39,376 --> 00:07:41,962 అంటే, నేను ఎవరిని కలిసినా, ఎక్కువగా మగాళ్లే అనుకో, 83 00:07:42,045 --> 00:07:44,298 ఊహించే ఆట ఒకటి ఆడటానికి చూసేవారు, 84 00:07:44,381 --> 00:07:45,382 "నేను ఏ జాతి ఆసియా అమ్మయినా అని." 85 00:07:45,465 --> 00:07:48,010 మంచి ఆట. అందరూ ముందు చైనా వారని ఊహిస్తారు. 86 00:07:49,511 --> 00:07:51,513 అదృష్టవశాత్తు రెండవ సారైనా జపనీస్ అంటారు. 87 00:07:51,597 --> 00:07:53,849 నీకైతే కనీసం రెండవ సారికి సరైన దేశం పేరు చెప్తారు. 88 00:07:53,932 --> 00:07:56,268 నా విషయంలో అయితే కొరియా అని నాలుగవ అవకాశంలో చెప్పినా గొప్పే. 89 00:07:56,894 --> 00:07:59,730 నా మూడ్ సరిగా లేకపోతే, వాళ్ళు జపనీస్ అనగానే, తల ఊపి వెళ్ళిపోతా. 90 00:07:59,813 --> 00:08:02,065 అందులో కూడా కాస్త నిజం ఉంది, కదా? 91 00:08:02,816 --> 00:08:05,068 లేదు. అది తప్పు ఏం కాదు. 92 00:08:06,236 --> 00:08:08,530 -టామ్ గారు! -అబే గారు! 93 00:08:13,493 --> 00:08:19,374 మీ అల్లుడిని చూస్తుంటే మీ అమ్మాయిని బాగా చూసుకునేలా ఉన్నాడు. మీరు అదృష్టవంతులు! 94 00:08:19,458 --> 00:08:22,920 నా కూతురు భవిష్యత్ దృష్ట్యా, అది నిజం కావాలనే నా కోరిక కూడా. 95 00:08:23,003 --> 00:08:26,173 మా బృందంలో ఉన్న నూతన సభ్యుని మీకు పరిచయం చేస్తాను. 96 00:08:26,715 --> 00:08:29,676 ఇతను మిస్టర్ బెయిక్, మా న్యూ యార్క్ ఆఫీసు నుండి వచ్చాడు. 97 00:08:29,760 --> 00:08:31,303 నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను చాలా సంతోషిస్తున్నాను. 98 00:08:32,929 --> 00:08:35,307 మీ రక్తం రకం ఏమిటి? 99 00:08:39,311 --> 00:08:40,354 నా రక్తం వర్గం ఓ. 100 00:08:42,231 --> 00:08:44,691 అవునా. ఆశావాదివి అన్నమాట. 101 00:08:47,819 --> 00:08:51,073 ఈ ప్రపంచంలో, బ్రతకాలంటే ఆశ కావాలి కదా. 102 00:08:51,698 --> 00:08:53,367 ఆ దృక్కోణం నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుందో చూద్దాం. 103 00:08:53,450 --> 00:08:56,703 పార్టీలో బాగా ఎంజాయ్ చేయండి. 104 00:09:08,382 --> 00:09:11,510 హే. అతను ఎందుకు అలా ప్రవర్తించాడు? 105 00:09:14,221 --> 00:09:16,723 అతనికి నా మీద పెద్దగా నమ్మకం లేదు. 106 00:09:17,224 --> 00:09:20,269 ఓహ్, అవును. జపనీస్ కి, కొరియన్లకు మధ్య ఉన్న అశాంతి వల్ల కదా. 107 00:09:21,979 --> 00:09:24,481 జనం అదంతా ఎందుకు వదిలేయరు? 108 00:09:24,565 --> 00:09:26,650 అది ఒకప్పటి విషయం. గతించిపోయిన విషయాలు. 109 00:09:28,235 --> 00:09:31,238 సరే, నా విషయంలో అయితే ఆయన చింతించాల్సిన పని లేదని అబే గారికి చెప్పండి మరి. 110 00:09:31,989 --> 00:09:33,657 నేనైతే, షిప్లీస్ కి విశ్వాసంతో పని చేస్తాను. 111 00:09:33,740 --> 00:09:35,284 కారణం నాకు జీతాన్ని ఇచ్చేది ఆ కంపెనీయే కాబట్టి. 112 00:09:39,037 --> 00:09:41,540 ఒసాకా 113 00:09:53,677 --> 00:09:55,095 సన్ఈ, నిద్ర లెగు. 114 00:09:58,098 --> 00:10:01,059 వదినా, అన్నం తినాలి. 115 00:10:02,394 --> 00:10:03,812 సోలొమన్ ఎక్కడ? 116 00:10:03,896 --> 00:10:07,900 టోక్యోలో, గుర్తు లేదా? ఆ పెద్ద డీల్ మీద పని చేస్తున్నాడు. 117 00:10:07,983 --> 00:10:11,653 సూన్జా. మనకు ఈ విషయం ముందు నుంచి తెలుసు, అవునా? 118 00:10:11,737 --> 00:10:14,698 వాడే ఆ పని చేయగలడని. 119 00:10:15,616 --> 00:10:18,452 వాడు మంచి కుర్రాడు. 120 00:10:19,536 --> 00:10:20,746 ఇక తిందాం. 121 00:10:22,581 --> 00:10:24,499 ఇక నా బాగోగులు చూసుకొని నీకు చిరాకు రావడం లేదా? 122 00:10:25,334 --> 00:10:27,085 అలాంటి మాటలు అనకు. 123 00:10:32,549 --> 00:10:35,677 చూడు, నీకు ఇష్టమైంది చేశాను. 124 00:10:37,846 --> 00:10:40,432 ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోకూడదు. 125 00:10:43,477 --> 00:10:45,312 కానివ్వు, ఇక మొండి చేయకు. 126 00:10:45,395 --> 00:10:47,022 సూన్జా, 127 00:10:47,814 --> 00:10:49,983 నాకు మాత్రలు వద్దు. 128 00:10:50,067 --> 00:10:51,985 ఏం మాట్లాడుతున్నావు? 129 00:10:52,069 --> 00:10:54,613 డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావు కదా. 130 00:10:54,696 --> 00:10:56,323 నువ్వు పోరాడి గెలవాలి. 131 00:10:56,406 --> 00:11:00,035 సూన్జా, ఇప్పటికే ఎన్నాళ్లగానో పోరాడుతూనే ఉన్నాం కదా? 132 00:11:00,118 --> 00:11:02,162 నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. 133 00:11:02,746 --> 00:11:04,540 ఇదంతా ఎలా జరిగింది? 134 00:11:05,666 --> 00:11:09,920 ఇంత కాలం ఎలా గడిచిపోయింది? 135 00:11:10,003 --> 00:11:12,381 నువ్వు ఇంకా చాన్నాళ్లు బ్రతకాలి. 136 00:11:12,464 --> 00:11:14,299 అలా అనొద్దు. 137 00:11:15,843 --> 00:11:18,220 నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పే మనిషివి. 138 00:11:19,137 --> 00:11:22,474 ఎంత బాధ కలిగించేది అయినా నిజం చెప్తావు. 139 00:11:28,313 --> 00:11:31,400 నాకు మళ్ళీ అవే మొహాలు కనిపిసున్నాయి, 140 00:11:31,483 --> 00:11:34,069 నా కలల్లో. 141 00:11:34,570 --> 00:11:38,156 మనం మరచిపోవడానికి ప్రయత్నిస్తున్న అవే ముఖాలు. 142 00:11:38,740 --> 00:11:41,577 బహుశా నా ఆయుష్షు తీరినట్టు ఉంది, 143 00:11:41,660 --> 00:11:46,623 కానీ నాకు నిజంగానే వాళ్ళందరిని గుర్తు చేసుకోవాలని ఉంది. 144 00:11:47,457 --> 00:11:49,626 వాళ్ళ పేర్లు, 145 00:11:49,710 --> 00:11:51,336 వాళ్ళ మొహాలు... 146 00:11:53,422 --> 00:11:59,136 ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్లగలిగితే బాగుండు. 147 00:12:06,602 --> 00:12:08,312 కానీ, సూన్జా, 148 00:12:08,395 --> 00:12:10,189 ఒక నిజం చెప్పు. 149 00:12:11,273 --> 00:12:12,357 ఆ మనిషి, 150 00:12:13,275 --> 00:12:16,528 నువ్వు అతని గురించి నిజంగానే అస్సలు ఆలోచించావా? 151 00:12:18,572 --> 00:12:24,077 లేదా నువ్వు మరొక నిర్ణయం తీసుకొని ఉంటే 152 00:12:24,161 --> 00:12:27,080 జీవితం ఎలా ఉండేదని ఎప్పుడైనా ఆలోచిస్తావా? 153 00:12:45,599 --> 00:12:46,975 నువ్వొక వెధవవి, అది తెలుసా? 154 00:12:48,560 --> 00:12:50,604 నిన్ను, నీ కుటుంబాన్ని కావాలనుకుంటే ఆ సముద్రంలోకి తోసేయగలను. 155 00:12:50,687 --> 00:12:52,397 సార్, అతను ఏం తప్పు చేయలేదు. 156 00:12:52,481 --> 00:12:54,024 నాకు వీటిని అమ్మింది అతను కాదు. 157 00:12:55,901 --> 00:12:57,236 నేను నా కళ్ళతో స్వయంగా చూసాను. 158 00:12:57,319 --> 00:12:59,738 నా దగ్గర కొన్ని దానిమ్మలు ఉన్నాయి. మేము బదులు తీసుకున్నాం. 159 00:13:00,322 --> 00:13:02,616 చూసారా, నేను ఆమె డబ్బు తీసుకోలేదు! 160 00:13:02,699 --> 00:13:05,160 అతన్ని నిందించకండి. అతను ఏం తప్పు చేయలేదు. 161 00:13:06,745 --> 00:13:07,871 ఒక మాట చెప్పు, 162 00:13:09,498 --> 00:13:11,291 మేము చిన్న చేపలను ఎందుకు పట్టుకోము? 163 00:13:14,211 --> 00:13:15,921 అవి గుడ్లు పెట్టకుండానే పట్టేసుకుంటే, 164 00:13:16,922 --> 00:13:18,173 చేపల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి. 165 00:13:18,257 --> 00:13:19,967 అప్పుడు ఎవరికీ కావాల్సినన్ని చేపలు ఉండవు, 166 00:13:20,050 --> 00:13:22,010 తర్వాత అందరూ ఒకరితో ఒకరు పోటీ పడాల్సిందే. 167 00:13:22,094 --> 00:13:25,514 కానీ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా? 168 00:13:34,064 --> 00:13:35,107 వెళ్ళు. 169 00:14:14,479 --> 00:14:16,899 సూన్జా, ఇంత ఆలస్యం ఎందుకైంది? 170 00:14:16,982 --> 00:14:18,233 మేము చాలా కంగారు పడ్డాం. 171 00:14:18,317 --> 00:14:20,736 ఎందుకు? దుంగ్యాకి ఏమైనా అయిందా? 172 00:14:21,445 --> 00:14:22,446 లేదు. 173 00:14:22,529 --> 00:14:23,864 శ్రీమతి కిమ్ గురించి. 174 00:14:24,907 --> 00:14:26,575 ఈ సారి నిజం అని తెలిసింది. 175 00:14:26,658 --> 00:14:28,660 మిస్టర్ ర్హీ గారు కళ్లారా చూసారు అంట. 176 00:14:28,744 --> 00:14:30,537 ఇంకా పుకార్లు పుట్టించడం మానలేదా నువ్వు? 177 00:14:30,621 --> 00:14:34,124 దీనికి బదులు కాస్త పనికొచ్చే పని ఏమైనా చేస్తే బాగుంటుంది. 178 00:14:34,208 --> 00:14:35,959 నేనేం కావాలని ఖాళీగా ఉండడం లేదు. 179 00:14:42,674 --> 00:14:44,801 శ్రీమతి కిమ్ ఊర్లోకి జపాన్ వాళ్ళ 180 00:14:44,885 --> 00:14:47,012 పిల్లలు, తెల్ల బట్టలు వేసుకున్న కొరియన్ 181 00:14:47,095 --> 00:14:49,181 మహిళల పై బురద, పేడ విసురుతున్నారని 182 00:14:49,264 --> 00:14:52,518 ఏవేవో కథలు చెప్పింది. 183 00:14:52,601 --> 00:14:54,436 నేను అలాంటిది ఏమీ చూడలేదే. 184 00:14:54,520 --> 00:14:56,813 ఆ మనిషి ఎలా మాట్లాడుతుందో నీకు తెలుసు. 185 00:15:00,275 --> 00:15:05,322 కానీ... సూన్జా, జాగ్రత్తగా ఉండు, ఒక్కదానివే బయటకు వెళ్లకు. 186 00:15:05,906 --> 00:15:08,408 వీలైతే దుంగ్యా లేదా భొకిని తీసుకెళ్లొచ్చు కదా? 187 00:15:08,492 --> 00:15:11,036 ఓహ్, కాస్త నా మాట విను. 188 00:15:11,119 --> 00:15:13,330 నాకు తోమిదేళ్ళ వయసు నుండి నేను ఒంటరిగా వెళ్తున్నాను. 189 00:15:13,413 --> 00:15:16,875 -అయినా కూడా... -మనం ఇక్కడ చాలా చేయాలి. 190 00:15:16,959 --> 00:15:19,753 నీకు సహాయం చేయడానికే కదా దుంగ్యా ఇంకా భొకిని పనిలో పెట్టుకున్నావు. 191 00:15:19,837 --> 00:15:24,800 శ్రీమతి కిమ్ అలాగే పిచ్చి పిచ్చి కథలు అల్లుతుంటుంది. 192 00:15:24,883 --> 00:15:27,678 ఆవిడ చెప్పేవి వింటే, మనమే ఇరకాటంలో పడతాము. 193 00:15:31,223 --> 00:15:33,267 శ్రీమతి కిమ్ ప్రకారం, 194 00:15:33,350 --> 00:15:37,062 మన జిల్లాకు వచ్చిన చేపల బ్రోకర్ చాలా అందంగా ఉన్నాడు అంట. 195 00:15:37,688 --> 00:15:39,565 సూన్జా, నువ్వు అతన్ని చూసావా? 196 00:15:40,774 --> 00:15:43,569 ఏమిటీ గోలా? అతని గురించి మాట్లాడుకోవడం కూడా దండగ. 197 00:16:15,767 --> 00:16:18,437 గత మూడు ఏళ్లుగా ఈ విషయం నా బుర్ర తినేస్తోంది. 198 00:16:18,520 --> 00:16:21,523 నిర్మాణ సిబ్బంది ఇప్పటికే ఆ చుట్టూ ఉన్న స్థలాన్ని సరిచేయడం ప్రారంభించారు. 199 00:16:21,607 --> 00:16:23,192 అబే గారు నా బుర్ర తోడేస్తున్నాడు. 200 00:16:23,275 --> 00:16:25,569 అంతేకాక, 43వ ఫ్లోరులోని మేనేజర్లు రోజూ ఫోన్ చేసి, 201 00:16:25,652 --> 00:16:27,654 ఆమె ఆ స్థలాన్ని ఎప్పుడు అమ్ముతుందా అని ఒక్కటే గోల. 202 00:16:27,738 --> 00:16:30,657 ఇప్పటికే మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తామని మూడు ఆఫర్లు చేసాం. 203 00:16:30,741 --> 00:16:33,744 మన మొదటి ఆఫర్ 16 కోట్ల రూపాయలు... 204 00:16:33,827 --> 00:16:35,829 ధన్యవాదాలు, నేను వివరాలు చదివాను. నాకు అదంతా తెలుసు. 205 00:16:35,913 --> 00:16:37,748 -హెన్ గూంజ్. -హాన్ గుంజా. 206 00:16:37,831 --> 00:16:41,418 ఆమె కొరియా నుండి జపాన్ కు1929లో వలస వచ్చింది. 207 00:16:41,502 --> 00:16:44,296 యుద్ధం తర్వాత ఆమె, ఆమె కుటుంబం టోక్యోలో స్థిరపడ్డారు. 208 00:16:44,379 --> 00:16:47,132 ఆమె సంపాదనతోనే ఇళ్లు నడిచేది, చాకలి వ్యాపారం చేసేది. 209 00:16:47,216 --> 00:16:51,011 అలా 1955లో, 2500 రూపాయలకు వాళ్ళు కొంత స్థలాన్ని కొన్నారు. 210 00:16:51,094 --> 00:16:53,639 ఈ రోజుల్లో ఆ రేటుకు మంచి తిండి కూడా ఇక్కడ దొరకదు. 211 00:16:53,722 --> 00:16:56,141 ఇది డబ్బు గురించి కాదు. ఆమెకు డబ్బుతో పని లేదు. 212 00:16:56,225 --> 00:16:59,478 ఇది డబ్బు గురించే, నయోమి. ఇలాంటివి అప్పుడైనా... 213 00:16:59,561 --> 00:17:00,562 నువ్వు కాస్త ఆమెకు వివరిస్తావా? 214 00:17:00,646 --> 00:17:03,941 నీకు అన్నీ అర్థమైనట్టు ఉంది కాబట్టి, ఇక నా అవసరం లేదు అని తెలుస్తుంది, 215 00:17:04,566 --> 00:17:05,692 ఇక నేను వెళ్లి నా పని చేసుకుంటాను. 216 00:17:14,159 --> 00:17:15,327 ఇది క్లిష్టమైన పరిస్థితి. 217 00:17:15,410 --> 00:17:16,537 -అర్థమవుతుంది. -అవును. 218 00:17:16,619 --> 00:17:19,957 డీల్ మీద మాత్రమే దృష్టి పెట్టు. ఎలాగైనా బేరం కుదుర్చు. 219 00:17:20,665 --> 00:17:21,916 నా ఉద్దేశం కూడా అదే. 220 00:17:22,000 --> 00:17:26,880 ఈ వాతావరణంలో కూడా 20,000 మంది ధైర్యం చేసి 221 00:17:26,964 --> 00:17:30,926 రాజుగారి అంత్యక్రియలకు వచ్చారు. 222 00:17:33,011 --> 00:17:34,388 చిన్నా,పెద్దా అందరు కలిసి నివాళులు అర్పిస్తున్నారు... 223 00:17:34,471 --> 00:17:36,515 తెలుసా, ఒకసారి నువ్వు నా మీద అరిచావు. 224 00:17:36,598 --> 00:17:38,433 -నేను అనలిస్ట్ గా చేరిన మొదటి ఏడాది. -ఏమైనా తప్పు చేసావా? 225 00:17:38,517 --> 00:17:39,810 ...అలాగే రాజు గారికి చివరి వీడుకోలు చెప్తారు. 226 00:17:39,893 --> 00:17:42,354 -అవును, తప్పు చేసాను. -నిజం ఒప్పుకొని మంచి పని చేసావు. 227 00:17:42,437 --> 00:17:44,857 మాకు నువ్వే స్ఫూర్తి, నాతో జాయిన్ అయిన అందరికిని. 228 00:17:46,358 --> 00:17:48,026 అదేదో ఒకప్పటి విషయం అన్నట్టు చెప్తున్నావు. 229 00:17:48,110 --> 00:17:49,278 లేదు, నా ఉద్దేశం అది కాదు. 230 00:17:49,361 --> 00:17:50,696 హా. సరే, అదేం పర్లేదులే. 231 00:17:51,363 --> 00:17:52,531 నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు. 232 00:17:52,614 --> 00:17:55,450 అతిపెద్ద డీల్ చేసినవారు ఎవరు? అతిపెద్ద నష్టాన్ని తెచ్చిన వారు ఎవరు? 233 00:17:55,534 --> 00:17:58,161 నలభై మూడవ ఫ్లోర్ కి వెళ్ళబోయేది ఎవరు? 234 00:17:58,245 --> 00:18:02,165 నేను కూడా అలాగే అస్తమాను ఆలోచించేవాడ్ని అని ఒప్పుకుంటా. 235 00:18:02,249 --> 00:18:03,750 అది ఒకప్పటి విషయం అన్నట్టు చెప్తున్నావే. 236 00:18:10,340 --> 00:18:14,469 నేను ఈ స్థాయికి ఎలా చేరుకున్నానో తెలుసుకోవాలని ఉందా? ఏం జరిగిందో వింటావా? 237 00:18:14,970 --> 00:18:17,097 చెప్పు. నాకు తెలుసుకోవాలని ఉంది. 238 00:18:20,475 --> 00:18:21,894 నాకు పెళ్లి అయింది. 239 00:18:22,811 --> 00:18:24,229 ఇద్దరు పిల్లల్ని కన్నాను. 240 00:18:24,313 --> 00:18:26,481 ఊర్లో ఒక మంచి ఇళ్లు కొన్నాను, మా దేశంలో పొలాన్ని కొన్నాను. 241 00:18:28,066 --> 00:18:30,736 నాకు తెలియకుండానే, నా నెలవారీ సంపాదన ఎంత అనేది 242 00:18:30,819 --> 00:18:32,821 కేవలం ఒక ఆట కాదు అని తెలిసింది. 243 00:18:34,364 --> 00:18:35,699 ఎలాగైనా ఎదగాలని అనిపించింది. 244 00:18:40,037 --> 00:18:41,246 కాబట్టి... 245 00:18:42,831 --> 00:18:44,166 నేను కొన్ని తప్పులు చేశాను... 246 00:18:46,043 --> 00:18:47,211 నా పనితీరు తెబ్బతింది. 247 00:18:47,294 --> 00:18:49,129 కంగారు పడ్డాను, దాంతో మరికొన్ని తప్పులు చేశాను. 248 00:18:49,213 --> 00:18:50,506 ఇదంతా జరుగుతుండగా, 249 00:18:50,589 --> 00:18:53,300 నా భార్య, ప్రిన్స్ టన్ కాలేజీలో చదివినా, ఏ రోజూ పని చేయని వ్యక్తి, 250 00:18:53,383 --> 00:18:56,053 నేను అసలు ఇంటికే రావడం లేదని గొడవ చేయడం మొదలుపెట్టింది. 251 00:18:56,136 --> 00:18:58,555 నేను ఇంటికి వెళ్లినా కూడా, నా దృష్టి అక్కడ ఉండేది కాదు. 252 00:19:07,814 --> 00:19:09,399 కాబట్టి, ఒక రోజు 253 00:19:09,483 --> 00:19:12,694 నేను 49 నిముషాలు ప్రయాణించి ఆఫీసుకు వెళ్లాలని సిద్ధమవుతూ, 254 00:19:12,778 --> 00:19:14,196 కళ్ళలో కాస్త కంటి మందు వేసుకుంటుండగా, 255 00:19:14,279 --> 00:19:16,949 నన్ను వదిలి వెళ్ళిపోతున్నానని నా భార్య నాతో అంది. 256 00:19:19,701 --> 00:19:21,203 నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని తనతో అన్నాను. 257 00:19:21,286 --> 00:19:23,330 కానీ ఇక మాట్లాడేది ఏం లేదని నాతో చెప్పింది. 258 00:19:25,040 --> 00:19:28,418 పది ఏండ్ల సంసార జీవితాన్ని అంత సులభంగా ఎలా తెంచగలవని అడిగాను. 259 00:19:28,502 --> 00:19:30,712 ఆమె తన జుట్టుకు తెల్లని రంగు వేయడం 260 00:19:30,796 --> 00:19:33,841 కూడా నేను గమనించలేదు అని నాతో చెప్పింది. 261 00:19:35,008 --> 00:19:38,470 అవును, నా పెళ్లి పెటాకులైంది. 262 00:19:38,554 --> 00:19:41,431 ఆ తర్వాత నా వృత్తి కూడా. కాబట్టి, ఇక్కడ ఇలా మిగిలిపోయాను. 263 00:19:51,024 --> 00:19:52,985 అయితే నీకు గాడ్జిల్లా కావాలా లేక సూపర్ మ్యాన్ కావాలా? 264 00:19:53,485 --> 00:19:55,362 చివరికి జపానులో ఉండి సంపాదించడం 265 00:19:55,445 --> 00:19:57,072 అమెరికా కంటే మంచిదని గ్రహించావా ఏంటి? 266 00:19:57,155 --> 00:20:00,033 నిజం చెప్పాలంటే, నేను అలాంటి విషయాన్నే అసలు ఆలోచించలేదు. 267 00:20:00,576 --> 00:20:03,912 తమాషా చేస్తున్నావా? నీ జీతం గురించి మాట్లాడుతున్నాను, సోలొమన్. 268 00:20:05,205 --> 00:20:07,207 ఇప్పుడైతే జపాను వారు అమెరికన్ డాలర్లను 269 00:20:07,291 --> 00:20:09,334 అమెరికా వారేమో జెర్మనీ మార్కులను 270 00:20:09,418 --> 00:20:12,045 ఇక జర్మనీ వారేమో బ్రిటిషు స్టెర్లింగ్ లను పోగేసుకుంటూ కూర్చున్నారు. 271 00:20:12,129 --> 00:20:14,673 కానీ విషయం ఏంటంటే, ప్రస్తుతం డబ్బు ప్రపంచమంతటా 272 00:20:14,756 --> 00:20:17,342 చలామణి అయ్యే వేగాన్ని చూస్తే, ఏ దేశ కరెన్సీ అనేది ఆలోచించడం కూడా అనవసరం. 273 00:20:17,426 --> 00:20:20,679 -కరెన్సీ డిపార్ట్ మెంట్ వాళ్లకు కూడా అదే చెప్పు. -ఏ దేశం అనేది ఆలోచించాల్సిన పని లేదు. 274 00:20:21,180 --> 00:20:22,848 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 275 00:20:22,931 --> 00:20:24,433 అన్నిటికంటే ముఖ్యమైంది ఏంటంటే, నిజానికి, 276 00:20:24,516 --> 00:20:27,477 పని పూర్తయ్యే సరికి, మన పనులే మన స్థితిని మార్చగలవు. 277 00:20:27,561 --> 00:20:29,146 అందుకే ఇక్కడికి వచ్చావా? 278 00:20:29,980 --> 00:20:31,106 నీ స్థితిని మార్చుకోవడానికా? 279 00:20:51,376 --> 00:20:53,378 అన్ని మెషిన్ లకు ఇలాగే చేస్తారా? 280 00:20:54,838 --> 00:20:56,131 లేదు. ఇప్పుడు అలా చేయడం లేదు. 281 00:20:56,798 --> 00:20:59,218 రాత్రుళ్లు ఒకతను వస్తుంటాడు. 282 00:21:00,219 --> 00:21:02,262 కానీ ఇది సరిగ్గానే ఉందా? 283 00:21:03,722 --> 00:21:08,894 గోటో గారు నాకు నిజం చెప్పినప్పుడు నేను కూడా అదే అనుకున్నాను. 284 00:21:08,977 --> 00:21:10,812 అప్పుడు నాకు కూడా నీ వయస్సే. 285 00:21:12,272 --> 00:21:13,357 మేకులను సరిగ్గా అమర్చు. 286 00:21:14,024 --> 00:21:15,943 మేకులను సరిచేస్తుంటాం. 287 00:21:16,777 --> 00:21:18,946 విషయం తెలియకుండా ఉండడం మంచిది కాదు. 288 00:21:20,781 --> 00:21:24,952 చాలా మంది హ్యాండిల్ ని కాస్త ఊపితే గెలవగలం అనుకుంటారు. 289 00:21:25,744 --> 00:21:29,289 కానీ ఫలితంపై వాళ్లకు ఎలాంటి నియంత్రణ ఉండదు. అస్సలు ఉండదు. 290 00:21:29,373 --> 00:21:30,916 మాకు కూడా ఉండదు అనుకో. 291 00:21:31,834 --> 00:21:36,129 మేకులను మార్చినంత మాత్రానా గెలవలేరు. మేము అలా చేయం. 292 00:21:36,213 --> 00:21:38,757 కాస్త ప్రోత్సహిస్తాం అంతే. అంతకు మించి ఏమీ లేదు. 293 00:21:39,716 --> 00:21:44,054 కానీ గోటో గారు అనేటట్టు, "అత్యాశకు పోకూడదు" అనేది మా నినాదం. 294 00:21:45,722 --> 00:21:48,767 ఆడే వారు ఓడినప్పుడు, మేము కూడా బాధపడతాం. 295 00:21:49,893 --> 00:21:52,521 వాళ్ళు గెలిచినప్పుడు, మేము కూడా సంతోషిస్తాం. 296 00:21:55,691 --> 00:21:58,235 నువ్వు ఎలా చేసావో చూద్దాం. 297 00:22:02,239 --> 00:22:03,448 స్వాగతం! 298 00:22:05,284 --> 00:22:06,785 న్యూ గ్రాండ్ వేగాస్ 299 00:22:42,821 --> 00:22:45,490 బండో గారు, నేను లోన్ పత్రాలు తెచ్చాను. 300 00:22:46,491 --> 00:22:47,951 నాకు ఈమెతో కొంచెం పని ఉంది. 301 00:22:53,624 --> 00:22:56,418 లెక్కలు అన్నీ చెక్ చేసుకోండి. 302 00:22:57,419 --> 00:22:59,213 రెండు వందల అరవై కోట్ల రూపాయలు. సరిగ్గానే ఉన్నట్టు ఉంది. 303 00:23:02,799 --> 00:23:05,385 నేను వెంటనే బ్యాంక్ కి దీన్ని పంపిస్తాను. 304 00:23:05,469 --> 00:23:08,222 లోన్ విషయంలో ఏమైనా సమస్య ఉంటుందని అనిపిస్తుందా? 305 00:23:08,305 --> 00:23:10,015 అలాంటిది ఏం ఉండదు. 306 00:23:10,098 --> 00:23:13,227 మరికొన్ని వారాల్లో మీరు స్థలంపై నిర్మాణాలు ప్రారంభించవచ్చు. 307 00:23:13,810 --> 00:23:14,937 అభినందనలు. 308 00:23:15,020 --> 00:23:16,396 చాలా ధన్యవాదాలు. 309 00:24:20,169 --> 00:24:21,378 అయితే, ఇది, 310 00:24:23,297 --> 00:24:25,465 ఈ చిన్ని పనికిమాలిన స్థలమే... 311 00:24:29,178 --> 00:24:30,429 అరవై నాలుగు కోట్ల రూపాయలు. 312 00:24:34,266 --> 00:24:35,601 తమాషా చేస్తున్నావా? 313 00:24:35,684 --> 00:24:38,562 ఆమె ఇప్పటికే మూడు ఆఫర్లను కాదు అంది. ఇక నాన్చడం ఆపేద్దాం. 314 00:24:38,645 --> 00:24:41,356 ఆమె కాదు అనలేని ఆఫర్ ఇద్దాం. 315 00:24:45,611 --> 00:24:48,447 అయిదు ఏండ్ల క్రితం, నీలో ఉన్న ఆ వ్యాపారస్తుడు సందేహించేవాడే కాదు. 316 00:24:51,158 --> 00:24:52,367 అది నిజం అని నీకు తెలుసు. 317 00:24:55,412 --> 00:24:57,915 సరే. అలాగే. అవును. 318 00:25:01,835 --> 00:25:04,004 ఆగు. మనం ఆమెతో మాట్లాడేది లేదా? 319 00:25:04,087 --> 00:25:05,964 మాట్లాడాలి, కానీ నేను ఒక్కడినే వెళ్లి మాట్లాడతాను. 320 00:25:14,348 --> 00:25:16,433 సూన్జా. సూన్జా! 321 00:25:17,935 --> 00:25:20,521 అమ్మా, ఇవాళ నా దగ్గర అంత డబ్బు లేదు. 322 00:25:21,230 --> 00:25:23,732 దీన్ని నీకు ఆయన బహుమతిగా ఇస్తున్నారు. 323 00:25:23,815 --> 00:25:25,067 ఎవరి నుండి? 324 00:25:25,150 --> 00:25:27,110 జిల్లాకి వచ్చిన కొత్త చేపల బ్రోకర్. 325 00:25:27,194 --> 00:25:31,156 అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు కదా, అతను. 326 00:25:31,240 --> 00:25:32,407 నాకు కూడా ఆశ్చర్యం వేసింది. 327 00:25:32,491 --> 00:25:35,327 నాకు జపాన్ గురించి తెలీదు, కానీ అక్కడ చేసినట్టు ఇక్కడ చేయడం అంటే... 328 00:25:35,410 --> 00:25:37,996 ఎంత సిగ్గు చేటు. 329 00:25:38,080 --> 00:25:42,125 -అది కూడా నీలాంటి మంచి అమ్మాయికి. -ఏవండీ, కాస్త చూసుకొని మాట్లాడండి. 330 00:25:42,209 --> 00:25:43,710 ఈ వ్యక్తి ఎవరో నాకు తెలీదు. 331 00:25:43,794 --> 00:25:45,337 అతనితో నాకేం సంబంధం లేదు. 332 00:25:45,420 --> 00:25:47,798 ఈ బహుమతిని నేను తీసుకోను. 333 00:26:05,482 --> 00:26:08,819 టోక్యోకి వెళ్లి ఒక ఆట చూడడానికి నేను ఏమైనా చేస్తా. 334 00:26:08,902 --> 00:26:11,488 బేబ్ రూత్ లాంటి అద్భుతమైన ఆటగాడు ఒకడు ఉన్నాడు! 335 00:26:11,572 --> 00:26:14,199 -అలాంటి ఆటగాడి గురించి నేను ముందు వినలేదు. -ఎందుకంటే నీకు ఏమీ తెలీదు కాబట్టి. 336 00:26:14,908 --> 00:26:18,620 హే. ఎక్కడికి వెళ్తున్నావు? చూస్తుంటే బరువు ఎక్కువ అయినట్టు ఉంది. 337 00:26:19,955 --> 00:26:21,081 నువ్వు అందంగా ఉన్నావు. 338 00:26:22,249 --> 00:26:23,584 నేను నీకు సహాయం చేయనా? 339 00:26:26,211 --> 00:26:30,007 క్షమించండి, నాకు అర్థం కాదు. నేను పడవ ఎక్కడానికి వెళ్ళాలి. 340 00:26:30,090 --> 00:26:32,968 ఆ మాటలు విన్నావా. చివరికి వీళ్ళ భాష కూడా కంపరం పుట్టిస్తుంది. 341 00:26:33,969 --> 00:26:35,304 ఆ బ్యాగులలో ఏం ఉంది? 342 00:26:35,387 --> 00:26:38,557 మా అమ్మ కంగారు పడుతుంది. నేను వెళ్ళాలి. 343 00:26:38,640 --> 00:26:40,058 ఆపండి! 344 00:26:40,767 --> 00:26:43,437 ఇప్పుడు అర్థమైంది. మీ ఇలాంటి చెత్త తింటారు కాబట్టి అలా కంపు కొడతారు. 345 00:26:43,520 --> 00:26:45,397 మా కుక్కలు కూడా ఇలాంటి తిండి తినవు. 346 00:26:45,480 --> 00:26:46,607 నాతో ఎవరు పందెం కాస్తారు? 347 00:26:46,690 --> 00:26:50,277 ఇవా, లేక దానివా? ఏవి పెద్దగా ఉంటాయి? 348 00:26:50,360 --> 00:26:51,945 చూద్దాం పదండి. 349 00:26:52,029 --> 00:26:53,488 ఏం చేస్తున్నారు? వదిలేయండి! 350 00:26:53,572 --> 00:26:55,157 -హే, ఏం చేస్తున్నారు? -ఆమెను వదలండి! 351 00:26:55,240 --> 00:26:56,950 వదిలేయండి! 352 00:27:04,917 --> 00:27:07,252 ఎవరైనా కాపాడండి! కాపాడండి! 353 00:27:08,420 --> 00:27:11,715 ఆపండి! దయచేసి నన్ను వదలండి! 354 00:27:14,092 --> 00:27:15,427 నాపై నుండి లెగు! 355 00:27:21,558 --> 00:27:22,768 వెధవల్లారా. 356 00:27:23,268 --> 00:27:24,394 చావాలని ఉందా? 357 00:27:25,312 --> 00:27:27,064 మీరిద్దరూ ఇక్కడ చచ్చినా కూడా, 358 00:27:27,814 --> 00:27:30,067 ఎవరూ మీకోసం ఏడవరు. 359 00:27:32,486 --> 00:27:34,321 వెంటనే, ఆమెకు క్షమాపణలు చెప్పండి. 360 00:27:34,404 --> 00:27:36,031 లేదంటే ఏమవుతుందో మీకు తెలుసు. 361 00:27:40,577 --> 00:27:42,204 తలలు ఇంకా కిందకు దించండి. 362 00:27:43,622 --> 00:27:45,082 మమ్మల్ని దయచేసి క్షమించు. 363 00:27:47,918 --> 00:27:49,461 మేము పనికిరాని వెధవలం! 364 00:27:49,545 --> 00:27:51,713 మమ్మల్ని దయచేసి పోనివ్వండి. 365 00:27:51,797 --> 00:27:53,382 మమ్మల్ని క్షమించండి! 366 00:27:56,718 --> 00:27:58,554 నీకు సంతృప్తి కలగకపోతే చెప్పు. 367 00:27:58,637 --> 00:28:00,264 సంతృప్తి కలిగే వరకు వీళ్ళు వేడుకొనేలా చేస్తాను. 368 00:28:05,352 --> 00:28:06,562 బయటకి పోండి. 369 00:28:13,277 --> 00:28:15,112 వాళ్ళు ఇక నిన్ను ఇబ్బంది పెట్టరు. 370 00:28:20,784 --> 00:28:23,996 ఆ కుర్రాళ్ళకి ఏమని చెప్పావు? 371 00:28:24,079 --> 00:28:27,207 నిన్ను మళ్ళీ ఏడిపిస్తే, వాళ్ళను చంపి 372 00:28:27,291 --> 00:28:29,293 వారి శవాలను కుక్కలకు వేస్తానని చెప్పా. 373 00:28:33,881 --> 00:28:35,757 నువ్వు గాబరా పడకూడదని అలా అన్నానులే. 374 00:28:47,394 --> 00:28:49,479 ఈ దేశం ఎంత అందంగా ఉందనే విషయాన్నే మర్చిపోయాను, 375 00:28:51,148 --> 00:28:52,441 ఎంత దృఢ సంకల్పం ఉన్నదో, 376 00:28:53,859 --> 00:28:55,485 బలమైనదో మర్చిపోయాను. 377 00:29:07,039 --> 00:29:08,749 నువ్వు ఇక్కడి నుండి వెళ్లి ఎన్నాళ్లు అయింది? 378 00:29:10,167 --> 00:29:11,585 పద్నాలుగు ఏండ్లు. 379 00:29:12,294 --> 00:29:14,421 ఇక్కడ ఉన్న దానికంటే ఎక్కవ అక్కడే గడిపాను. 380 00:29:46,078 --> 00:29:47,621 ఏం చింతించకు, నాకు వేరే ఉద్దేశం లేదు. 381 00:29:53,085 --> 00:29:54,461 ఈ చొక్కాని విసిరేస్తావా? 382 00:29:55,879 --> 00:29:56,922 నేనెందుకు విసిరేస్తాను? 383 00:30:01,593 --> 00:30:03,470 నువ్వు వింత పిల్లవి. 384 00:30:05,138 --> 00:30:08,308 జనాన్ని కుక్కలకు వేస్తానని చెప్పింది నేను కాదు కదా. 385 00:30:13,438 --> 00:30:18,777 రేపు బట్టలు ఉతికే చోటికి తీసుకురా, మధ్యాహ్నానికి ఉతికి పెడతాను. 386 00:31:37,689 --> 00:31:38,690 బామ్మ గారు, 387 00:31:38,774 --> 00:31:41,485 మిమల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, కానీ మీతో మాట్లాడదామని వచ్చాను. 388 00:31:42,528 --> 00:31:43,529 నువ్వు ఏం అమ్ముతున్నావు అబ్బాయి? 389 00:31:43,612 --> 00:31:44,780 కొనడానికి వచ్చాను. 390 00:31:47,199 --> 00:31:49,993 ఆ వెధవలకు ఇంకేం తోచడం లేదు అనుకుంట. 391 00:31:50,077 --> 00:31:52,120 కొరియన్ మాట్లాడే నిన్ను ఎక్కడ వెతికి పట్టుకున్నారు? 392 00:31:53,080 --> 00:31:54,915 నేనే వాళ్ళ దగ్గరకి వచ్చానండి. 393 00:31:57,167 --> 00:31:58,627 నువ్వెందుకు అలా చేసావు? 394 00:32:02,339 --> 00:32:04,383 నువ్వు మొండివాడివి, ఆ విషయాన్ని ఒప్పుకుంటాను. 395 00:32:04,466 --> 00:32:05,467 దయచేసి దీన్ని తెరవండి. 396 00:32:13,934 --> 00:32:15,477 వీటిని ఈ ఆకారంలోనే పెంచుతారు. 397 00:32:16,436 --> 00:32:17,729 పెంచుతారా? 398 00:32:17,813 --> 00:32:19,189 అవును, కానీ రుచి బాగోదని అంటుంటారు. 399 00:32:19,273 --> 00:32:20,774 అయినా కూడా వీటి ఖరీదు దాదాపు నాలుగు వేల రూపాయలు. 400 00:32:21,275 --> 00:32:22,484 నాలుగు వేలే! 401 00:32:23,318 --> 00:32:24,695 నీకు పిచ్చి అనుకుంట. 402 00:32:30,617 --> 00:32:31,994 బామ్మ గారు. 403 00:32:33,161 --> 00:32:36,874 మీరు 1955లో ఈ స్థలాన్ని రెండు వేల రూపాయలకు కొన్నారు. 404 00:32:38,417 --> 00:32:40,794 అది ఈ పుచ్చకాయ రేటులో సగం. 405 00:32:43,130 --> 00:32:44,590 ఇప్పుడు గనుక మీరు అమ్మడానికి ఒప్పుకుంటే, 406 00:32:45,174 --> 00:32:47,050 మేము మీకు 64 కోట్ల రూపాయలు ఇస్తాం. 407 00:32:59,521 --> 00:33:02,441 కుర్రోడివే అయినా, కొరియన్ బాగా మాట్లాడుతున్నావు. 408 00:33:03,775 --> 00:33:05,861 అమెరికా వెళ్లడం వల్ల కాస్త పట్టు తప్పింది. 409 00:33:08,322 --> 00:33:10,282 నువ్వు నా బిడ్డలకన్నా చాలా మేలు. 410 00:33:12,868 --> 00:33:15,037 నా భర్త కొన్నాళ్ల క్రితం పోయాడు. 411 00:33:15,746 --> 00:33:18,081 పిల్లలు ఈ భాషను నేర్చుకోవడం ఆయనకీ ఇష్టం లేదు. 412 00:33:19,583 --> 00:33:21,752 ఇప్పుడు నా పిల్లలకు 413 00:33:21,835 --> 00:33:24,713 వాళ్ళ తల్లి సొంత భాష ఎలా ఉంటుందో కూడా తెలీదు. 414 00:33:26,798 --> 00:33:27,925 అది మీకు బాగా బాధ కలిగిస్తున్నట్టు ఉంది. 415 00:33:31,595 --> 00:33:33,180 నీకు కొరియన్ నేర్పింది ఎవరు? 416 00:33:34,473 --> 00:33:36,016 మా అమ్మమ్మ నేర్పింది. 417 00:33:38,936 --> 00:33:41,104 నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. 418 00:33:41,980 --> 00:33:44,900 నాన్నేమో గంటల తరబడి పనిలోనే ఉండేవారు. 419 00:33:45,609 --> 00:33:47,486 నన్ను మా అమ్మమ్మే పెంచింది. 420 00:33:48,654 --> 00:33:50,822 ఆమె కూడా చాలా కష్టాలు అనుభవించి ఉంటుంది. 421 00:33:54,451 --> 00:33:56,286 తన కుటుంబాన్ని పోషించడానికి, 422 00:33:56,787 --> 00:34:00,040 ఆమె తోపుడు బండి తోస్తూ, పచ్చళ్లను అమ్ముతూ, 423 00:34:00,123 --> 00:34:01,875 రాత్రింబవళ్ళు కష్టపడింది. 424 00:34:01,959 --> 00:34:03,252 ఆ మిరపకాయల వల్ల ఆమె చేతులు మండిపోయేవి. 425 00:34:03,335 --> 00:34:04,753 ఇక చాలులే. 426 00:34:05,587 --> 00:34:07,589 కష్టపడని కుటుంబం ఏముంటుంది? 427 00:34:09,925 --> 00:34:11,260 నిజం చెప్పు. 428 00:34:11,885 --> 00:34:14,263 ముసలివాళ్ళు తమ కష్టాల గురించి చెప్తుంటే, 429 00:34:14,346 --> 00:34:15,848 చిరాకు పుడుతుంది కదా? 430 00:34:18,934 --> 00:34:21,603 చిరాకు పుట్టాలనే కదా చెప్పేది? 431 00:34:23,938 --> 00:34:25,190 మాపై ఒత్తిడి పెట్టడానికే కదా చెప్తారు? 432 00:34:33,614 --> 00:34:37,244 మీ పిల్లల గురించి ఆలోచించండి. ఇచ్చిన ఆఫర్ కి ఒప్పుకొండి. 433 00:35:04,104 --> 00:35:05,105 ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళావా? 434 00:35:06,023 --> 00:35:07,983 నీకు చదవడం, రాయడం వచ్చా? 435 00:35:08,650 --> 00:35:11,153 వెళ్ళమని మా నాన్న చెప్తుండేవారు, 436 00:35:11,236 --> 00:35:12,863 కానీ అదంతా వృధా అని మా అమ్మ అభిప్రాయం. 437 00:35:13,530 --> 00:35:14,573 అయ్యయ్యో. 438 00:35:15,073 --> 00:35:16,825 సరైన మెళకువలు ఉంటే, 439 00:35:17,951 --> 00:35:19,995 నువ్వు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. 440 00:35:20,078 --> 00:35:21,788 నేను ఎందుకు వెళ్ళిపోతాను? 441 00:35:22,456 --> 00:35:26,043 ఇది నా పుట్టిన స్థలం, మా తల్లితండ్రుల ఇల్లు. 442 00:35:26,627 --> 00:35:28,045 మీ అందరికీ కావాల్సింది అదేనా? 443 00:35:33,842 --> 00:35:36,220 నా మాటలు నీకు బాధ కలిగిస్తాయని నేను అనుకోలేదు. 444 00:35:37,137 --> 00:35:39,765 నేను బీదదాన్ని, చదువు లేనిదాన్ని అని నాకు తెలుసు. 445 00:35:39,848 --> 00:35:42,518 నీకు, జియున్ కి ఉన్నట్టు ఖరీదైన వస్తువులు నేనెప్పటికీ వాడలేను, 446 00:35:42,601 --> 00:35:44,853 అయినంత మాత్రాన నన్ను చూసి నవ్వే హక్కు మీకు లేదు. 447 00:35:45,812 --> 00:35:47,147 నేను అందుకు ఒప్పుకోను. 448 00:35:48,607 --> 00:35:50,067 నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. 449 00:35:50,150 --> 00:35:51,235 అలా అనుకోకు. 450 00:35:55,364 --> 00:35:57,491 నీకు ఏమైనా కలలు ఉన్నాయా అని అడుగుతున్నాను అంతే. 451 00:35:58,575 --> 00:36:00,494 ఒకప్పుడు నేను కూడా నీలాగే బీదవాడిని. 452 00:36:02,955 --> 00:36:04,122 నీకంటే బీదగాడిని, 453 00:36:05,040 --> 00:36:06,500 నువ్వు నమ్మినా, నమ్మకపోయినా పర్లేదు. 454 00:36:08,669 --> 00:36:11,505 అయినా కూడా, నేను కలలు కనడం ఆపలేదు. 455 00:36:11,588 --> 00:36:13,966 అలాగే నా కలలను ఎవరూ కాదనడానికి ఒప్పుకోలేదు కూడా. 456 00:36:25,561 --> 00:36:27,104 మనం ఇక్కడ యంగ్డో దగ్గర ఉన్నాం. 457 00:36:29,189 --> 00:36:30,190 ఇది జపాన్. 458 00:36:31,233 --> 00:36:32,651 ఇక్కడ ఒసాకా ఉంది. 459 00:36:32,734 --> 00:36:34,319 నేను ఉండేది అక్కడే. 460 00:36:34,820 --> 00:36:36,405 అక్కడ నీకు దొరకనిది అంటూ ఏమీ లేదు. 461 00:36:39,616 --> 00:36:41,743 అమెరికా నుండి వచ్చే మధురమైన నారింజలు. 462 00:36:41,827 --> 00:36:43,620 తైవాన్ నుండి వచ్చే అరటిపళ్ళు. 463 00:36:43,704 --> 00:36:45,455 ఫ్రాన్స్ నుండి వచ్చే అద్భుతమైన మిఠాయిలు. 464 00:36:46,540 --> 00:36:48,125 అలాగే ప్రతీ ఇంట్లో కరెంట్ కూడా ఉంటుంది. 465 00:36:48,709 --> 00:36:51,044 చలికాలంలో వెచ్చగా ఉంచడానికి కరెంట్ హీటర్లు కూడా. 466 00:36:51,753 --> 00:36:53,922 నిన్ను ఊర్లో ఎక్కడికైనా తీసుకెళ్లగల కరెంట్ రైళ్లు కూడా. 467 00:36:55,465 --> 00:36:58,218 అలాగే, రాత్రి అయితే వీధుల్లో లైట్లు వెలుగుతాయి, 468 00:36:58,969 --> 00:37:02,014 వాటి ప్రకాశాన్ని చూస్తుంటే మతి పోతుంది. 469 00:37:03,473 --> 00:37:04,975 నిజానికి అదొక అద్భుతం అనొచ్చు. 470 00:37:08,520 --> 00:37:10,606 కేవలం ఒసాకాలో మాత్రమే అన్ని ఉంటే, 471 00:37:11,857 --> 00:37:13,692 ఇక ప్రపంచం అంతటిలో ఇంకెన్ని అద్భుతాలు ఉంటాయో ఆలోచించు. 472 00:37:17,988 --> 00:37:18,989 మంచూరియా. 473 00:37:20,574 --> 00:37:21,783 చైనా. 474 00:37:22,910 --> 00:37:23,911 యూరోప్. 475 00:37:24,828 --> 00:37:26,371 ఇక ప్రపంచానికి అటువైపుగా వెళ్తే... 476 00:37:33,086 --> 00:37:34,129 అమెరికా. 477 00:37:46,725 --> 00:37:47,809 అక్కడికి ఒకసారి వెళ్లాను. 478 00:37:56,109 --> 00:37:57,694 అక్కడ ఎలా ఉంది? 479 00:38:01,073 --> 00:38:04,660 అన్నీ ఉన్నాయి. అలాగే ఏమీ లేదు. 480 00:38:13,919 --> 00:38:15,587 నీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? 481 00:38:26,056 --> 00:38:27,724 ఇది జపాన్ అంటావా? 482 00:38:29,309 --> 00:38:30,978 అలాగే ఇక్కడ మనం ఉన్నామా? 483 00:38:34,189 --> 00:38:35,399 బావుంది. 484 00:38:35,482 --> 00:38:36,483 ఏంటి? 485 00:38:38,151 --> 00:38:39,236 నేను ఏమనుకుంటున్నాను అంటే... 486 00:38:41,154 --> 00:38:43,866 జపాను దేశం మాకంటే చాల పెద్దది అని అనుకునేదాన్ని. 487 00:38:45,158 --> 00:38:48,078 మమ్మల్ని మింగేయగల విస్తార రాజ్యం అనుకునేదాన్ని. 488 00:38:49,788 --> 00:38:51,331 దీన్ని బట్టి నీకు తెలిసింది ఏంటి? 489 00:38:54,376 --> 00:38:56,628 మేము ఇలా అణిగి ఉండాల్సిన పని లేదు. 490 00:38:59,131 --> 00:39:00,841 మేము వాళ్ళను ఓడించగలం. 491 00:39:14,062 --> 00:39:15,314 సూన్జా, 492 00:39:18,400 --> 00:39:19,943 నాకు మళ్ళీ రావాలని ఉంది. 493 00:39:20,027 --> 00:39:21,528 నువ్వు బట్టలు ఉతుకుతున్నప్పుడు. 494 00:39:23,906 --> 00:39:25,115 నేను రావచ్చా? 495 00:40:09,451 --> 00:40:12,120 ఇవాళ వాటి రుచి మారింది. 496 00:40:15,541 --> 00:40:17,793 నిన్న చేదుగా అనిపించాయి. 497 00:40:26,677 --> 00:40:28,554 మొన్న నువ్వు జియున్ ప్రస్తావన లేవనెత్తావు. 498 00:40:29,054 --> 00:40:30,055 ఎందుకు? 499 00:40:30,556 --> 00:40:31,598 ఆమె గురించి ప్రస్తావించి ఉండకూడదు. 500 00:40:32,599 --> 00:40:35,727 నా దగ్గర లేని దానికి ఆమెను నిందించడం సరైన పద్దతి కాదు. 501 00:40:36,520 --> 00:40:37,521 ఎందుకు కాదు? 502 00:40:38,689 --> 00:40:40,941 ఆమెకు ఉన్నదాన్ని ఆమె కష్టపడి సంపాదించలేదు. 503 00:40:41,942 --> 00:40:45,529 కానీ జియున్, ఇంకా ఆమె లాంటి వారు త్వరలోనే చేదైన అనుభవాలను చవిచూస్తారు. 504 00:40:46,697 --> 00:40:47,906 అంటే నీ ఉద్దేశం ఏంటి? 505 00:40:47,990 --> 00:40:50,868 ఆమె తండ్రి ప్రభుత్వానికి చాలా పన్నులు చెల్లించాల్సి ఉంది. 506 00:40:50,951 --> 00:40:53,287 కాబట్టి అతి త్వరలోనే వాళ్ళ నేలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. 507 00:40:54,246 --> 00:40:56,582 తమ సొంత ఆస్తిని కోల్పోవడం ఎవరి విషయంలో అయినా అన్యాయమే. 508 00:40:57,708 --> 00:40:59,710 నువ్వు కూడా వాళ్లలాగే వెర్రిదానిలా మాట్లాడుతున్నావు. 509 00:41:00,210 --> 00:41:01,879 నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా? 510 00:41:02,462 --> 00:41:03,839 అస్సలు లేదు. 511 00:41:03,922 --> 00:41:05,507 నీకు కూడా ఉండకూడదు. 512 00:41:05,591 --> 00:41:07,050 జనం ఎక్కడైనా అదే కుళ్లుతో ఉంటారు. 513 00:41:08,343 --> 00:41:09,428 ఆపై... 514 00:41:11,305 --> 00:41:12,723 జపాన్ నీ ఇల్లు అయితే 515 00:41:13,932 --> 00:41:15,642 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 516 00:41:17,311 --> 00:41:19,563 నా చిన్నతనంలో, ఏమీ లేకుండా దేశం వదిలి వెళ్లాను. 517 00:41:19,646 --> 00:41:21,607 ఇప్పుడు జీవితంలో సాధించాను, కాబట్టి నేను వదిలి... 518 00:41:24,526 --> 00:41:26,528 వెళ్లిన దేశం ఇంకా ఉందో లేదో... 519 00:41:27,821 --> 00:41:29,489 చూద్దామని వచ్చాను. 520 00:41:30,616 --> 00:41:31,909 బహుశా వెర్రి పని చేసినట్టు ఉన్నాను. 521 00:41:32,409 --> 00:41:34,786 అయితే, ఇంకా అప్పటి నీ జ్ఞాపకాలు నీలో మెదులుతున్నాయా? 522 00:41:47,049 --> 00:41:48,300 నువ్వు ఏం చేస్తున్నావు? 523 00:41:50,385 --> 00:41:51,929 నా చిన్నప్పుడు, 524 00:41:52,012 --> 00:41:54,765 నాకు, మా నాన్నగారికి, చెరొక సూట్ ఉండేది. 525 00:41:55,474 --> 00:41:59,144 ప్రతీ రాత్రి నేను వాటిని ఉతికి, ఆరబెట్టేవాడిని. 526 00:41:59,228 --> 00:42:01,355 ఉదయానికి ఇంకా తడిగానే ఉన్నా కూడా అవే వేసుకొని వెళ్లేవారం. 527 00:42:01,855 --> 00:42:02,856 ఒకరోజు, 528 00:42:03,649 --> 00:42:06,068 మంటల దగ్గర బట్టలు పెడితే మంచిదని గొప్ప ఐడియా వచ్చింది 529 00:42:06,818 --> 00:42:07,861 బట్టలు త్వరగా ఆరతాయని. 530 00:42:10,239 --> 00:42:12,366 వంట వండుదాం అని కాస్త దృష్టి మరల్చాను. 531 00:42:14,159 --> 00:42:15,869 నాకు ఇంకా బాగా గుర్తుంది. 532 00:42:16,828 --> 00:42:20,749 బార్లే జావ మాడకుండా ఉండడానికి దాన్ని కలుపుతూనే ఉండాలి. 533 00:42:21,500 --> 00:42:23,502 కానీ కలుపుతున్నపుడు, నాకు ఒక వాసన వచ్చింది. 534 00:42:23,585 --> 00:42:25,212 నేను బయటకు వెళ్లేసరికి, 535 00:42:25,712 --> 00:42:26,797 మా నాన్నగారి సూట్ చేతి దగ్గర... 536 00:42:28,715 --> 00:42:29,716 పెద్ద కన్నం పడిపోయింది. 537 00:42:31,260 --> 00:42:32,261 మొత్తం కాలింది. 538 00:42:35,973 --> 00:42:37,724 ఆ రాత్రి నన్ను చాలా తిట్టారు. 539 00:42:41,186 --> 00:42:43,647 మీ నాన్నగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 540 00:42:47,067 --> 00:42:48,068 ఇక లేరు. 541 00:42:48,735 --> 00:42:50,445 ఆయన జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయి చాలా కాలం అయింది. 542 00:43:20,976 --> 00:43:22,936 ప్రపంచంలో ఇంత వర్షం ఎలా ఉంది? 543 00:43:24,354 --> 00:43:26,064 ఉంటే ఉంది, అంతా ఇక్కడే యంగ్డోలో పడాలా? 544 00:43:27,399 --> 00:43:28,734 సియోల్ లో పడొచ్చు కదా? 545 00:43:28,817 --> 00:43:29,818 లేదా జపాన్ లో? 546 00:43:30,402 --> 00:43:31,612 లేదా చైనాలో? 547 00:43:35,616 --> 00:43:36,742 సూన్జా! 548 00:43:38,160 --> 00:43:39,453 వచ్చి మాకు సహాయం చెయ్. 549 00:43:51,507 --> 00:43:52,758 నీకేమైంది? 550 00:43:59,348 --> 00:44:02,392 మీ కూతురికి కనుగొనబడడం ఇష్టం లేదు. 551 00:44:02,476 --> 00:44:05,646 లేదంటే మీకు కొంత సమాచారాన్ని ఇచ్చే వాడిని. 552 00:44:07,564 --> 00:44:08,982 అంటే, ఏం ప్రయోజనము లేదా? 553 00:44:11,818 --> 00:44:14,446 కానీ మీరు చేయగలది ఏదోకటి ఉంటుంది కదా. 554 00:44:14,530 --> 00:44:15,989 ఏదైనా పర్లేదు! 555 00:44:16,949 --> 00:44:19,409 మీకు పనికొచ్చేది ఏం లేదు. 556 00:44:21,620 --> 00:44:24,498 అంటే ఆమె ఉన్నట్టుండి మాయమైపోయిందా? 557 00:44:26,708 --> 00:44:28,877 యేట్సుకో, నాకోసం కారులో ఎదురుచూడు. 558 00:44:29,461 --> 00:44:30,546 పేమెంట్ నేను చూసుకుంటాను. 559 00:44:31,129 --> 00:44:35,384 మన డబ్బు వృధా కావడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదని ముందే ఊహించి ఉండాల్సింది. 560 00:44:36,552 --> 00:44:38,470 ఇక నన్ను మాట్లాడనివ్వు. 561 00:44:41,098 --> 00:44:42,766 మీ సహాయానికి ధన్యవాదాలు. 562 00:44:51,233 --> 00:44:52,484 అయితే... 563 00:44:53,986 --> 00:44:55,320 మీకు ఏం తెలుసు? 564 00:44:58,156 --> 00:44:59,783 సంధ్యవేళకు, 565 00:44:59,867 --> 00:45:04,538 రాజు గారిని, సాంప్రదాయం ప్రకారం వారి తల్లిదండ్రుల పక్కన ఖననం చేసారు. 566 00:45:04,621 --> 00:45:09,293 మూడు శవ పేటికలలో, కొన్ని వ్యక్తిగత వస్తువులతో ఆయన్ని ఖననం చేసారు. 567 00:45:15,090 --> 00:45:17,384 ఆమె చివరిగా టోక్యోలో ఎనిమిది నెలల క్రితం కనిపించింది. 568 00:45:20,387 --> 00:45:21,430 ఏంటి? 569 00:45:25,350 --> 00:45:26,643 అంటే ఏంటి అర్థం? 570 00:45:27,227 --> 00:45:28,520 అంటే... 571 00:45:31,732 --> 00:45:33,942 ఆమె ఒక సాని కొంపలో పని చేస్తుంది. 572 00:45:35,777 --> 00:45:39,323 ఆమెకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. 573 00:46:07,309 --> 00:46:08,310 చెప్పండి. 574 00:46:11,605 --> 00:46:12,689 హలో? 575 00:46:15,901 --> 00:46:17,069 హలో? 576 00:46:17,152 --> 00:46:21,114 ఇప్పుడు నీ స్వరం వినడం చాలా వింతగా ఉంది. 577 00:46:23,367 --> 00:46:24,826 హానా, అది నిజంగా నువ్వేనా? 578 00:46:24,910 --> 00:46:27,204 నా స్వరాన్ని కూడా మర్చిపోయావా? 579 00:46:28,413 --> 00:46:30,415 నీ యాస ఎందుకు అలా మారింది? 580 00:46:32,501 --> 00:46:35,212 హానా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 581 00:46:35,295 --> 00:46:37,214 తమాషాలు చేయకు. 582 00:46:37,297 --> 00:46:41,134 ఇప్పటి వరకు అసలు నా గురించి అలోచించి కూడా ఉండవు అని పందెం కాయగలను. 583 00:46:43,136 --> 00:46:44,555 అది నిజం కాదు. 584 00:46:52,020 --> 00:46:54,439 వర్షం వల్ల జరిగే ఒక ఒక్క మంచి ఇది. 585 00:46:54,523 --> 00:46:56,275 దుంగల నిండా పుట్టగొడుకులు వస్తాయి. 586 00:46:57,401 --> 00:46:58,402 ఇప్పుడా? 587 00:46:59,570 --> 00:47:00,946 ఎందుకు కాదు? 588 00:47:01,697 --> 00:47:04,366 మీ అమ్మకు కొన్నిటిని తీసుకెళ్లి మంచి సూప్ చేసి పెట్టు. 589 00:47:05,409 --> 00:47:06,618 మరి బట్టల సంగతి? 590 00:47:06,702 --> 00:47:07,911 ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం. 591 00:47:08,662 --> 00:47:10,038 కాబట్టి సగం సమయమే పడుతుంది. 592 00:47:10,581 --> 00:47:12,708 నా ఫోన్ నంబర్ నీకెలా తెల్సింది? 593 00:47:13,417 --> 00:47:16,253 చూసావా, అందరూ నన్ను తక్కువ అంచనా వేస్తారు. 594 00:47:17,337 --> 00:47:18,338 నువ్వు కూడా. 595 00:47:18,839 --> 00:47:20,591 నువ్వు ఎక్కడికి వెళ్ళావు? 596 00:47:20,674 --> 00:47:22,176 ఇంత బోరింగ్ ప్రశ్నలు వేస్తావు ఎందుకు? 597 00:47:23,051 --> 00:47:26,263 నేను ఇంకా అందగానే ఉన్నానో లేదో అడుగు. 598 00:47:28,307 --> 00:47:29,516 నువ్వు ఇంకా అందంగానే ఉన్నావా? 599 00:47:31,351 --> 00:47:32,811 నా కళ్ళు మూసుకుంటే, 600 00:47:33,687 --> 00:47:37,232 కొన్నిసార్లు నాకు ఇంకా మనిద్దరి దృశ్యమే కనిపిస్తుంది. 601 00:47:39,109 --> 00:47:41,695 ఎన్నో ఆశలు పెట్టుకొనే ఉండేవారం, అవునా? 602 00:47:42,362 --> 00:47:43,780 అప్పుడు మనం పిల్లలం. 603 00:47:44,990 --> 00:47:46,658 అది నిజం కాదు. 604 00:47:47,618 --> 00:47:49,661 ఎంతో తెలివిగా, స్వేచ్ఛగా ఉండేవారం. 605 00:47:54,041 --> 00:47:57,252 నువ్వు ఎక్కడ ఉన్నావో దయచేసి చెప్పు. 606 00:47:58,128 --> 00:48:01,673 చెప్పినా, నా దగ్గరకు ఎలా రావాలో కూడా నీకు తెలీదు. 607 00:48:01,757 --> 00:48:03,383 నేను నిన్ను కనిపెడతాను. 608 00:48:03,467 --> 00:48:07,554 నేను డిప్రెషన్ లో కూరుకుపోయాను, సోలొమన్. 609 00:48:09,348 --> 00:48:14,019 ఎన్నాళ్లగానో కూరుకుపోయి ఉన్నాను, ఇప్పుడు ఎలా బయటపడాలో కూడా తెలీదు. 610 00:48:16,104 --> 00:48:17,189 నువ్వు కూడా... 611 00:48:18,815 --> 00:48:20,984 నన్ను కనుగొనలేవు. 612 00:48:35,290 --> 00:48:38,877 యేట్సుకో గారు నీకోసం వెతుకుతున్నారు. 613 00:48:38,961 --> 00:48:40,546 ఆమెకు ఏమీ చెప్పకు. 614 00:48:41,171 --> 00:48:43,465 చెప్తే ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయను, ఇక నీ ఇష్టం. 615 00:48:43,549 --> 00:48:45,217 ఆమె ఇంకా నీ గురించే కలలు కంటుంది. 616 00:48:45,300 --> 00:48:46,635 నేను ఫోన్ పెట్టేస్తా! నిజంగా అంటున్నాను. 617 00:48:47,219 --> 00:48:50,264 నువ్వు ఎందుకు వెళిపోయావు? మమ్మల్ని ఎందుకు వదిలేసావు? 618 00:48:51,974 --> 00:48:55,018 అది నా నిర్ణయం కాదు, ఆ విషయం నీకు కూడా తెలుసు! 619 00:48:55,102 --> 00:48:56,603 నేను వెళ్లాలని అనుకోలేదు. 620 00:48:56,687 --> 00:48:58,063 నిన్ను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు! 621 00:48:58,146 --> 00:49:00,858 కానీ నువ్వు వదిలి వెళ్లడం మంచిది అయింది. 622 00:49:00,941 --> 00:49:02,985 ఇప్పుడు నువ్వు ఒక అమెరికన్ లాగే మాట్లాడుతున్నావు. 623 00:49:04,486 --> 00:49:07,781 ఇక ఆ మహిళ, నీ పక్కనే ఉన్నది కదా, 624 00:49:07,865 --> 00:49:11,034 నీకు ఆమెపై కూడా కన్ను పడింది కదా? 625 00:49:11,702 --> 00:49:14,121 కానీ అలాంటి అమ్మాయిలంటే నాకు అస్సలు నచ్చరు. 626 00:49:14,746 --> 00:49:16,206 నువ్వు ఇప్పుడు నన్ను చూస్తున్నావా? 627 00:49:17,499 --> 00:49:19,084 లేదు, ఇప్పుడు చూడడం లేదు. 628 00:49:20,294 --> 00:49:21,962 నాకు నిద్ర వస్తుంది. 629 00:49:22,045 --> 00:49:23,046 ఆగు! 630 00:49:24,590 --> 00:49:26,258 నేను నీకు చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. 631 00:49:27,718 --> 00:49:29,178 ఎవరికీ చెప్పలేని విషయాలు. 632 00:49:30,179 --> 00:49:34,141 నీకు నా అవసరం ఇంకా ఉందని తెలుసుకోవడం బాగుంది. 633 00:49:35,392 --> 00:49:36,393 నాకు మంచిగా అనిపిస్తుంది. 634 00:49:37,936 --> 00:49:39,271 నువ్వు ఎక్కడ ఉన్నావు? 635 00:49:39,354 --> 00:49:40,981 నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. 636 00:49:41,064 --> 00:49:42,608 ఎప్పుడు? 637 00:49:42,691 --> 00:49:44,026 వీలైనప్పుడు. 638 00:49:47,821 --> 00:49:48,822 హానా? 639 00:49:50,449 --> 00:49:51,533 హానా? 640 00:52:08,128 --> 00:52:10,130 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్